నీకు మంచి టేస్ట్ ఉంది బాస్ 230

ఆ మరుసటి రోజు వాసు పని చేసే కాలేజీ కీ వెళ్లాడు అనంత్ అక్కడ ప్రిన్సిపల్ నీ కలిసి వాసు గురించి అడిగాడు దానికి ప్రిన్సిపల్ వాసు లాంటి ఒక విచిత్రమైన టీచర్ నీ తన 30 సంవత్సరాల కెరీర్ లో ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు, ఎందుకు అని అడిగాడు అనంత్ అప్పుడు ప్రిన్సిపల్ వాసు కాలేజీ కీ వచ్చే స్టైల్ గురించి చెప్పాడు “స్టైల్ గా జాకెట్ వేసుకొని టీ షర్ట్ తో వస్తాడు లోపలికి రాగానే జాకెట్ ఒకడికి ఇవ్వడం టి షర్ట్ విప్పి ఇంకొకడికి ఇస్తాడు ఇంకొకడు వచ్చి వాసు కీ షర్ట్ వేసి నోట్స్ ఇచ్చి వెళ్లతాడు ఏదో పెద్ద హీరో లాగా బిల్డ్ అప్ ఇచ్చుకుంటు వస్తాడు కాలేజీ రూల్స్ ఫాలో అవ్వడం కానీ, టాపర్ స్టూడెంట్స్ నీ అసలు పట్టించుకోవడం కానీ ఎప్పుడు చేయడు ఎప్పుడు చూసిన బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ తో కలిసి క్లాస్ bunk కొట్టి సినిమా కీ వెళ్లడం దాంతో పాటు ఎప్పుడు ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ నీ పాస్ అయ్యేలా motivate చేయడం లాంటి విచిత్రంగా అసలు ఒక టీచర్ కీ ఉండాల్సిన హుందాతనం కానీ ఒక dignity కానీ అసలు లేదు కానీ మా కాలేజీ నీ సిటీ లో నెంబర్ వన్ స్థానం లోకి తీసుకొని వచ్చాడు “అని చెప్పాడు ప్రిన్సిపల్ అంతా విన్న తర్వాత అనంత్ వాసు ఒక abnormal మనిషి అని అర్థం అయ్యింది. ఆ తర్వాత అనంత్ అక్కడ స్టాఫ్ లో ఎవరైనా విద్య పేరుతో ఉన్నారా అని అడిగాడు.

ఇంతలో సైబర్ క్రైమ్ ఆఫీస్ నుంచి వచ్చింది అనంత్ కి దాంతో వెంటనే అనంత్ సైబర్ క్రైమ్ ఆఫీస్ కీ వెళ్లాడు అప్పుడు వాసు laptop లో విద్య ఫోటో లు చాలా ఉన్నాయి తన ఫొటో తో పాటు ఇంకా కొంతమంది అమ్మాయిల ఫోటో లు ఉన్నాయి ఆ తర్వాత ఒక వాయిస్ మెసేజ్ కూడా ఉంది ఓపెన్ చేసి విన్నారు అందులో ఒక అమ్మాయి గొంతు విన్నడం రావడం మొదలు అయ్యింది “హే బేబి నీ కోసం నేను ఎదురుచూస్తున్నా త్వరగా ఇంటికి రా నా విరహం నీ తాపం రెండు తీరుతాయి” అని ఉంది ఆ తర్వాత ప్రిన్సిపల్ నుంచి what’s app లో విద్య profile వచ్చింది వెంటనే ఆ profile లో ఉన్న నెంబర్ కీ ఫోన్ చేశాడు అనంత్, అప్పుడు తను ఇందాక విన్న అదే గొంతు ఫోన్ లో వినిపించింది దాంతో ఆ అమ్మాయిని స్టేషన్ కీ పిలిపించాడు అప్పుడు విద్య సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వచ్చింది తనకు సెల్ లో నిద్రపోతున్న వాసు నీ చూపించి అతను నీకు తెలుసా అని అడిగాడు అనంత్, వాసు నీ చూసిన విద్య “సార్ అతను ఒక పెద్ద psycho నను లవ్ చెయ్యి అని రోజు torture చేస్తాడు” అని చెప్పింది అప్పుడు అనంత్ laptop లో ఉన్న వాయిస్ మెసేజ్ వినిపించాడు అది విన్న తర్వాత విద్య కాలేజీ anniversary లో వాసు చేసిన మిమిక్రీ షో వీడియో తీసి చూపించింది అది విన్న తర్వాత అనంత్ షాక్ అయ్యాడు వాసు తన మిమిక్రీ తో తనకు తానే విద్య గొంతు లో మెసేజ్ లు చేస్తూ ఉన్నాడు అని అర్థం అయ్యింది.

విద్య చూపించిన వీడియో ప్రకారం వాసు విద్య గొంతు తో తనకు తానే మెసేజ్ చేసుకొని విద్య పంపుతున్నటు నిర్దారణ కీ వచ్చారు సెక్యూరిటీ అధికారి లు ఆ తర్వాత వాసు laptop లో “మై క్రియేషన్స్” అని ఒక ఫోల్డర్ ఉంది అది తీసి చూడడం మొదలు పెట్టాడు అనంత్ అది ఒక డైరీ లాగా డేట్ వేసి ఉంది,అందులో ఒకటి ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాడు.

ఆ రోజు నేను Shakespeare hamlet డ్రామా కీ సంబంధించిన పుస్తకం కోసం లైబ్రేరి మొత్తం జల్లెడ పడుతున్నా అప్పుడే ఎవరో నిచ్చెన వేసుకొని పైన బుక్స్ సర్దుతు కనిపిస్తే పిలిచా ఆ అమ్మాయి నా కోసం తొంగి చూసి కాలు జారి కింద పడుతున్న సమయం లో నేను తనని పట్టుకుని కాపాడాను అలా తన కళ్లు లో కళ్లు పెట్టి చూస్తూ నా ఒడిలో ఉన్న తన దేహం ఏ మాత్రం బరువు అనిపించ లేదు ఆ తర్వాత ఆ కంటి చూపు లోతులో నను నేను సమాధి చేసుకున్నా, ఆ తర్వాత ఆ అమ్మాయి నీ కిందకి దించి నాకూ కావాల్సింది అడిగాను తను ముందుకు నడుస్తూ ఫాలో అవ్వమని చెప్పింది నేను తన తల నుంచి నడుముకు మధ్య ఊగిసలాడుతున్న తన సన్నని మల్లె తీగ లాంటి నడుము ఆ నడుము మడత మద్య నలిగిన నా మనసు నను ఎక్కడో కదిలించాయి ఆ తర్వాత తను నాకూ ఇవ్వాల్సిన పుస్తకం ఇచ్చిన తరువాత నేను క్లాస్ కీ బయలుదేరి వెళ్లాను, కానీ తను మాత్రం అక్కడ ఉన్న బుక్ షెల్స్ సందు నుంచి నా కోసం వెతకడం నేను తన వెనుక నుంచి చూడటం తను గమనించనే లేదు. ఆ తర్వాత తను వెనకు తిరిగినప్పుడు నను చూసి భయపడిన తన కళ్లు సిగ్గు పడ్డ తన పెదవి నా మనసు కీ తూట్లు పొడిచాయి.

2 Comments

  1. Rayalai anukuntey. Romantic ga bold ga .. aa feel tho rayandi… Bro…
    E Crime’…. Thrilling ani…..adedooo ani…. chepakandi..

  2. Heroines pai sex stories post cheyandi brother

Comments are closed.