ప్రేమకధ 292

స్వప్న పెద్దగా నవ్వేస్తూ హహ సారీ అంది.

సారీ నా ఓకే ఓకే చెప్తా నీ పని దిగు అన్నాడు.

ఎందుకు?

సారీ నువ్వు చెప్పావ్ మరి నేను కూడా చెప్పాలి కదా అని పక్కకి చూస్తూ అన్నాడు.

ఏంటబ్బా అటు చూస్తున్నాడు అని స్వప్న కూడా చూసి నో నేను రాను అంది.
(అక్కడ ఒక సినిమా ధియేటర్ ఉంది)

టైం నాకు ఇచ్చేశావ్ కదా రావాల్సిందే అంటూ ధియేటర్ లోకి వెళ్లాడు.
సినిమా ఆల్రెడీ మొదలైంది ఇద్దరికీ టికెట్ తీసుకుని లోపల కి వెళ్లారు.
అది హిందీ సినిమా కావడం తో లోపల పెద్దగా జనం లేరు.సీట్ నంబర్లు చూసి సన్నీ నవ్వకుంటూ స్వప్న వైపు చూశాడు.

మన సీటింగ్ ఎక్కడ అని అడిగింది.

అతను నవ్వుతూ వేలు చూపించాడు అవి కార్నర్ లో ఉన్నాయ్.

వామ్మో నేను రాను అసలే నువ్వు కాక మీద ఉన్నావ్ పైగా ధియేటర్ లో క్రౌడ్ లేదు అందులోనూ అవి కార్నర్ సీట్లు నేను రాను బాబు అంది.

అదేంటి అలా రానంటే ఎలా టైం నాకు ఇచ్చావ్ చూడు నిజంగానే టైం నాది అంటూ కన్ను కొట్టి స్వప్న చేతిని పట్టుకొని సీట్ దగ్గరకు వెళ్లాడు.

ఇద్దరూ కూర్చుని మూవీ చూస్తున్నారు.మధ్యలో సన్నీ స్వప్న వైపు చూశాడు.

స్వప్న సినిమా చూడకుండా ఎక్కడో చూస్తుంది.ఏంటా అని చూస్తే వాళ్లకి మూడు వరుసల ముందు ఇద్దరు ముద్దు పెట్టుకోడాన్ని స్వప్న తొంగి చూస్తుంది.

సన్నీ నవ్వుకుంటూ స్వప్న చేతి పైన చెయ్ వేశాడు.స్వప్న ఏం మాట్లాడకుండా మూవీ చూస్తుంది.
సన్నీ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు.

ఆమె నవ్వుతూ వీడికసలు బుద్ది లేదు ముద్దు ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు వీడికి అంది.

అమ్మ దొంగా అంటూ సన్నీ ఆమె రెండు బుగ్గలపై తన అరచేతులు వేసి ఒక్కసారిగా ఆమె పెదాలని తన పెదాలతో లాక్కున్నాడు.

3 Comments

  1. Plz stories complete cheyandi

  2. Plz stories complete cheyandi

Comments are closed.