నాతో వస్తే… దెబ్బలకి మందు పూస్తాను 225

అతని దెబ్బల నుండి రక్తం కారుతుండ డంతో
‘ఇక్కడికి దగ్గర లోనే మా ఇల్లు ఉంది… నాతో వస్తే… దెబ్బలకి మందు పూస్తాను’ అనింది మృదుల….
‘ఫరవా లేదు లెండి… నేను వెళ్లి పోతాను…’ అన్నాడు అతను తన దెబ్బలకి తగిలిన దుమ్ము దులుపు కుంటూ…
‘ఫరవా లేదు లే రా…’ అంటూ ముందుకు సాగింది మంజుల… ఇంక తప్పదు అనుకున్న అతను తన బైక్ ని లేపి ఆమె వెనకే వెళ్ళాడు.

నేరుగా ఇంటి వసారో లో కి వెళ్ళిన మృదుల అతన్ని అక్కడ వున్న కుర్చీలో కూర్చో మని తను ఇంటి లోకి వెళ్ళింది. బండి పార్క్ చేసిన ఆ కుర్రోడు మెల్లిగా కుంటూ కుంటూ వెళ్లి ఆమె చూపించిన కుర్చీ లో కూర్చున్నాడు. కొంత సేపు గడిచిన తరువాత చేతిలో ఆంటిసెప్టిక్ ఆయింట్ మెంట్ తో బయటికి వచ్చిన మృదుల నెత్తురు మెరుస్తున్న అతని మోచేతులకి మందు రాస్తూ కాటన్ తో ఉపచర్యలు చేసింది. ఆమె మందు రాస్తున్నంత సేపు అందమయిన ఆమె ముఖం వంక చూస్తూ గడిపిన ఆ కుర్రోడు దెబ్బల బాధ కంటే మనసులో తొలుస్తున్న బాధకి సమాధానం చెప్ప లేక నీరస పడి పొయ్యాడు.

‘ఇంతకీ అంతా స్పీడ్ గా రావడం దేనికి… ?అలా కింద పడ్డం దేనికీ… ?ఇంతకీ నీ పేరేంటి?’ అని అడుగుతూ అతని ముఖం వంక చూసింది మృదుల మందు రాయడం అయిన తరువాత.
ఆమె అడిగిన ప్రశ్నలకి ఈ లోకం లోకి వచ్చిన ఆ కుర్రోడు …. తడ పడుతూ..

‘నా పేరు జేమ్స్! మిమ్మల్ని వెనక నుండి చూసిన నాకు మీరు ఎంత అందం గా ఉంటారో తెలుసు కోవాలనే కుతూ హలం కొద్దీ మిమ్మల్ని చూస్తూ బండి నడపడం వల్ల అలా అయింది…’ అన్నాడు మనసులో ఏ కపటం లేకుండాఅమాయకం గా ముఖం పెట్టి. ఆమె ఎక్కడ కోప్పడుతుందో అనే జంకూ గొంకూ ఏమీ లేదు అతని లో.
అతను చెప్పిన తీరుకు చిరు నవ్వు నవ్వుతూ ‘ఇంతకీ ఏమి తెలుసు కున్నావ్?’ అని అనింది మృదుల…
ఆమె కోప్పడడం లేదు అని గ్రహించిన జేమ్స్ తేలిక పడిన మనసుతో…
‘మీరు నేను అనుకున్న దాని కంటే చాలా అందం గా వున్నారు అని తెలుసు కున్నాను…’ అన్నాడు.

కొంత సమయం ఆలోచిస్తూ గడిపిన మృదుల
�అలాగా�అయితే నేను ఎంత అందం గా వున్నానో మా ఆయనకీ చెబుదువు గానీ లోపలికి రా�� అంటూ పైకి లేచి నిలబడింది.
�ఏమీ ఫరవా లేదు� నేను నిన్ను నేరుగా మా ఆయన దగ్గరికి తీసుకు వెళతాను� అయన నిన్ను ఏమీ అనడు� ఇంకా నీ మనసు లోని మాట నిర్భయంగా చెబితే సంతోషిస్తాడు� రా �. అయన.. లోపలే వున్నాడు�. వచ్చి చెప్పు� అంటూ లోపలి కి నడుస్తూ గుమ్మం దగ్గర ఆగింది ఇంకా తర్జన బర్జన పడుతున్న జేమ్స్ ని చూస్తూ..
�అలా కాదు� నేను ఆయన భార్యని చూస్తూ మైమరిచి పొయ్యి కింద పడి దెబ్బలు తగిలించు కున్నాను అని చెబితే ఏ మగాడు వూరు కుంటాడు�చెప్పండి�� అన్నాడు జేమ్స్ నీళ్ళు నములుతూ.

�మరేం ఫర్వాలేదు అంటున్నాగా.. నువ్వు చెబితే ఆయన ఇంకా సంతోషిస్తాడు రా.. లోపలి కి రా..!� అంటూ జేమ్స్ లోపలి వల్లదానికి దారి ఇచ్చింది మృదుల�ఇంకా నీళ్ళు నములుతూ నిలుచున్నా జేమ్స్ ని చూసి చిన్నగా నవ్వుతూ �దీనికే భయ పడే వాడివి అలా ఎలా పడి పోయ్యావ్.. ఆ..?� అంటూ అతని చేతిని పట్టుకుని ఇంటిలోకి లాగింది మృదుల. ఆమె బలానికి తూలి పడ బోతూ నిల దొక్కు కున్న జేమ్స్
�నాకెందుకు భయం� పదండి చెబుతాను� మళ్ళీ ఆయన ఏమన్నా అంటే మీరేమీ ఫీల్ కాకూడదు మరి.!� అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ��నేనేమీ ఫీల్ కాను� పద..� అంటూ లోపలి వెళ్ళింది మృదుల. ఆమె వెనకే లోపలి హాల్ లోకి వచ్చాడు జేమ్స్.. ఆమె చేతిలోని ఆయింట్ మెంట్ ని అక్కడ వున్న టీపాయ్ మీద పెట్టి..� మా ఆయన� లోపల బెడ్ రూం లో వున్నాడు� పద..!� అంటూ హాల్ కి అటాచ్డ్ గా వున్న బెడ్ రూం లోకి దారి తీసింది. ఆమె వెనుకే లోపలి వేల్ల్లాడు జేమ్స్� అక్కడ� ఆ రూం లో బెడ్ మీద పనుకుని వున్నాడు ఒకతను..

అతని శరీరం క్రుంగి కృశించి ఆస్థి పంజరం లాగ ఉంది� నీరసం గా కళ్ళు పెట్టుకుని సీలింగ్ కేసి చూస్తూ వున్న అతను వీళ్ళు వస్తున్న అలికిడికి ముఖం తిప్పి వీళ్ళని చూసాడు.. వాళ్ళ ఇద్దరినీ చూసిన అతని ముఖం లో ఏ విధమయిన ఎక్స్ ప్రెషన్ లేదు. ఆ రూం అంతా కలియ చూస్తున్న జేమ్స్ తో��ఈయనే మా ఆయన� ఏదో తెలియని జబ్బు చేసి ఇలా తయారయ్యాడు� చూడని హాస్పిటల్ లేదు.. వైద్యుడు లేడు�ఈయన జబ్బు మాత్రం నయం అవలేదు�ఆయనకీ మనం చెబుతున్న మాటలు అర్ధం అవుతాయి గానీ తిరిగి ఏమీ చెప్పలేడు�� అంటూ కళ్ళలో కారుతున్న నీటిని ఆపుకుంటూ జేమ్స్ వంక చూసింది..