నాకు నువ్వు కావాలి అంతే 229

పోనీలే.. చెప్పకపోతే మీ ఇష్టం నేనేం చెయ్యగలను అంది.. నేనేమీ మాట్లాడకుండా కూర్చున్నా…
కొంచెం సేపటి తరువాత …. నేను వెళ్తున్నా సార్, అంది.. ఓహ్.. సారీ తేజా… నువ్విలా వచ్చి.. వెళ్ళిపోవడం నాకు బాగోలేదు.. తేజా.. అన్నాను. మీరేమో మాట్లాడరు.. నేను ఇక్కడ కూర్చుని ఏం చెయ్యను.. ఇంటికి వెళ్తే ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు కదా… అంటూ.. లేచి నిలబడింది
ప్లీజ్.. ఉండు తేజ.. నాకు కూడా తోచడం లేదు..సండే కదా ఏం చేయాలో అర్ధం కావడం లేదు అని అడిగాను. మీరు మాట్లాడతానంటే ఉంటా అంది..
సరే.. ఏం మాట్లాడాలి చెప్పు.. అన్నాను.. మ్ మ్..

మీరు ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు.. చెప్పండి..మీ అమ్మా, నాన్న.. బ్రదర్స్…సిస్టర్స్
ఎవ్వరూ ఇక్కడికి రారా.. అని అడిగింది.. వెంటనే.. లేదు తేజ.. నాకెవ్వరూ లేరు,* నేను చిన్నప్పటి నుండి హాస్టల్ లో ఉండి చదువుకున్నాను.. నాకు ఎవ్వరూ లేరు.. అందుకే ఎవ్వరూ నాకోసం రారు అన్నాను.. అలా చెప్తూ ఉంటే నాకు కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేశాయి అనుకోకుండా…

.
పాపం తను కంగారు పడిపోయింది.. పరిగెట్టుకుంటూ దగ్గరికి వచ్చి.. సారీ సార్,..మిమ్మల్ని బాధ పెట్టానా.. ప్లీజ్..సార్..ఏడవకండి..అంటూ..నా కన్నీళ్ళు తుడుస్తోంది.. నన్ను టచ్ చేసిన మొదటి అమ్మాయి తనే… కానీ నేను ఆ ఆలోచనలో లేను.. అమ్మా, నాన్న గుర్తుకు వస్తే నా మనసును కంట్రోల్ చేసుకోలేను.. తేజ నన్ను దగ్గరగా తీసుకుని కళ్ళు తుడుస్తోంది..

నన్ను నేను కంట్రోల్ చేసుకొవాలనుకున్నా సాధ్యం కావడం లేదు.. సారీ సార్.. మిమ్మలి బాధ పెట్టాను.. ఐనా.. మీకు నేను ఉన్నాను కదా…అంటూ.. నా నుదుటి మీద ముద్దులు పెట్టింది.. తరువాత నన్ను గట్టిగా కౌగిలించుకొని బుగ్గల మీద కూడా కిస్ చేస్తోంది.. సడెన్ గా నాకు తను చేస్తున్న పని అర్ధం అయ్యింది.. తన నుండి దూరంగా జరిగి కూర్చున్నాను.. కాని తను నన్ను ఇంకోలా అర్ధం చేసుకుంది..

2 Comments

  1. Woow Chala super ga undi next story rayandi

Comments are closed.