నాకు నువ్వు కావాలి అంతే 229

తర్వాతి సండే తను మామూలుగానే నా రూం కి వచ్చింది..
తను వస్తుందనే విషయం మర్చిపోయా..
షార్ట్ లో ఉన్న.. అప్పుడే స్నానం చెయ్యడం వలన ఇంకా షర్ట్ వేసుకోలేదు.. తేజ డైరెక్ట్ గా లోపలకు వచ్చేసింది.. తను నన్ను చూసి చిన్నగా నవ్వుకుంటున్న విషయం గమనించాను.. వెంటనే షర్ట్ వేసుకుని….
కాలింగ్ బెల్ కొట్టొచ్చు కదా అన్నాను.. సారీ సార్.. మీరు ఇలా దర్శనం ఇస్తారని ఊహించలేదు అందుకే వచ్చేసా అంది.. మ్ మ్ .. సరే సరే.. అని సర్దుకుని కూర్చున్నా..కొంచెం ముందుగా వచ్చి ఉంటే తను భయపడి పారిపోయేదేమో… మరీ.. సార్, టిఫిన్ చేశారా సార్ అంది… లేదు సండే కదా బయటకి వెళ్ళాలని అనుకున్నా.. నువ్వొచ్చావ్ కదా.. తరువాత తింటాలే అన్నాను.. లేదు సార్.. నేను బాక్స్ లో పెట్టి తిఫిన్ తెచ్చాను.. మీ కోసమే అంది.. థాంక్స్, మరి నేను చెప్పలేదు కదా ఎందుకు తెచ్చావ్ అని అడిగాను…

మీ కోసం టిఫిన్ తీసుకు రాకూడదా సార్ అంది..
హర్ట్ అయ్యిందేమో.. సర్లే ఇవ్వాళ ఏం చెప్పాలి నీకు అని అడిగాను… టిఫిన్ తినండి సార్ ముందు అంటూ బాక్స్ తెరిచింది.. తప్పనిసరి కావడంతో సరే నువ్వు కూడా తిను అంటూ ఒక ప్లేట్ తెచ్చి కొంచెం పెట్టాను… టిఫిన్ తిన్నాక.. ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి ఇవ్వాళ అని అడిగాను.. తను చాలా కూల్ గా ఉంది.. కబుర్లు చెప్పండి అంది… ఆశ్చర్యపోవడం నా వంతు అయ్యింది.. వ్వాట్..?
అని అడిగా.. అవును సార్.. ఏమైనా కబుర్లు చెప్పండి సార్.. అంది.. ఏం కబుర్లు చెప్పాలి నీకు.. అని అడిగాను.. మీ గురించి చెప్పండి సార్.. అంది. నా గురించి ఏం ఉంటాయి.. జస్ట్ ఒక టీచర్ ని అంతే కదా అన్నాను..

ప్లీజ్ సార్, చెప్పండి సార్.. అంది.. అయ్యొ… నా గురించి చెప్పడానికి ఏముంది తేజా.. నేనూ నీలాగా మామూలు మనిషినే నేనేమైనా సెలబ్రిటీ నా.. చెప్పుకోడానికి అన్నాను.. ఒక్క క్షణం నిశ్శబ్ధంగా కూర్చుంది.. ఐనా నాకు తెలియక అడుగుతానూ….నువ్వేంటి..కొత్తగా.. చదువుకోడానికి వచ్చావా లేక ఎంక్వయిరీకి వచ్చావా అని అడిగాను.. అదేమీ కాదు సార్, మీరు అందరు టీచర్స్ లా కాకుండా డిఫరెంట్ గా ఉన్నారు కదా అందుకే అడిగాను సార్..

2 Comments

  1. Woow Chala super ga undi next story rayandi

Comments are closed.