టీచర్ కోసం 7 159

క్లాస్ లు బాగా జరుగుతున్నాయి. ప్రియ వచ్చిందేమో అని చూసా, కానీ తను కాలేజ్ కు రాలేదు. అప్పుడు మేడంతో ఏదో చెప్పి వెళ్ళింది ఎం చెప్పిందో తెలీదు డెఫినెట్ గా నామీద లవ్ ఉంది అని చెప్పే ఉంటుంది విషయం తెలుసుకుందాం అంటే మేడం ఎం చెప్పలేదు ఇక ప్రియ అయిన చెప్తుందా అంటే తనేమో కాలేజ్ రాలేదు, నేను తనతో అనొసరంగా హార్ష్ గా చెప్పినట్లు ఉన్నా నాకు ఇష్టం లేదు అని ఛ, ఈ మధ్య నేను చాలా హార్ష్ అవుతున్నా, పాపం ప్రియ కు సారి అయినా చెప్త్దాం అని అనుకుంటూ పోయి ప్రియ గురించి, హారికను అడిగా ఏంటి తను రాలేదు అని, హారిక నాకు కూడా తెలీదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, నువ్వు నో చెప్పక తను చాలా బాధ పడింది రా బహుశా అందుకే వచ్చి ఉండదు అని అంది. నేను సరే అని చెప్పి అక్కడ నుండి నా ప్లేస్ లోకి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉండగా నిన్న మేడం తో ప్రియ మాట్లాడడం గుర్తు వచ్చి మేడం ను గట్టిగా అడిగితే ఏమైనా చెప్తుందేమో అని అనిపించి మేడంను కలుద్దామని బయటకు వెళ్ళా. మేడం స్టాఫ్ రూమ్ లో లేదు, ఎక్కడుందా అని చూస్తూ ఉండగా స్టాఫ్ రూమ్ పక్కన ఉన్న లాబ్ దగ్గర నిలబడి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది నేను ఎవరికై ఉంటుంది అని మేడం కు కనిపించకుండా లాబ్ దగ్గరకు వచ్చి తన మాటలు వింటున్న. చుట్టూ ఎలాంటి సౌండ్స్ లేకపోవడంతో ఫోన్ లో అవతల వాయిస్ కూడా లైట్ గా వినిపిస్తుంది.

మేడం :: నువ్వు కూడా ఏంటే బిందు.., వాడిని సపోర్ట్ చేస్తావ్, నీకు తెలీదా నా పరిస్థితి ?
బిందు :: ఏంటే నీ బొంద వాడు అంతగా వెంట పడుతూ ఉంటే ఛాన్స్ ఇవ్వాల్సింది పోయి, మీ ఆయనకు పోయి వాడు నిన్ను కోరుకుంటున్నాడు అని చెప్తావా ? అస్సలు సిగ్గు లేదే నీకు, అయినా అలా ఎలా చెప్పావే ?
మేడం :: హిమ సారీ నే, నేను నీకు అబద్దం చెప్పా
బిందు :: ఏంటి ?
మేడం :: అవునే, నువ్వు అన్నట్లు నేను మా ఆయనకు నా విషయం చెప్పలేదు
బిందు :: మరి ?
మేడం :: ఇదే పరిస్థితిని మా ఆయనకు చెప్తూ నా బదులు నిన్ను, ఇంకా భరత్ గాడి బదులు కాలేజ్ లో ఒకడు అని అబద్దం చెప్పి, నాకు భరత్ కు మధ్య జరుగుతున్న విషయాలు అన్ని మీ ఇద్దరి మధ్య జరిగినట్లు అబద్దం చెప్పి, సలహా అడిగా
బిందు :: దొంగ దాన ఎంత నాటకం ఆడావే ?
మేడం :: మరి ఇంకేం చేయమంటావ్ చెప్పు నిన్ను ఏదైనా సలహా అడిగితే నన్ను ఇంకా దిగజార్చే ఐడియా ఇస్తావ్ అందుకే ఇలా చేశా
బిందు :: మరి నా పేరు ఎందుకు చెప్పావే
మేడం :: తెలిసిన వాళ్ల గురించి అయితే కేర్ ఎక్కువ ఉంటుంది ఇంకా సొల్యూషన్ కూడా కొంచెం డీప్ గా ఆలోచించి చెప్తారు అని, నీ పేరు చెప్పా, మరి నాకు బెస్ట్ నువ్వే కదా అందుకే
బిందు :: అందుకని నన్ను ఇరికిస్తావా ?
మేడం :: పోనేలేవే ఒక మంచి పని కోసమే కదా
బిందు :: ఏంటి మంచి పని, భరత్ గాడికి వేరే అమ్మాయిని తగిలించడమా ?
మేడం :: ఛ, వేరే అమ్మయిని ఎందుకు తగిలిస్తా, నేనెలాగో వాడికి దక్కను, నా కూతురు అయినా వాడితో ఉంటే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది,
బిందు :: ఎంత అమాయకంగా కనిపిస్తావే మరీ ఇన్ని ఆలోచనలా ? అది సరే కానీ ఎవరో వచ్చి భరత్ ని లవ్ చేస్తున్నా వాడు లేకపోతే చచ్చిపోతా అని అంది అన్నావ్ కదా మరి ఆమె సంగతి ?
మేడం :: ఓహ్ ప్రియ నా ? దాని మొహం దానికి అంత సీన్ లేదు అయినా దానికి వీడకి లవ్ ఏంటి ? బాడ్ పెయిర్, పైగా నా కూతురు అంత అందగత్తె ఎం కాదు ఇక మగాళ్ల బుద్ది ఎలాగో తెలిసిందే కచ్చితంగా నా కూతురుని వీడు లవ్ చేస్తాడు పైగా వీళ్లిద్దరి జత కూడా సూపర్ ఉంటుంది.
బిందు :: అవునులే మేఘ భరత్ సరైన జతే
మేడం :: మ్మ్, ఏమోనే భరత్ గాడి విషయం లో ఎం చేద్దాం అన్నా భయంగా ఉంది
బిందు :: ఎం ?
మేడం :: (పొద్దున జరిగింది చెప్తూ ఉంది)
బిందు :: అవునా ? అసలు ఎందుకు అలా సడెన్ గా అంత మాట అన్నాడు ?
మేడం :: అదేనే భయం ఎప్పుడు ఎలా చేస్తాడో తెలీదు
బిందు :: ఏమైనా వాడికి కొంచెం తిక్క ఉందిలే,
మేడం :: తిక్క కాదు ఎం కాదు పాపం వాడి వయసు ప్రభావం అంతే
బిందు :: వాణ్ణి ఒక్కమాట కూడా అన్నివ్వవా ? సరే భరించు నీకు అంత జిలాగా వాడితో అనిపించుకోవాలి అని ఉంటే నాకేం
మేడం :: ఛి ఏంటి ఆ మాటలు ?

Updated: December 4, 2021 — 6:08 pm

4 Comments

  1. Chala bhagundhe story good sri

  2. Bossu okka time follow avu

  3. Same to same naku kuda oka medam tho bus lo tagilindi kani naku 5 years avutundi first anubavam kosam try chestunna kani intha varaku dorukale kani koncham romance dorikindi really I love her

  4. Bro please upload next episode

Comments are closed.