చాలా లక్కీ 3 117

మాటలు తిన్నగా రానీ గగన్

గగన్ :- ఛీ. .. . . నీతో మాట్లాడలంటేనే అసహ్యంగా ఉంది. . . ఇంకా తిన్నగా మాటలెలా వస్తాయ్.
అసలు ఇప్పుడేం జరిగిందో తెలుసు కోకుండా. . . నోటికెంతొస్తే అంత మాటాడుతున్నావు. . . . ఏం నాకు మాటలు రావనుకొన్నావా లేదా కొట్టడం రాదనుకొన్నావా

గగన్ :- నీకు మాటలు రావని ఎవరన్నారులే.. .రంకు నేర్చిన దానివి బొంక కుండా ఉంటావా . . .
గగన్ అని గట్టిగా అరిచింది.
గగన్ :- నీవు గట్టిగా అరిచినంత మాత్రాన తప్పు ఒప్పయిపోదు. . . నాన్న రానీ. . . నీ విశయం అటో ఇటో తేల్చేస్తా. . .
ఇక చాల్లేరా. . కన్న తల్లితో ఎలా మాట్లాడాలో తెలీని నీకు మంచీ చెడూ తెలుస్తాయని అనుకోవడం నాదే తప్పు నీవు ఇంత మూర్ఖుడు కాబట్టే అది నిన్ను బుట్ట బొమ్మలా చేసి ఆడిస్తోంది.మీ నాన్న వచ్చేదాకా ఎందుకాగడం ఇప్పుడే ఫోన్ చేసి విశయం చెప్పేయ్. . .అటో ఇటో తేలిపోతుంది.

గగన్ :- ఓ. . . . అంత దాకా వచ్చావా. . . మొత్తానికి నా భార్య మీద కోపం వల్ల నీ అసలు విశయం బయటపడుతోంది. . .ఇదీ ఒకందుకు మంచిదేలే. . .ఇంతకాలం నీ విశయం తెలీక భ్రమలో బ్రతికాను. . .అంటూ చారి కి ఫోన్ చేసాడు.
అప్పుడే శ్రీనగర్ లో ఫ్లైట్ దిగిన చారికి గగన్ నుండి ఫోన్ రావడం తో ఇదిగో అమ్మాయ్ . . . గగన్ ఫోన్ అంటూ. . ఫోన్ తీసి మోహన కిచ్చాడు .

మోహన:- చెప్పు బావా
ఫోన్ నాన్నకివ్వు
మోహన:- లగేజ్ కౌంటర్ లో ఉన్నారు. . .అర్జంటా . .
ఆ . . . సావంత్ మళ్ళీ ఇంటికొచ్చాడు. . .ఆ విశయం నాన్నాతో చెప్పేద్దామని
మోహన గుండె ఝల్లుమంది. . .తమాయించుకొని. . .ఇప్పుడేం మాట్లాడవద్దు. . . రేపు మేము ఇంటికొస్తాం గా అప్పుడు మాటాడదాం. .
మోహన అలా చెప్పడం తో కాస్తవెనక్కి తగ్గాడు. సరే అని ఫోన్ పెట్టేసాడు.
అలా నాన్నతో మాట్లాడడానికి అవకాశం దొరక్కపోవడంతో చేసేదేమీ లేకుండా సోఫాలో కూలబడుతూ. . . రేపటి కల్లా నీ బ్రతుకు బజారు పాలే . . . .సిద్దంగా ఉండు
అహన:- నేను బజారు పాలైతే. . .మీరందరూ సుఖంగా ఉంటామనుకొంటున్నార్రా. . .నాతో పాటు అందరి బ్రతుకులూ తెల్లారి పోతాయి.. . .అంది మొండిగా
ఛీ ఎంతకు తెగించావమ్మా . . .మనవళ్ళతో హాయిగా కృష్ణా రామా అనుకోనే వయసులో ఇవేం బుద్దులు . . . కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి .
అహన:- నేనేం అరవైయేళ్ళ ముసలి దాన్నేం కాదులేరా. . . మీమీద ఆధారపడి బ్రతకడానికి . . .అలా అని ఒళ్ళు బలిసి కొట్టుకోవడం లేదు. . . నీకు అసలు విశయాం తెలీదు. . .తెలుసుకొనే ఇంగితం కూడా లేదు. . . అందుకే కన్న తల్లి మీద చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు.

ఆ కళ్ళారా చూసిన తరువాతా ఇకా ఏం తెలుసుకోవాలో అన్నాడు వెటకారంగా
అహన:- అంత ఇది ఉన్నోడివి అక్కడే వాడిని నన్ను పట్టుఒని నిలదీయకుండా . . . నీ భార్యతో చెప్పుకొని కులుకుతారా ఎవరైనా. . .
అహన ఆ మాట అనంగానే గగన్ కు ఎక్కడో ఏదో తట్టింది.

Updated: February 6, 2021 — 9:36 am

1 Comment

Comments are closed.