పతి, పత్నీ! 1 674

ఆమెని చూస్తుంటే ముచ్చట, దాహం, మోహం….ఇంకా చాల చాలా…వేసాయి అతనికి. తట్టుకోలేక, బాటిల్ ఓపెన్ చేసి గటగటా నీళ్లు తాగేసాడు. “అదేంటీ, అప్పుడే దాహమా? ఫారెస్ట్ లో ఇంకా దాహమేసే అవకాశం ఉంది, కాస్త నీళ్లు దాచుకో.” అంది ఉష. ఆమె ఏ ఉద్దేశ్యంతో అందో తెలీదు గానీ, “దాహమేం ఖర్మ…ఎక్కిళ్ళే తెప్పించేట్టుంది.” అనుకుంటూ జీప్ ఎక్కాడు రవి. ఆమె కూడా ఎక్కి పక్కన కూర్చుంది. జీవితంలో మొదటి సారి, ఒక అమ్మాయి పక్కనుంటే టెన్షన్ ఫీల్ అవుతున్నాడతను. ఆ టెన్షన్ తోనే జీప్ ని స్టార్ట్ చేసాడు. ఒక్క కుదుపుతో ముందుకు దూకింది.

అడవిలో సుమారు ఒక గంట ప్రయాణించేసరికి, ఇక దారి అంతమయిపోయింది. ఇద్దరూ జీప్ నుండి కిందకి దిగారు. “ఇక ఇంకా లోపలకి వెళ్ళాలంటే, నడవాల్సిందే.” అన్నాడు రవి. “నడుద్దాం. అందుకేగా వచ్చింది.” అంది ఉష. “మరి మధ్యలో కాళ్ళు నొప్పి వస్తున్నాయ్, నడవలేనూ అనకూడదు.” అన్నాడతను. ఆమె అతన్ని ఓరగా చూస్తూ,”మ్…ఒకవేళ నడవలేకపొతే, ఎత్తుకు మోయడానికి నువ్వు ఉన్నావు కదా.” అంది. ఆమె అలా చూస్తూ, అలా అంటుంటే, మనసులో ఏదోమూల చిన్న అలజడి. చిన్నదే కదా అని అతను నిర్లక్ష్యం చేసాడు. కాని పెద్ద పెద్ద తుఫానులు మొదలయ్యేది చిన్న అలజడులతోనే అన్న విషయం పాపం అతనికి తెలియదు.

ఆమె అక్కడ ఉన్న చిన్న గుట్టమీదకి ఎక్కుతూ, అతనికి తన చేయి అందించింది. అతను పట్టుకున్నాడు. చిన్నప్పుడు పదో తరగతిలో చదువుకున్న పాఠం గుర్తుకొచ్చింది అతనికి, వలయం పూర్తయితే విద్యుత్ ప్రవహిస్తుందని. ఆమె చేతిని పట్టుకోగానే వలయం పూర్తయినట్టుంది, అతనిలో సన్నటి విద్యుత్ ప్రవహించడం మొదలయ్యింది. మరి ఆమెకెలా ఉందో? అన్నట్టు ఆమెని కను చివరల నుండి చూసాడు. కేజువల్ గా ఉందామె.

ఒక అమ్మాయి, తనకు అంత దగ్గర అయిన అబ్బాయి దగ్గర కేజువల్ గా కనిపిస్తుందంటే, దాని అంతరార్ధం ఏమిటి మిత్రులారా!?

రవి ఆమెకి ఆమె బేగ్ అందించి, తను కిట్ బేగ్ తీసుకొని గుట్ట ఎక్కాడు. ఇద్దరూ ముందుకి నడవడం మొదలు పెట్టారు. మొదట పలచగా ఉన్న అడవి, రానురానూ దట్టంగా మారుతుంది. సుమారు ఒకగంట ప్రయాణించాకా, అతను “హుష్..” అని ఒక బండ మీద కూర్చుండిపోయాడు. ఆమె అదిచూసి నవ్వుతూ, “ఏంటీ, అబ్బాయి గారి పని అయిపోయిందా!” అంది. “హుమ్..ఇంత దూరం ఎప్పుడూ నడవ లేదు తెలుసా..” అన్నాడతను. “మ్…నాకు కాళ్ళు పీకితే నువ్వు ఎత్తుకు తీసుకువెళతావూ అనుకున్నాను. ఇప్పుడు నిన్ను నేను ఎత్తుకు తీసుకెళ్ళాలేమో.” అంది కొంటెగా. అతను ఏదో ఆలోచిస్తూ రెండు క్షణాలు ఉండిపోయి, సడన్ గా అన్నాడు “అవునూ, నా కంటే బలహీనంగా కనిపిస్తున్నావు, నువ్వు అలసిపోలేదు. నేను అలసి పోయానేంటీ?” అని. ఆమె నవ్వుతూ “రాత్రి మందు కొట్టలేదుగా, అందుకే అయి ఉంటుంది.” అంది. రాత్రి మందు కొట్టక పోవడం కాదు, ఇన్నాళ్ళూ కొట్టిన మందు ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది, అన్న విషయం అతనికి అర్ధమయింది. “ఒక ఆడపిల్ల ముందు ఓడిపోవడమా! ఇక లైఫ్ లో మందు కొట్టకూడదు.” అని బలంగా తీర్మానించుకొని, పైకి లేచాడు.

మరో అరగంట నడిచేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది. కాస్త లోతు తక్కువగానే కనిపిస్తుంది గానీ, వడివడిగా ప్రవహిస్తుంది. ఆమె ఆ ప్రవాహం వైపే బిక్కమొహం వేసి చూస్తూ ఉంది. ఆమె మొహం చూసి నవ్వుతూ “ఏమిటీ, అలా చూస్తున్నావ్? ఈత రాదా!?” అన్నాడు. ఆమె రాదూ అన్నట్టు తల అడ్డంగా ఊపింది. “మరి ఇక్కడే ఆగిపోదామా?” అన్నాడతను. ఆమె చురుకుగా అతని వైపు చూసి “ఏం? నీకు కూడా రాదా?” అంది. “వచ్చు మేడమ్.” అన్నాడతను. “మ్…అయితే నువ్వే నన్ను అటువైపుకి తీసుకెళ్ళు.” అంది. అతను తగిలించుకున్న కిట్ ని పక్కన పెట్టి, నీటిలోకి దిగాడు. అతని చేయి పట్టుకొని ఆమె కూడా నీటిలోకి దిగి, చల్లని నీళ్లు కితకితలు పెట్టడంతో “ఏఏయ్.య్..” అంటూ, కిలకిలా నవ్వుతూ, “అబ్బా, ఈ నీటిలో స్నానం చేస్తే భలే ఉంటుంది కదా.” అంది. అతను కూడా నవ్వుతూ “అయితే చెయ్.” అన్నాడు. “అమ్మో! పడిపోతాను, ఇంకా బట్టలు కూడా తడిసిపోతాయి.” అంది. “బావున్నాయ్ నీ తెలివితేటలు.

6 Comments

  1. Megatha katha ledu
    Complete in store please

  2. Nice bro ninu edhi edhi story felem thidham Anu kuntuna nuku okana

  3. EXLENT next part eppuduu

Comments are closed.