నాకు నువ్వు కావాలి అంతే 229

నాలో బాధ పోయింది.. నా పరిస్తితి ఏంటో అర్ధం అయ్యింది.. తను నన్ను ఎందుకు ముద్దు పెట్టుకుందో అందులో తన ఉద్దేశం ఏంటో నాకు క్లియర్ గా తెలియకపోయినా.. అది తప్పు అని.. అడ్వాన్స్ అయ్యి నేను ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు.. అందుకే తన నుండి విడిపోయి దూరంగా కూర్చున్నా… కానీ తను నన్ను ముద్దు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదేమో అనుకొని చిన్నబుచ్చుకుంది..

ఆ ఫీలింగ్ తన ముఖంలో కనిపిస్తోంది.. సారీ తేజ.. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను అన్నాను.. ఇంకా గిల్టీగానే ఉంది నాకు.. సరే సార్, నేనే కదా మిమ్మల్ని బాధ పెట్టాను.. మిమ్మలి అలా చూస్తే నాకు కూడా ఏడుపు వచ్చేసింది.. అందుకే మిమ్నల్ని కిస్ చేసా…అనుకోకుండానే..అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది…

సరేలే… అన్నాను… కానీ నా మనసులో చెడు కోరికలు మొదలైపోయాయి.. తేజ సిగ్గుపడుతూ కూర్చొనే ఉంది ఇంకా.. ఏమైనా మాట్లాడు తేజ, అన్నాను.. వద్దు సార్…
మళ్ళీ ఇదే సీన్ రిపీట్ ఐతే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను… అంది.. కంట్రోల్ చేసుకోలేకపోతే ఏమౌతుంది..ఏమి తెలియని వాడిలా అడిగాను..
పాపం మీకు తెలియదేమో… ఏమౌతుందో.. అంటూ చిన్నగా నవ్వింది.. కొంచెంసేపు మళ్ళీ మౌనం.. తరువాత తనే అడిగింది…సార్..ఎవరినైనా లవ్ చేసారా అని…. తన నోట్లోంచి ఇలాంటి మాట వస్తుందని ఊహించలేదు నేను.. మ్ మ్.. లేదు అని తల అడ్డంగా ఊపాను… అలాగైతే లవ్ లో పడలేదు అన్నమాట.. అంది..పోనీ నన్ను లవ్ చేస్తారా సార్…అని అడిగింది… తను చాలా మెచ్యూర్డ్ గా అడిగిందో..చిలిపిగా అల్లరిగా అడిగిందో అర్ధం కాలేదు… సార్… నన్ను లవ్ చేస్తారా….అని ఇంకోసారి అడిగి గట్టిగా నవ్వింది… నువ్వేం మాట్లాడుతున్నావో అర్ధం అవుతోందా తేజా…

అని అడిగాను… బాగా అర్ధం అవుతోంది సార్….బాగా ఆలోచించి చెప్పండి… ok ఐతే ఈవెనింగ్ 5 కి డాడీ నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి.. లేడంటే వద్దు… ok న అంది… సరే తేజా.. చాలా టైం అయ్యింది నువ్వు వచ్చి… నేను ఆలోచిస్తాలే… కానీ చాలా సమస్యలు ఉంటాయి ఇందులో.. మంచిది కాదు అని నా ఒపీనియన్… అన్నాను.. ok… నేను వెళ్తున్నా…. మీ ఇష్టం.. bye అంటూ వెళ్ళిపోయింది.

ఇప్పుడు నేను డిఫెన్స్ లో పడ్డాను… తేజ లాంటి అందమైన తెలివైన అమ్మాయి ప్రపోజ్ చేస్తే కాదనడం ఎవ్వరి తరము కాదు.. కాని తను ఇంకా చిన్న అమ్మాయు.. 18 సంవత్సరాలు మించి ఉండదు వయస్సు..నాకు 23..చదువు అయిన* వెంటనే టీచర్ పోస్ట్ వచ్చింది. అనాధని అనే ఫీలింగ్ తప్పితే.. నాకు వేరే ప్రాబ్లెమ్స్ ఏమీ లేవు.చాలా ఆలోచించిన తరువాత… తేజతో డిటైల్డ్ గా మాట్లాడాలని నిర్ణయించుకున్నా.. వెంటనే తనిచ్చిన నంబర్ కి ఫోన్ చేశా…. వాళ్ళ డాడీ ఫోన్ లిఫ్ట్ చేశారు..తేజ వాళ్ళ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ ని అని
చెప్పిన వెంటనే తను నన్ను విష్ చేసి ఫోన్ తేజకి ఇచ్చారు.. తేజా నీతో మాట్లాడే పని ఉంది..మనం డిటైల్డ్ గా మాట్లాడుకోవాలి.. రేపు స్కూల్ అయ్యాక నా రూమ్ లో కలుద్దాం అని చెప్పాను.. తను ఏదో చెప్పబోతుంటే వినిపించుకోకుండా కట్ చేసేశా..

2 Comments

  1. Woow Chala super ga undi next story rayandi

Comments are closed.