టీచర్ కోసం 7 159

నేను తన మొహం లోకి చూసి, సారి ప్రియ ఏమనుకోకు నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని వెనక్కు తిరిగి వెళ్తుండగా, ప్రియ నా చేతిని పట్టుకుని తన వైపు కు తిప్పుకుని, ఒక్కసారిగా తన పెదాలతో నా పెదాలను మూసేసింది. నేను కళ్ళు పెద్దవి చేశా, తను నన్ను ముద్దు పెట్టుకుని, నన్ను తోసేసి, నువ్వు వద్దు అనుకున్నా కూడా నేను లవ్ చేస్తూనే ఉంటా అని అంటూ కళ్ళు తుడుచుకుంటూ కిందకు వెళ్లిపోయింది, నేను కూడా తనతో పాటు కిందకు వెళ్తూ ఉంటే అక్కడ మెట్ల దగ్గర హారిక ఉంది, ప్రియను హత్తుకుని ఉంది, ప్రియ ఏడుపు గొంతుతో, నెను అందుకే వాడికి ఇన్ని రోజులు చెప్పలేదు, వాడి నోటి నుండి ఎం వినకూడదు అనుకున్నానో అదే విన్నా, అని అంటూ హారికను పట్టుకుని ఏడవడం స్టార్ట్ చేసింది. హారిక నా వంక చూసింది. నేను ఎం చేయలేక తల దించుకున్న. హారిక తనని ఓదార్చుకుంటు క్లాస్ లోకి తీసుకువెళ్లింది. నేను ఎం చేయాలో తెలీక క్లాస్ లోకి వెళ్లిపోయా. క్లాస్ లు మాములుగా జరుగుతున్నాయి. మధ్య మధ్యలో నేను ప్రియాను గమనిస్తూనే ఉన్నా, తను బెంచ్ మీద తల పెట్టుకుని పడుకుంది. బహుశా ఏడుస్తుందేమో. అంతలో మేడం క్లాస్ వచ్చింది. మేడం రాగానే అందరం లేచి నిలబడ్డం, మేడం కూర్చోండి అని చెప్తూ లెవకుండా అలాగే పడుకుని ఉన్న శ్రీ ప్రియ వంక చూసి ఏమంది తనకు అని పక్కన ఉన్న హారికను అడిగింది. హారిక తల నొప్పిగా ఉంటే నిద్రపోతుంది అని అంది. మేడం సరే అని క్లాస్ చెప్పి వెళ్ళిపోయింది, కాలేజ్ అయ్యాక, అందరం బయటకు వెళ్ళాం, ఒకసారి ప్రియ ఎం చేస్తుందో చూద్దాం అని తన వైపు చూసా, ప్రియ ఒక్కతే స్టాఫ్ రూమ్ వైపు నడుచుకుంటు వెళ్తుంది, నేను తను ఎందుకు వెళ్తుందా అని చూస్తున్న, ప్రియ స్టాఫ్ రూమ్ బయటకు వస్తున్న మేడం దగ్గరకు వెళ్లి నిలబడింది, నాకు ఒక్కసారిగా భయం వేసింది, అక్కడే పక్కన ఉన్న గోడ దగ్గర దాక్కుని వాళ్ళని చూస్తూ ఉన్నా, అక్కడ ప్రియ మేడం తో మాట్లాడుతూ ఉంది, మేడం ప్రియ భుజం మీద చెయ్ వేసి ఓదార్చుతూ ఉంది, ఇది ఎం చెప్తుంది రా అని మనసులో భయపడుతూ ఉన్న, దాదాపు పది నిమిషాల తరువాత మేడం ప్రియ కళ్ల నీళ్లు తుడిచి, పద వెళదాం అని అంటూ, బయటకు నడిచింది. అక్కడ స్కూటీ మీద ఇంకో మేడం వెళ్తూ ఉంటే, ప్రియను స్కూటీ ఎక్కించి ఏదో చెప్పి తనను సాగనంపింది. నేను భయం బయంగానే మేడం దగ్గరకు వెళ్ళా, మేడం నా వంక చూసింది, కానీ ఏమీ జరగనట్లు గా, భరత్ బండి తీసి పెట్టు ఒక్క పడహైదు నిమిషాలలో వస్తా అని చెప్పి స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళింది. నేను స్టాఫ్ రూమ్ వంక చూసా, మేడం లోపలకు వెళ్ళి ఏదో పని చేసుకుంటుంది. నేను మెల్లిగా నడుచుకుంటూ బైక్ దగ్గరకు వెళ్లి ఆలోచిస్తున్న, ఏంటి మేడం ఏమనలేదు, ప్రియ నా గురించి ఏం చెప్పలేదా లేక చెప్పినా కూడా తెలీనట్లుగా ఉందా అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా గోడకు అంటించిన స్టిక్కెర్ నా కంట పడింది. అది చదవగానే, కొంచెం సంతోషం వేసింది, కానీ నాకు పోలీసులంటే భయం, ఎలా అప్ప్రోచ్ కావాలో అర్థం కాలేదు. ఇన్నాళ్లు ఈ పని చాలా సార్లు చేద్దాం అని అనుకున్నా కానీ భయం వేసి ఆగిపోయా ఇప్పుడు ఈ స్టికర్ ని అడ్డం పెట్టుకుని సిఐ ను కలవచ్చు అని అనుకున్న, వెంటనే నాలో కొంత ఉత్సాహం వచ్చి, సెల్ తీసి ఆ స్టిక్కెర్ ని ఫోటో తీసి, బైక్ స్టార్ట్ చేసి దగ్గర్లో ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళా.

స్టేషన్ బయట,ఇంకా చుట్టూ చాలా మంది ఉన్నారు, రకరకాల కేసులు, నేను అందరిని చూసుకుంటు మెల్లిగా స్టేషన్ లోకి వెళ్ళా. లోపల చాలా బిజీ గా ఉంది. కొందరు కానిస్టేబుల్స్ కొంచెం గట్టిగా అడుస్తూ తిడుతున్నారు అక్కడకు వచ్చిన వాళ్ళని. నాకు ఆ కానిస్టేబుల్స్ ని చూస్తే భయం వేసింది, ఏంట్రా వీళ్ళు ఇలా తిడుతున్నారు అని అనుకుంటూ ఉండగా, ఒక కానిస్టేబుల్ నన్ను చూసీ ఏ బాబు ఏం కావాలి అని తారు రోడ్ మీద రేకు డబ్బా తో గీసిన సౌండ్ తో అడగగానే, నాకు భయం వేసి, నత్తి గొంతుతో, అ..ది అ.దీ సిఐ గారిని కలవాలి అని అన్నా. దానికి ఆ కానిస్టేబుల్ ఎం పని అని మళ్ళీ అదే కరుకు వాయిస్ తో అనగానే నేను, చిన్నగా కొంచెం మాట్లాడాలి అని అన్నా. ఆ కానిస్టేబుల్ నన్ను ఎగా దిగా చూసి, సిఐ గారు బిజీ గా ఉన్నారు మళ్ళీ రా అని అనగానే, సరే సరే అని అంటూ అక్కడ నుండి బయటకు వచ్చేసా.చ నేనొచ్చినప్పుడే బిజీ గా ఉండాలా, అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి, కాలేజ్ దగ్గరకు వెళ్ళా. నేను కాలేజ్ కు వెళ్ళగానే అక్కడ మేడం రెడి గా నిలబడి ఉంది, నేను త్తన దగ్గరకి వెళ్ళా. ఏంటి ఎక్కడకు వెల్లవ్ అని అంటూ బైక్ ఎక్కింది. నేను సైలెంట్ గా బైక్ స్టార్ట్ చేసి, ఇంటికి పోనిచ్చా.

Updated: December 4, 2021 — 6:08 pm

4 Comments

  1. Chala bhagundhe story good sri

  2. Bossu okka time follow avu

  3. Same to same naku kuda oka medam tho bus lo tagilindi kani naku 5 years avutundi first anubavam kosam try chestunna kani intha varaku dorukale kani koncham romance dorikindi really I love her

  4. Bro please upload next episode

Comments are closed.