నాకు నువ్వు కావాలి అంతే 229

తర్వాతి రోజు 1st పీరియడ్ వాళ్ళ క్లాస్ కి వెళ్ళాను.. అప్పటికే తను సీరియస్ గా ఉందని అర్ధం అయ్యింది.. నేను ఎప్పటిలాగా నా పీరియడ్ ని ముగించి బయటకి వచ్చాను.. తను నా వెంట బయటకి వచ్చి…అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి..ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని అడిగింది.. ప్లీజ్.. ఇది స్కూల్… ముందు నువ్వు క్లాస్ కి వెళ్ళు.. ఇక్కడేమి మాట్లాడినా ఇద్దరం అల్లరైపోతాము…అన్నాను.. నో… ఇప్పుడే ఏదో ఒకటి తేలిపోవాలి అంది.. తేజ.. నువ్విలా మాట్లాడితే నేను జాబ్ వదిలి వెళ్ళిపోవడం తప్ప ఇంకో మాట లేదు.. నీ ఇష్టం.. అని వచ్చేశాను స్టాఫ్ రూమ్ కి.

నాలో ఏదో తెలియని భయం.. సాయంత్రం వరకు అలానే ఉండిపోయాను.. లీవ్ పెట్టాలనుకున్నాను కానీ ఏదో చెప్పలేని నిరాసక్తత.. నేను తనని రెచ్చగొట్టలేదు.. తనతో అందరిలాగానే మూవ్ అయ్యాను.. పోనీ స్కూల్ లో నాలా బాచిలర్ టీచర్స్ ఇంకా ముగ్గురు ఉన్నారు.. మరి నాకే ఇలా ఎందుకు?..
ఈవెనింగ్ 5కి స్కూల్ నుండి రూమ్ కి వచ్చాను.. అప్పటికే తేజ వచ్చి కూర్చుంది..సాధారణంగా కీస్ నేను ఎదురింటి మామ్మ గారికి ఇచ్చి వెళ్తాను.. తేజ వచ్చి తీసుకుందేమో రూమ్ లో కూర్చొని TV చూస్తోంది.. నేను లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని బయటకి వచ్చాను.. తను కిచెన్ లోకి వెళ్ళి టీ పెట్టి తెచ్చింది ఇద్దరికీ.. ఇంకా మాట్లాడకపోతే ప్రాబ్లం అనిపించింది.. తేజా.. నువ్వు నీ నిర్ణయం మార్చుకో…నేను అనాధను..నువ్వు జాలితో అలా అడిగావు కానీ నిదానంగా ఆలోచిస్తే.. అన్నీ అర్ధం* అవుతాయి అన్నాను.. మీరు ఈ స్కూల్ లో జాయిన్ అయినప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను.. ఇంట్లో అమ్మా, నాన్న ఒప్పుకోరు కదా అని అడిగాను.. అది మీకు అనవసరం..నేను చూసుకోగలను అంది.. మరి మన కులాలు ఒకటి కావు కదా అన్నాను.. నాకు ప్రాబ్లం లేదు ఐనా మీదే పెద్ద కులం అంది.. సరే..తేజ..నువ్వింకా చిన్నపిల్లవే కదా.. కొన్నాళ్ళు ఆగి చదువు పూర్తి అయిన తరువాత చూద్దాం అన్నాను.. ఫైనల్ గా..నా దగ్గర ఇంకేం మాట్లాడటానికి మాటలు లేవు.. సార్..మీరనుకున్నంత చిన్నపిల్లను కాను నేను.. ఇప్పుడు నా వయసు 18.. మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని* నాకు తొందర లేదు.. కనీసం మీ కోసం 4,5 సంవత్సరాలు ఆగుతాను.. ok నా..నేనంటే మీకు ఇష్టమో కాదో చెప్పండి అంతే..అంది.. సరే..తేజ.. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టను అంటే నాకు ok.. కాని దీని వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని భయంగా ఉంది అన్నాను.. అబ్బా!!..ఇప్పటికి కరుణించారన్నమాట.. ఎవరైనా అమ్మాయిల వెంట పడతారు..నేను అబ్బాయి వెంట పడవలసి వచ్చింది…ప్చ్..ఏమిటో..అంది.. Ok..నీకు నచ్చిన సమాధానం వచ్చింది కదా ఇంక బయలుదేరు..ఇంట్లో మీ వాళ్ళు ఎదురుచూస్తుంటారు అన్నాను.. అప్పుడేనా.. కొంచెం సేపు ఉండి వెళ్తా అంది… వద్దు తేజ..లేట్ ఐతే ప్రాబ్లం కావచ్చు అన్నాను..

2 Comments

  1. Woow Chala super ga undi next story rayandi

Comments are closed.