పక్కింటి రూప 823

రూప, గుండ్రటి మొహం, మెరిసే కళ్ళు, బూరె బుగ్గలు, భలే అందంగా ముద్దుగా ఉంటది. నేను తనని మొదటి సారి మా పక్కింట్లో చూసాను. అప్పట్లో నేను నైట్ షిఫ్టుల్లో పని చేసే వాడిని, రాత్రి ఎనిమిది గంటలనుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అమెరికాలో పని చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే ఉద్యోగం. పని అవగానే పడుకుని మిట్ట మధ్యాహ్నం లేచి భోజనం చేసి ఊరంతా బలాదూర్ తిరగటం సాయంత్రం ఇంటికి చేరి మల్లి తెల్లవారుజాము వరకు పని చెయ్యటం. శని ఆదివారాలు మిత్రులతో షికార్లు కొట్టడం, అలా గడిచిపోతోంది. నా పక్క అపార్టుమెంట్లో నాలాగే ఒక ఒంటరి ఉండేవాడు, అతనికి ఒకే ఒక్క స్నేహితుడు ఉండేవాడు, చాలా వరకు ఇక్కడే ఉండే వాడు. ఎప్పుడైనా కనిపిస్తే పలకరించడం వరకే నాకు వాళ్ళతో పరిచయం. అలాంటిది ఒక రోజున అతని తలుపు తెరిచి ఉంటే అటు చూసాను, అప్పుడు కనపడింది ఒక బుట్టబొమ్మ, తన అలంకరణ చూసి పెళ్లి కూతురులా ఉంటే, పక్కింటి అతను కొత్తగా పెళ్లి చేసుకున్నాడేమో అనుకుంటూ తను నా వైపు చూస్తుంటే పలకరింపుగా నవ్వాను. తను కూడా నవ్వి తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది.
ఎప్పుడైనా కనిపిస్తే పలకరింపుగా నవ్వటం వరకే ఉండేది. నాకు మాత్రం ఎలాగైనా తనతో మాట్లాడాలని, మళ్ళీ మళ్ళీ తనని చూడాలని, పరిచయం పెంచుకోవాలని ఆశగా ఉండేది. ఏదైనా మంచి అవకాశం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాను. ఒక రోజు అలాంటి అవకాశం వచ్చింది. తను సామాన్లు కనుక్కోవటానికి వచ్చి డబ్బులు తేవటం మర్చిపోయింది, సామాన్లు ఇక్కడే పెట్టండి, నేను ఇంటికి వెళ్లి డబ్బులు తెచ్చి ఇస్తాను అని కొట్టువాడికి చెబుతుంటే, నేను వెళ్లి, పర్లేదు, ఈవిడ మా పక్కింటి వారే, నా ఖాతాలో రాసుకో అని చెప్పాను, రూప దానికి వప్పుకోకపోతే, కొట్టువాడు, అదేంటి మాడం, మీ పక్కింటి వారే కదా, ఇంటికి వెళ్లి డబ్బు తెచ్చే బదులు, ఆ డబ్బులేదో నాకు ఆయన ఇస్తాడు, మీరు ఇంటికి వెళ్ళాక అతనికి మీరు డబ్బులు ఇచ్చెయ్యండి అని అన్నాడు. దానికి తను సరే అయితే అని సామాన్లు తీసుకుని ఇంటికి బయలుదేరింది. కొట్టు బాగా దగ్గర అవటం వలన నేను కూడా నడిచే వచ్చాను. సామాన్లు ఎక్కువగా ఉండటం తో నేనే చొరవచేసి రెండు సంచులు తీసుకుని తనతో ఇంటికి బయలుదేరాను. దార్లో మాటల్లో తెలిసింది, తన పేరు రూప అని, నేను తనని చూసిన మొదట రోజే తను ఇక్కడికి రావటం అని తెలిసింది. తను ఇక్కడికి రావటానికి మూడురోజుల ముందే పెళ్లి అయ్యిందని. ఇంతలో ఇల్లు వచ్చేసింది, మీకిప్పుడైనా సాయం కావాలంటే మొహమాట పడకుండా అడగండి అని చెప్పి నేను నా ఇంట్లోకి వెళ్ళాను.

వెళ్లిన కాసేపటికే తలుపు కొట్టిన చప్పుడైతే తీసి చూస్తే ఎదురుగా రూప, నేను పక్కకి జరిగి రండి లోపలికి అని ఆహ్వానించాను, తను పర్లేదులెండి మీ డబ్బులు తెచ్చాను తీసుకోండి అని అంటుంటే, సరే మొదటి సారి వచ్చారు, అలా గుమ్మంలో కాకుండా లోనికి వచ్చి ఇవ్వండి అని అంటూ, ఫ్రిడ్జిలోనుంచి చల్లటి పళ్లరసం గ్లాసులో పోసి తనకి ఇచ్చాను. అయ్యో వద్దండి అని తను అంటుంటే, మొదటిసారి వచ్చారు, పర్లేదు తీసుకోండి, కూర్చుని తాగండి అని తనని బలవంత పెట్టి కూర్చోబెట్టాను. తను జ్యూస్ తాగుతూ ఒక్కసారి తనకి కనిపించినంత మేర ఇంటిని చూసి, మీరు ఇల్లుచాలా శుభ్రంగా పెట్టుకున్నారు అని అంది, నేను, అవునండి, నాకు ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటేనే ఇష్టం అందుకే వారానికి ఒక సారి ఒకావిడ వచ్చి ఇల్లంతా సర్ది శుభ్రం చేసి, బట్టలు ఉతికి మడతపెట్టి అన్ని చేసి వెళ్తుంది అని చెప్పాను. తను జ్యూస్ తాగేసి, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి, నేను వస్తానండి అని చెప్పి వెళ్ళిపోయింది. అలా అప్పుడప్పుడు మాట్లాడటం వరకు వచ్చింది మా పరిచయం. ఒక రోజు నేను అలా షికారుకెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పక్కింట్లో గొడవ జరుగుతుంది, చుట్టు పక్కలవాళ్ళు గుమికూడి చూస్తున్నారు. పక్కింటి అతను రూపని కొడుతున్నాడు, చంపేస్తాను నిన్ను అంటూ నానా బూతులు తిడుతూ కొడుతున్నాడు. అది చూసిన నాకు రక్తం మరిగిపోయింది, నేను మోజుపడుతున్న రూపని అలా చూసేసరికి ఆవేశం వచ్చి, ముందుకు వెళ్లి చుట్టుపక్కల వాళ్ళని ఉద్దేశించి, కనీసం ఎవ్వరికీ అతన్ని ఆపాలి అని అనిపించలేదా అని అంటూ, నేను అతన్ని ఆపి చూడు సోదరా, ఇలా ఒక ఆడమనిషిని కొట్టడం తప్పు, ఆపెయ్యి అని చెప్పాను.
దానికి అతను రెచ్చిపోయి, నువ్వు ఏంటిరా దానికి వత్తాసు, నా పెళ్ళాన్ని కొట్టుకుంటాను చంపుకుంటాను అని అంటూ మళ్ళీ ఇంకొకటి కొట్టాడు. నేను మళ్ళీ అతన్ని ఆపి, పెళ్ళాన్నిఅయినా కూడా కొట్టడం చంపడం లాంటివి చేస్తే బొక్కలో ఏస్తారు, ఆపు అని మళ్ళీ చెప్పాను. అతను మళ్ళీ కొట్టడానికి వెళ్తోంటే, నాకు ఇంక సహనం నశించి, చూడు, ఇంకొక దెబ్బ తనమీద పడితే, నీ కాలో చెయ్యో విరుగుతుంది జాగ్రత్త అని హెచ్చరించాను. నేను అసలే బాగా దిట్టంగా ఉంటాను, పెద్దగా బరువు బాధ్యతలు లేకపోవటంతో కసరత్తు, కర్రసాము, కుస్తీ లాంటి క్రీడల్లో పాల్గొంటాను. దాంతో బాగా బలంగా కండలు తిరిగి ఉంటాను. అందుకే అతను నా హెచ్చరిక వినగానే కిక్కురుమనకుండా వెనక్కి తగ్గాడు. తనని దెబ్బలనుంచి కాపాడిన నాకు రూప చేతులెత్తి దణ్ణం పెట్టింది. నేను వెంటనే, ఊరుకోండి, మీరు అలా కూర్చోండి అని కుర్చీలో కూర్చోబెట్టి, నా ఫ్రెండ్ సీఐ కి ఫోన్ చేసి, ఒరేయ్ వెంటనే ఇంటికి రా, మా పక్కింటోడు పెళ్ళాన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పాను. అయిదు నిముషాలలో పోలీసులు రావటం, అతను రూపని కొట్టడం, చంపుతాను అని బెదిరించటం నిజమే అని మిగతావాళ్ళు కూడా చెప్పటంతో వాడిని బేడీలు వేసి తీసుకెళ్లారు. రూప భయపడుతుంటే అందరూ ఇది అసలే పొలిసు కేసు, ఎవరికివారు, పక్కవారితో మీ ఇంట్లో ఉంచుకోండి అని ఒకరిమీద ఒకరు తోసుకుంటూ తప్పుకున్నారు. నేను అప్పుడు, మీకు అభ్యంతరం లేకపోతె నాఇంట్లో ఉండండి అని తనని ఆహ్వానించాను. నా ఫ్రెండ్ కూడా, మీకు ఇష్టమైతే ఉండండి, వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, పైగా మిమ్మల్ని కాపాడింది కూడా తనే అని అంటే, రూప, అలాగే, మీరు చెప్పింది కూడా నిజమే, నన్ను కాపాడి బ్రతికించారు అని అంటూ నా ఇంట్లో ఉండటానికి రూప ఒప్పుకుంది. నాకు లోపల మహా ఆనందంగా ఉంది. రూప నాతో ఒకే ఇంట్లో ఉండబోతోంది అన్న ఊహే నన్ను నిలువనీయటంలేదు.

కాసేపటికి అంతా జారుకున్నారు. నేను తలుపు వేసి, రూపకి రెండో పడకగది చూపించి, మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చు. నేను ఉండగా మీకు భయం లేదు, వెళ్లి కాస్తమొహం కడుక్కుని రండి, కాస్త అలసట తగ్గుతుంది అని లోపలికి పంపించాను. నేను అలా సోఫాలో కూర్చుని జరిగింది నెమరువేసుకుంటుంటే, ఇంతలో రూప బయటకి వచ్చింది, అతను కొట్టిన దెబ్బలకి బుగ్గలు వాతలు తేలి వాచిపోయాయి. అసలే బూరె బుగ్గలు, ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి. తను అలసటగా నా ముందు కూర్చుని కళ్ళు మూసుకుంది. నేను తనని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చోనిచ్చి, రూప గారు అసలు ఏమి జరిగింది అని అడిగాను, తను ఏమి మాట్లాడకపోతే నేను వెంటనే, మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం వద్దులెండి, మీరు విస్రాంతి తీసుకోండి అని అన్నాను. తను బాధగా నవ్వి, అదేమీ లేదులెండి, నా బ్రతుకులో విస్రాంతి ఎక్కడ, నేను మీకన్నా చిన్న దాని, నన్ను పేరు పెట్టి పిలవండి, నువ్వు అనండి, మీరు అనొద్దు అని చెప్పింది. నేను సరే అంటే, తను తన గురించి చెప్పడం మొదలు పెట్టింది.