గోపీ – Part 2 200

ఊహూ ఫలితం ఉండదక్కా ..ఆమె మొత్తం కుటుంబాన్నే లేపెయ్యాలనుకొంటోంది.
ఖనిజ తల పట్టుకొని కూచొంది.
గోపీ తీవ్రంగా అలోచించి ఆలోచించి శయనలోని శక్తిని మరో మారు పిలిచి కర్తవ్యం చెప్పమని అడిగాడు.
భీంసేన్ రావు తలచుకొంటే తనను ఆపొచ్చని…ఆయన తప్పితే శయనను ఆపగలిగే వారు ఎవరూ లేరని చెప్పింది.
గోపీ ఆ శక్తిని ఇంకా ఎంతసమయం ఉందో చెప్పమన్నాడు.
సమయానికైతే చాలా ఉందని ..కాని తొందర పడకపోతే ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పి,ఆమె నెలసరి దగ్గరపడుతూ ఉంటంతో తాను కూడా శయన కుండలిలో చాలా రోజులు ఉండలేనని తెలియజేసీంది.
ఇక ఆలోచించి ప్రయోజనం లేదనుకొని నేరుగా భీంసేన్ రావు దగ్గరికెళ్ళింది ఖనిజ… ఆయన మునుపటికన్నా కొద్దిగా బాగా కనిపిస్తున్నాడు.వొంట్లో చురుకు దనం వచ్చింది. మనిషి స్తిమితంగా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు…అదే విధంగా ఖనిజంటే మరింత ప్రేమ పెరిగింది.ఖనిజ రావడం చూసి రామ్మా కూచో .. అన్నాడు ఆప్యాయంగా.. నాన్నా . . . .మీతో పనుండి వచ్చా నాన్నా…. మ్యాటరు కొద్దిగా సీరియస్ …
ఆయన కంగారు పడ్డాడు. ఏమ్మా ఏమైయ్యింది. ..అన్నాడు ఆందోళనగా…
ఖనిజ ముందుగా అన్నీ ఆలోచించి పెట్టుకొని ఉంది కనుక అమ్మను కూడా పిలిపించి అసలు విశయాన్ని తిరగేసి మరగేసి చెప్పకుందా నేరుగా పాయంటుకొచ్చింది.నాన్నా ఇప్పుడు నేను చెప్పే విశయం కొద్దిగా ఇబ్బందిగా ఉండచ్చు ..బహుశా మీకు కోపం కూడా రావచ్చు.కానీ తప్పదు.
భీంసేన్ రావు పరిస్థితిని అర్థం చేసుకొన్నవాడల్లా చూడమ్మా …మీరేమీ చిన్న పిల్లలు కారు.ఇంటి పరిస్థితిని గూర్చి ఆలోచించే ధైర్యం స్థోమత మీకున్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఏమీ సంకోచించకుండా మాటాడు.
నాన్నా ….. మీరు మా మీద ఉంచిన నమ్మకం ఎన్నడూ వొమ్ముకాదు. కానీ ఇది మీ పర్సనల్ విశయం ఇంకా మనందరికీ సంబందించింది కాబట్టి ముందుగా మిమ్మల్ని అలా అభ్యర్థించాల్సి వచ్చింది.
చెప్పమ్మా…..
అమ్మా ..నాన్నా…. మీకూ పెద్దమ్మ వాళ్ళకున్న సంబందం ఎలాంటిది?
ఎలాంటిదేమిటి…మీ నాన్న పెదనాన్న అన్నదమ్ములు పెద్దమ్మ నాకు తోడికొడలు …అంది శారద దీర్ఘం తీస్తూ ..
అమ్మా . . . .నువ్వు కాస్త ఊరుకో..నీవొంతు తప్పకుండా వస్తుంది. అప్పుడు మాటాడుదువుగాని… నీవు చెప్పు నాన్నా ….
అమ్మ చెప్పింది కదే …..వాడు నేనూ ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం ….అన్నాడు కాస్త అయోమయంగా..
చూడు నాన్నా ఆ విశయం నాకూ తెలుసు … అది కాదు నేను అడుగుతున్నది..మీ నలుగురి మధ్యనున్న సంబంధం గూర్చి.