ప్రేమకధ 292

స్వప్న ను అక్కడ దింపి బైక్ పార్క్* చేసి రూమ్ కి బయల్దేరుతూ ఆమెను చూసి ఆగాడు.ఆమె దూరం నుంచి ఒక ముద్దు విసిరేసింది.
అక్కడ నుంచి కాకపోతే దగ్గరకు వచ్చి ఇవ్వవచ్చుగా అన్నాడు.
నువ్వు దగ్గరకు వస్తే ఇస్తాగా అంది కొంటెగా,
సన్నీ ఆనందంగా ఆమె అధరామృతాన్ని జుర్రుకోడానికి దగ్గరకు చేరి ఇవ్వు అన్నాడు.
ఆమె సన్నీ బుగ్గ పై ముద్దు పెట్టింది.
ఇదేంటి అని అడిగాడు.
ముద్దు అని చెప్పింది ముద్దగా.
అది తెలుసు నేనడిగింది ఇలా కాదు అన్నాడు.
నేనిస్తానన్నది మాత్రం ఇదే బాబు,
ఏయ్ ఇలా ఆశ పెట్టడం పాపం.
పాపం ఎం కాదు ఇప్పుడు బుద్ధిగా రూమ్ కి వెళ్ళు అంది.
ఊ హూ నేను వెళ్ళను అన్నాడు.
ఇప్పుడు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్తే ఈ వీకెండ్*లో నీతో డేట్ కి వస్తా అని బంపర్ ఆఫర్ ఇచ్చింది.
నువ్వు అదే మాట మీద ఉండు వీకెండ్* వరకు స్వాతిముత్యం లో కమల్ హాసన్ లా ఉంటా అన్నాడు.
అలా కాసేపు మాట్లాడుకుని సన్నీ బయల్దేరాడు.

రూమ్ కి వచ్చాడే కాని మనసు మాత్రం స్వప్న దగ్గరే ఉంది.కాసేపు టివి చూశాడు అన్నీ బోర్ కావడంతో కాసేపు స్వప్న తో మాట్లాడదామని తన సెల్ ఫొన్ తీసి స్వప్న నంబర్ కు డైల్ చేశాడు కానీ నో ఆన్సర్* మళ్ళీ కాల్ చేశాడు సేమ్ అగైన్ నో ఆన్సర్*.
సరే తర్వాత కాల్ చేద్దామని సెల్ సోఫా పై వేసి డ్రెస్ మార్చుకుని జిమ్ కి వెళ్లాడు.
అక్కడ కసరత్తులన్నీ ముగించుకుని వస్తూ ఒక హోటల్లో నైట్ తినడానికి పార్శిల్ తీసుకుని రూమ్ కి వచ్చేసరికి 8pm అయింది.
బాత్రూం వెళ్లి స్నానం చేస్తుండగా కాలింగ్*బెల్ మోగింది.
స్నానం చేసి వచ్చేలోపే మరోసారి బెల్ మోగింది సన్నీ అని పిలిచినట్టుగా వినబడింది ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే ఎవరబ్బా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసాడు.
ఎదురుగా స్వప్న ని చూసి సన్నీ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది.
స్వప్న అన్నాడు.
ఆమె �సన్నీ ఈ స్వప్నా….” అంటూ ఏదో చెప్పేలోపే ముందు నువ్వు లోపలికి రా అంటూ ఆమె చేతిని పట్టుకుని లోపలకు తీసుకెళ్ళాడు.
కూర్చో అన్నాడు.
ఆమె కూర్చుంటూ నోరు తెరిచేలోపే
చెప్పు మొదటిసారిగా నా రూమ్ వచ్చావ్ కాఫీ ఆర్ టీ ఎం కావాలి.
నీకు కాఫీ చెయ్యడం కూడా వచ్చా అని అడిగింది ఆశ్చర్యంగా.
వచ్చా ఎంటి నువ్వు అలా కూర్చొ ఐదు నిముషాల్లో అదిరిపోయే కాఫీ తో వాస్తా అని లోపలకు కదిలాడు.
ఆమె �సన్నీ కాఫీ తర్వాత ముందు నేను చెప్పేది విను” అటుండగానే సన్నీ వెళ్లిపోయాడు.
లోపలకు వెళ్ళిన సన్నీ కాఫీ పెడుతూ అయినా వీకెండ్* వరకు ఆగాలా ఇప్పుడు ఒక ట్రైల్ వేస్తే ఎలా ఉంటది ఎలా స్టార్ట్* చేద్దాం అనుకుంటూ కాఫీ రెడీ చేసి ఆమె దగ్గరకు వచ్చాడు.

3 Comments

  1. Plz stories complete cheyandi

  2. Plz stories complete cheyandi

Comments are closed.