చాలా లక్కీ 3 117

చారి :- అలాగే చేద్దాం. . . కాని నీవు కూడా రావచ్చుగా. . .
లేదండీ. . . . నేను రాలేను నాకు ఈ సారి ముట్టు త్వరగా వచ్చేట్టుంది అని అబద్దం ఆడేసింది.
చారి :- అలాగా. . . . ఐతే సరి ,,,

ఈలోగా మోహన గగన్ ఇద్దరూ డైనింగ్ దగ్గరకు వచ్చారు.
చారి అమ్మ చెప్పింది తూ చా తప్పకుండా చెప్పి మోహనను ఒప్పించాడు. .
మోహన కూడా చారి కలిసి వెళ్ళడానికి ఉత్షాహం చూపడం తో గగన్ సరే అని అన్నాడు.

మరునాడు ఉదయాన్నే ఫ్లైట్ కు ఇద్దరూ వెళ్ళిపోంగానే గగన్ కు ఎందుకో ఒంటరి గా అనిపించింది.
వాడి ఒంటరి తనాన్ని చూసి అహన నవ్వుకొంది. ప్రేమలో మునిగి తేలుతున్నవాడి మనసు అలానే ఉంటది మరి.
చారి లేకపోవడంతో తాను ఒక్కడే ఆఫీసుకు బయలు దేరాడు.

వాడు అటు బయలు దేరి వెళ్ళగానే సావంత్ కు ఫోన్ చేసింది.

మళ్ళీ ఏమొచ్చిందిరా దేవుడా అనుకొంటూ ఫోన్ తీసాడు
వాడికి మరో మాటకు తావు ఇవ్వకుండా ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసింది.
మొన్న రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం తో గగన్ కు మొహం చూపించలేక సాధ్యమైనంత త్వరగా వీసా కి ప్రయత్నం చేసాడు సావంత్, మరో రెండు రోజుల్లో బయలు దేరి వెళ్ళిపోవాలి . . .ఇటు వంటి సమయంలో అహన ఫోన్ చేసి తనను ఉన్న ఫళాన బయలు దేరి రమ్మనడంలో మర్మమేమిటొ అర్థం కాలేదు. గగన్ కు ఏమైనా అయ్యిందేమో అని ఆందోళన పడుతూ బయలు దేరాడు.

సావంత్ ఇంటికి రాంగానే ఎటువంటీ ఉపోద్ఘాతం లేకండా నేరుగా విశయంలోనికొస్తూ. . .సావంత్ మన విశయం ఎటూ గగన్ కు తెలిసిపోయింది కాబట్టి నీవు గగన్ తో ముందులా యథాప్రకారం ఉండలేవు . . .అందుకే త్వరగా ఇండియా వదలి వెళ్లిపోతున్నవని అర్థం చేసుకొన్నాను. వెళ్లేముందు చిన్న పని చేసి పెట్టు ఊరికే మాత్రం కాదు. . .నేను ఇంతకు మునుపు ప్రామిస్ చేసినట్టుగా ఇదిగో ఇప్పుడే నీ అకౌంట్ కు పది కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను.

సావంత్ :- ఆగండి ఆంటీ . . .ఇప్పుడే సగం చచ్చిపోయాను. మళ్ళీ ఏదో అడుగుతున్నారు. అటు గగన్ కు మొహం చూపించలేక ఇప్పటికే కుమిలిపోతూ ఉన్నాను.
ఇవన్నీ నన్ను రేప్ చేసేముందు ఆలోచించాలి సావంత్. . . మోహనతో కలిసి డబల్ గేం ఆడినప్పుడు లేదా ఈ ఫీలింగ్ . . . నన్ను నమ్మకంగా మోసం చేసినప్పుడు లేదా ఈ ఫీలింగ్
సావంత్ :- అయ్యో ఆంటీ. . . . మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. . . . మోహం తో నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కేవలం గగన్ భార్య గా మాత్రమే ఇప్పుడు ఆలోచిస్తున్నాను.
గగన్ నీవు చిన్ననాటి నుండీ బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు సావంత్. . . . కాకపోతే మోహన గతం కూడా నీకు తెలుసు . . . ఆమె ఎటువంటిదో ఎక్కడి నుండి వచ్చిందో. . . ఇప్పుడు తన వల్ల నా ఇంట్లో నేను ఒక దోషిగా తల దించుకు బ్రతికే పరిస్థితి కల్పించారిద్దరూ. . అలా అని తల వంచుకు వెళ్లిపోయే మనస్థత్వం కాదు నాది. . . అందుకే చివరి సారిగా ఈ చిన్న పని చేసిపెట్టమని అడుగుతున్నా . . . లేదంటే అప్పనంగా వచ్చే కోట్ల డబ్బుతో పాటు నీ వీసా కూడా క్యాన్సల్ అయ్యి ఇంట్లో కూచోవాల్సి వస్తుంది ఆలోచించుకో

సావంత్ కు దిక్కుతోచకుండా అయ్యింది. . .అహనా దేవి తలచుకొంటే తనను నామ రూపాల్లేకుండా చేయగలదు. ఏదో ఫ్రెండ్ కోసం తాను మోహనతో కలిసి డబల్ గేం ఆడి దీన్ని అనుభవించి దేశం వదలి వెళ్లిపోవాలనుకొన్నాడు. ఎవరి స్నేహం కోసమైతే తాను ఇంత చేసేడో అది ఇలా అక్రమ సంభందంగా తన కెరీర్ నే దెబ్బ తీసేపరిస్థితికి వస్తుందని ఆలోచించలేక పోయాడు.

పిచ్చి చూపులు చూస్తున్న సావంత్ తన దారిలోకి వచ్చేసాడని అర్థమయ్యింది అహహనా దేవికి . . .వాడి అకౌంట్లోనికి పదికోట్లను ట్రాన్స్ఫర్ చేసింది.

ఫోన్ మెసేజీ రావడం తో ఉలిక్కిపడి మెసేజీ చూస్తే తన అకౌంట్ లో పదికోట్లు క్రెడిట్ అయినట్టు తెలిసింది.
ఏదో చెప్పలని నోరు తెరవబోతూ ఉంటే . . . అహన దేవి తాను చేయవలసిన పనిని చెప్పి ఇక వెళ్ల వచంటూ లేచి నిలబడింది.
చేసేదేం లేక హుస్సూర్ మంటూ బయలు దేరి వచ్చేసాడు.

వాడు అటు వెళ్లంగానే తన ప్లాన్ లో భాగంగా గగన్ కు ల్యాండ్ లైన్ నుండి రెండు మూడు సార్లు మిస్స్డ్ కాల్స్ ఇచ్చింది.
తను ఊహించినట్లుగానే వెంటనే రిటర్న్ కాల్ చేసాడు గగన్ . . .ఫోన్ ఎత్తకుండా గమ్మునుండి పోయింది.

ల్యాండ్ లైన్ నుండి ఫోన్ వచ్చిందే. . . . తను తిరిగి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తకపోవడంతో గగన్ చిరాకు పడుతూ వాచ్ మేన్ కు ఫోన్ చేసాడు.
ఇంటి విశయాలేవీ తెలీని వాచ్ మ్యాన్ అమ్మ గారు లోపలే ఉన్నట్టు ఇప్పుడే సావంత్ వచ్చి వెళ్ళాడని చెప్పడంతో కడుపు రగిలిపోయింది గగన్ కు.
వెంటనే సావంత్ కు ఫోన్ చేసాడు వాడిది స్విచ్ ఆఫ్ రావడం తో ఛీ అనుకొంటూ అమ్మకు ఫోన్ చేసాడు. తనూ ఫోన్ ఎత్తలేదు. ఇక ఆఫీసులో ఉండబట్టలేక ఇంటికొచ్చేసాడు.

ఇంటికి వచ్చీ రావడంతోనే ఇల్లు కప్పులేచిపోయేలా అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ వచ్చాడు.
తను కాం గా తన రూం లో ఉన్నట్టు చెప్పిందే కాని కిందకెళ్ళలేదు.
గగన్ ఆవేశంతో తన గదిలోనికొస్తూనే . . . అమ్మా సావంత్ వచ్చాడా అన్నాడు గట్టిగా
గగన్ :- ఆ ఏం. . . . అంది నింపాదిగా . . .తన మాట ఇంకా పూర్తి అయ్యిందో లేదో గగన్ చేయి గాల్లోకి లేవడం తన చెంపను చెళ్లు మనిపించడం ఒకే సారి జరిగిపోయాయి.

పెదవి చిట్లి నెత్తురు ఉప్పగా తగిలింది అహనకు. చెంపను గట్టిగా అదిమిపెట్టుకొని కన్నీళ్ళతో గగన్ వంక చూసింది.
గగన్ :- ఛీ నీది ఒక బ్రతుకేనా. . . నిన్న మొన్ననేగే ఏదో పొరబాటు జరిగిపోయిందని. . .నాన్నతో ఏమీ చెప్పొద్దని బ్రతిమాలాడావు. . .మళ్ళీ వాడితో కులకాలని నీకు మనసెలా వచ్చిందే. . . . అసలు నీవు మనిషివేనా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు.

కన్న కొడుకే తన మీద చేయి చేసుకోవడం తో అహనకు అహం దెబ్బ తింది. కాని తొందరపడకుండా తమాయించుకొందే కాని ఎదురు తిరిగి మాటాడలేదు.
అమ్మ అలా ఏమీ మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోవడం ఇంకా ఉక్రోషాన్ని తెప్పించింది గగన్ కు . . . అంతగా మొగాడు కావాలనుకొంటే నాన్నకు విడాకులిచ్చేసి కావాల్సిన వాడితో కులకొచ్చుగా

Updated: February 6, 2021 — 9:36 am

1 Comment

Comments are closed.