చాలా లక్కీ 4 121

ఇదేమిటి ఈ సమయంలో అమ్మ గుర్తుకొస్తోంది అనుకొని బలవంతంగా కళ్ళు విప్పబోతూ ఉంటే. . .ఓ పెద్దావిడ అమ్మను నానా మాటాలు అంటూ సాధిస్తోంది. సురభి కళ్ళ నీళ్ళు కక్కు కొంటూ అదింకా చిన్న పిల్ల ఇప్పుడే నాట్యాలూ అవీ ఎందుకండీ. . . . . మీరు చెప్పినట్లే నేను చేస్తున్నాగా కావలిస్తే నాకొచ్చే ఆదాయాన్ని మీరే తీసుకోండి. దాన్ని అలా వదిలేయండి. అమ్మ చెంప మీద ఆవిడ చెళ్ళుమని కొట్టి నీ చావు నువ్వు చావు అంటూ విస విసా వెళ్ళిపోయింది. అమ్మ చెంపను అదుముకొంటూ మోహనా అని బావురుమంది. బిక్కు బిక్కుమంటూ ఓ మూలనుండి చూస్తున్న తను అమ్మా అంటూ తనని చుట్టుకొనేసింది.
ఇంతలో ఓ నర్స్ తన కళ్ళలోకే చూస్తూ భుజానికి ఇంజెక్షన్ చేస్తూ తన చెంప మీద చిన్నగ తడుతూ ఏం పరవాలేదు. మీ అమ్మ వచ్చేస్తుంది అంటూ ధైర్యం చెబుతోంది.

మళ్ళీ కళ్ళు మూతలు బడుతూ ఉంటే నేనే కాదు ఇక్కడున్న వారందరూ నీకు అమ్మలే అంటూ ఆ ఇంట్లో ఉన్న వారిని చూపిస్తోంది సురభి. తను ఏదొ అనబోతూ ఉంటే అంతా మసక మసకగా అయిపోయింది.
డాక్టర్ అనస్తీషియా ఇస్తూ ఈ పిల్ల చాలా గట్టిది అనడం మాత్రం వినిపించింది.

7 Comments

  1. Very good story

    1. Where is ihe continuation and clousure of crime story

  2. చాలా బాగా ఉంది మీ స్టోరీ ప్లీజ్ కంటిన్యూ ???

  3. ఏంటి ఈ రోజు ఎపిసోడ్ రాలేదు ప్లీజ్ part..5 రిలీజ్ చేయరా ప్లీజ్ ?

  4. Next post ఎప్పుడు వస్తుంది plz tell me

  5. Super excellent story keka

Comments are closed.