చాలా లక్కీ 4 120

గగన్ గట్టిగా గాలి పీల్చుకొంటూ నిజమా అమ్మా
అహన : – మళ్ళీ నిజమా అని అడుగుతావేంట్రా . . . నీవో బడుద్దాయివి .. ఆవేశమే కాని ఆలోచన లేని వాడివి . . .అందుకే ప్రతీ విశయాన్ని నీ భార్యతో చెప్పుకొని ఏక పక్షంగా నిర్ణాయాలు తీసుకొంటున్నావు.
గగన్ తన మాట వింటున్నాడని అర్థమవుతూ ఉంటే . . . నువ్వు ఊరికే అలా పెరిగిపోయావురా. . .విశయాలను లోతుగా అలోచించడం ఇంకా రాలేదు. . .నీతో చాలా మాట్లాడాలి చెప్పాలి రా భోంచేస్తూ మాట్లాడుకొందాం అంటూ డైనింగ్ కేసి దారి తీసింది.

సంసార్ లేక్ దగ్గరలో తాము ఉన్న లక్జరీ హోటెల్ నుండి చారి మోహనలిద్దరూ చక్కగా తయారయ్యి దేవళానికి బయలు దేరారు. చుట్టూ మంచుకొండలతో భక్తులు చేసే కీర్తనలతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మోహన మనసంతా సంతోషంతో నిండిపోతోంది.
ఇదే కదా ప్రతీ ఆడపిల్లా కోరుకొనేది నా అనే వారుఎవరైనా ఒకరుండి మంచీ చెడ్డలు చూస్తూ ఉండి తమకు రక్షణగా ఉంటే ఆ ఆడపిల్ల ఎంతగా మురిసిపోతుందో అనడానికి తానొక ప్రత్యక్ష సాక్షి . . .ఈ విశయాన్ని గట్టిగా అరచి నలుగురికీ చెప్పలనిపించింది.
సంతోషం తో ఉక్కిరి బిక్కిరైపోతూ మావయ్యతో కలిసి వడి వడిగా గుడికేసి సాగిపోతున్నారు.
దారిలో వచ్చీ పోయే వారు మోహన అందాన్ని కళ్ళతోనే తాగేస్తూ ఆరాధనగా అసూయగా చూస్తూ ఉంటే చారికి ఒక పక్క సంతోషం ఇంకో పక్క ఇంతటి అందగత్తె కు తాను పెద్ద దిక్కని తనకు తెలీకుండానే మీసాలు మెలేసుకొంటూ గంభీరంగా నడుస్తున్నాడు.
అలా వారిద్దరూ గుడి దగ్గరగా వెళుతుంటే ప్రక్కనున్న పూల కొట్టులోనుండి ఒకామె చారీ అని గట్టిగా అరిచింది.
అంత పెద్దయానను కేవలం ఒక పూలమ్మి ఏకవచనంగా చారీ అనిపిలవడం తో చుట్టుప్రక్కల వారు నిర్ఘాంతపోయి చూసారు.
మోహన కూడా ఉలిక్కిపడి చూసింది. గరుడాచారి కూడా అయోమయంగా అటుకేసి చూస్తే అల్లంత దూరాన ఒకామె చేయి ఊపుతూ చారీ . . . .చారీ. . . . అని గట్టిగా అరచి పిలువ సాగింది.
మోహనకు ఏమీ అర్థం కాక మావయ్య వైపు ఆమె వైపు మార్చి మార్చి చూస్తూఉంటే గరుడా చారి ఆమెను చూడగానే చూసీ చూడనట్లు తప్పించుకొని దేవళం లోనికెళ్ళిపోయాడు.
మోహనకు ఏమీ అర్థం కాక మావయ్యతో కలసి లోపలకెళుతూ మావయ్యా ఆమె ఎవరో మిమ్మల్ని పేరు పెట్టిపిలుస్తోంది.అంది
విన్ననమ్మా . . .పూజ ముగిసిన తరువాత తీరిగ్గ కలుసుకొంటాలే. . .పద అంటూ పూజారి దగ్గరకెళ్ళి నిలబడ్డాడు.

7 Comments

  1. Very good story

    1. Where is ihe continuation and clousure of crime story

  2. చాలా బాగా ఉంది మీ స్టోరీ ప్లీజ్ కంటిన్యూ ???

  3. ఏంటి ఈ రోజు ఎపిసోడ్ రాలేదు ప్లీజ్ part..5 రిలీజ్ చేయరా ప్లీజ్ ?

  4. Next post ఎప్పుడు వస్తుంది plz tell me

  5. Super excellent story keka

Comments are closed.