చాలా లక్కీ 4 121

తనను మనసులో సంకల్పం చేయించి పూజ ముగించుకొని వచ్చే సమయానికి ఆ పూలమ్మి వయసు భారంతో తడబడుతూ చేతిలో ఊతకర్రతో దేవస్థానం బయట నిలబడి తమ కోసం ఎదురు చూస్తూ ఉంది.
ముందుగా వస్తున్న తనని నోరెళ్ళబెట్టి చూస్తూ ప్రశ్న్నర్థకంగా చారికేసి చూసింది. చారి ఆమె చూపులను పట్టించుకోకుండా తప్పుకొని వెళ్ళిపోబోతుంటే ఆగు చారీ . . .సురభి అడ్రస్ దొరికింది.అని గట్టిగా అరిచింది.

ఆ పెద్దవిడ ఇక వదిలేలా లేదనుకొని గరుడాచారి , నీకెన్ని సార్లు చెపాలి నన్ను పేరు పెట్టిపిలువొద్దని. . . ఏం సంబందం లేకపోయినా నెల నెలా తిండికీ తీర్థానికీ ఏర్పాటు చేస్తూనే ఉన్న కదా. . . . మళ్ళీ ఏం కొంపలు మునిగిపోయాయని గొంతు చించుకొంటున్నావు. నా కోడలని పంపించి వద్దామని అనుకొంటూ ఉంటే దారిలో కాపు కాసి మరీ విసిగిస్తావా. . .బుద్ధి ఉండఖ్ఖరలేదూ అని కసురు కొన్నాడు.
చారి ఈసడింపును పట్టించుకోకుండా ఇది నీ కోడలా . . .అచ్చు సురభిలా ఉంటేనూ . . .వయసుపోతున్న కొద్దీ కళ్ళు మసకబారుతున్నాయా . . . బుద్ధి నాకు కాదు నీకు లేదు. అని గయ్య్ మంది.
ఆ పెద్దవిడ మాటలకు చారి తడబడుతూ మోహన కేసి తేరిపార చూసి. . . ఏదో స్పురించినట్లుగా మోహనా నీవు హోటెల్ కు వెళ్ళగలవా . . .ఈవిడతో మాట్లాడి వచ్చి అన్ని వివరాలు తరువాత చెబుతా అని డ్రైవర్ ను పిలిచి మోహనను పంపేసాడు.
కారెనెక్కి వెనక్కి తిరిగి చూస్తూ కూచొంది. మావయ్య నుదుటిన బడ్డ చెమటను తుడుచుకొంటూ ఆ పెద్దవిడను రెక్కబట్టుకొని నడిపించుకొంటూ వెళ్ళి గుడి ఆవరణలో కూచోబెట్టడం కనిపించింది.
ఆ పూలమ్మి తనని ఉద్ద్యేశించి సురభిలా ఉందే అంటే మావయ్య కంగారుపడుతూ తనకేసి చూట్టం వెనువెంటనే తనను హోటెల్ కు వెళ్ళమని చెప్పడం అంతా ఒక చిక్కుముడిలా అనిపించి, డ్రైవర్ కు చెప్పి కారు ను దిగి వెనక్కి వచ్చి మావయ్య వాళ్ళు ఉన్న ఆవరణ పక్కకి వచ్చి నిలబడింది.
అప్పటికే ఆ పెద్దవిడ చారిని బాగా చీవాట్లు పెడుతోంది. ఏం చారీ ఆ పిల్లలో సురభి పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటే కోడలంటావేమిటీ ? అసలు ఆ అమ్మయి పుట్టొపూర్వోత్తరాలు ఏవైనా కనుక్కొన్నవా? ఇంతకూ ఆ పిల్ల నీకు కోడలెలా అయ్యింది? . ముసలి దాన్ని నాకే ఆ పిల్ల సురభి లా స్పష్ఠంగా కనిపిస్తూ ఉంటే నీకు ఏమీ అనుమానం రాలేదా లేదా సురభిని మరచి పోయావా? ఆమె బ్రతికుందో లేదోననే కదా ఇంతకాలం నన్ను పోషిస్తూ ఉన్నది.
చారి ఆమె చేతులను పట్టుకొని ఊరికే హడావుడి పడిపోకు. గత ఇరవై ఏళ్ళుగా సురభికోసం నా ప్రయత్నం అంతా చేస్తూనే ఉన్నాను. ఎక్కడా జాడదొరకలేదు మరి. ఇప్పుడు నువ్వు తన అడ్రస్ దొరికింది అంటున్నవుగా ఇటివ్వు కనుక్కొంటా . . .
మీ ఆంధ్రా ప్రాంతంలోనే ఏదో విరాజపట్నమని ఉందటగా ఇన్నేళ్ళూ అక్కడే దేవదాసీ కుటుంబంలో ఉండి ఈ మధ్యనే చనిపోయిందట . . .ఆ ఇంటి పెద్దావిడే ఇన్నేళ్ళూ సురభికి ఇంత అన్నం పెట్టి పోషించదట , ఆమెకు ఓ కూతురు ఈ మధ్యనే ఎవరితోనో లేచిపోయిందని విన్నా
గరుడాచారి :- ఈ వివరాలన్నీ ఎవరు చెప్పారు నీకు
ప్రతి సం.పిల్లాపాప కోసం చాలా మంది దక్షిణాది నుండి వస్తారుగా . . . .అలా ఆ వూరి మోతుబరి ఒకాయన కలిసాడు.
ఎంత చక్కటి పిల్లను నాశనం చేసేసావు చారీ . . .ఇక్కడే ఉన్నా ఎవడో ఒకడు తనని మనువాడి పువ్వుల్లోపెట్టుకొని చూసేవాడు. ప్రేమా దోమా అని చేజేతులా ఆమెను చంపుకొన్నావు అని హుస్సూర్ మంది ఆముసలావిడ.
గరుడాచారి :- నేనేం కావాలని తనని దూరం చేసుకోలేదు గా . . .అన్నీ తెలిసే మాట్లాడతావేమిటి నీవు. అప్పట్లో మా మధ్యవర్థిగా ఉన్నది నీవే కదా. . . .ఇంట్లో వాళ్ళని ఒప్పించేంతవరకూ ఆగమని చెప్పా . . .తనే నా మాట వినకుండా ఎటో వెల్లిపోయింది.

7 Comments

  1. Very good story

    1. Where is ihe continuation and clousure of crime story

  2. చాలా బాగా ఉంది మీ స్టోరీ ప్లీజ్ కంటిన్యూ ???

  3. ఏంటి ఈ రోజు ఎపిసోడ్ రాలేదు ప్లీజ్ part..5 రిలీజ్ చేయరా ప్లీజ్ ?

  4. Next post ఎప్పుడు వస్తుంది plz tell me

  5. Super excellent story keka

Comments are closed.