రాములు ఆటోగ్రాఫ్ – 46 137

మనోజ్ అడిగిన దానికి చెప్పకుండా ఉండటానికి వెంకట్(సతీష్) చాలా ట్రై చేస్తున్నాడు.

చైర్‍లో తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ఎగిరెగిరి పడుతున్నాడు.

కాని అతని కాళ్ళు చేతులు చైర్‍కి కట్టేసి ఉండటంతో చేతులను, కాళ్ళను విడిపించుకోలేకపోతున్నాడు.

మనోజ్ అలా అడుగుతుండగానే వెంకట్ చలనం లేనట్టు కదలకుండా పడుకుండిపోయాడు.

దాంతో మనోజ్ మెల్లగా వెంకట్ దగ్గరకు వచ్చి, “వెంకట్….చెప్పు….ఇప్పుడు నువ్వు మళ్ళీ సూసైడ్ చేసుకుంటే మళ్ళీ ఎవరు యాక్టివేట్ అవుతారు….చెప్పు,” అంటూ అతని మొహం దగ్గరకు వెళ్లాడు.

కాని ఎవరు ఊహించని విధంగా వెంకట్ కళ్ళు తెరిచి మనోజ్ చెవిని పళ్ళతో పట్టుకుని కొరుకుతున్నాడు.

అక్కడే ఉన్న రాము వెంటనే తేరుకుని వెంకట్ నుండి మనోజ్ ని విడిపించాడు.

దాంతో వెంకట్ (సతీష్) కోపంగా మనోజ్ వైపు చూస్తూ, “ఎవరికిరా మందిచ్చావు….పిచ్చినా కొడకా….నేను ఎవరో తెలుసు కదా….” అన్నాడు.

రాము ఇక కోపం పట్టలేక వెంటనే వెంకట్‍(సతీష్)ని కొట్టడం మొదలుపెట్టాడు.

అప్పటిదాకా బయట స్క్రీన్‍లో చూస్తున్న ప్రసాద్, కమీషనర్, మిగతా వాళ్ళు వచ్చి రాముని పట్టుకుని వెనక్కు లాగారు.

కాని రాము ఇంకా ఆవేశంగా వెంకట్(సతీష్) ని కొట్టడానికి వెళ్తుంటే ప్రసాద్ అతన్ని పట్టుకుని ఆపుతూ, “సార్…సార్… కంట్రోల్ చేసుకోండి…వాడు చనిపోతే…తరువాత ఎవరు యాక్టివేట్ అవుతారు అనేది తెలియకుండా పోతుంది…మళ్ళీ మనం మొదటికే వస్తాము…ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది,” అంటూ గట్టిగా పట్టుకున్నాడు.

దాంతో రాము అతి కష్టం మీద తనను తాను కంట్రోల్ చేసుకుంటూ నిలబడిపోయాడు.

తరువాత అందరూ కలిసి అక్కడ నుండి బయటకు వచ్చారు.

రాము తన టీమ్‍తో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని వాళ్ల వైపు చూస్తూ…..

రాము : వెంకట్ తరువాత ఎవరిని సెలక్ట్ చేసుకున్నాడో తెలియలేదు….అతనెవరో కనిపెట్టలేకపోతే మనం ఇప్పటిదాకా పడిందంతా వేస్టే….వెంకట్ తాలూకు ఫ్రండ్స్, రిలేటివ్స్, స్టూడెంట్లు, స్టాఫ్….అందరినీ కలిపి ఒక లిస్ట్ తయారు చేయండి…

దాంతో రాము తన టీంలో కొంతమందికి…..ప్రసాద్ టీంలో కొంతమందికి లిస్ట్ డివైడ్ చేసి ఎవరెవరు ఏం పని చేయాలో చెప్పి ప్రసాద్‍తో పాటు ఇంటికి వచ్చేసాడు.

అప్పటికి టైం సాయంత్రం ఆరు గంటలు అయింది.
బంగ్లాలోకి రాగానే రాము లోపలికి వెళ్తూ తన డ్రైవర్‍ని పిలిచి సుభద్ర వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి, “నువ్వు అక్కడకు వెళ్ళి కారులో కూర్చో….ఒకామె వచ్చి కారు ఎక్కుతుంది…ఆమెను ఇక్కడకు తీసుకునిరా,” అని చెప్పి పంపించాడు.

రాము ఫ్రెష్ అయిన తరువాత హాల్లోకి వచ్చి కూర్చున్నాడు.

ప్రసాద్ అప్పటికి హాల్లో కూర్చుని టీవి చూస్తున్నాడు.
రాము తన ఫోన్ తీసుకుని, “ఏంటి డార్లింగ్….నా కోసమే ఎదురుచూస్తున్నావా,” అని సుభద్రకు మెసేజ్ పంపించాడు.
సుభద్ర : అవును….నీ మెసేజ్ కోసమే ఎదురుచూస్తున్నా…..
రాము : నిజంగానా డార్లింగ్….నేను చెప్పినట్టు రెడీగా ఉన్నావా….
సుభద్ర : హా….నువ్వు చెప్పినట్టే బ్లాక్ కలర్ చీర, జాకెట్, లంగా వేసుకుని రెడీగా ఉన్నాను….
రాము : సరె…ఇప్పుడు నువ్వు నీ ఇంటి నుండి బయటకు వచ్చి చూడు…
సుభద్ర : ఒక్క నిముషం….(అంటూ బయటకు వచ్చి) హా….బయటకు వచ్చాను…ఇపుడు ఏం చేయాలి…..
రాము : అక్కడ బ్లాక్ కలర్ బెంజ్ కారు…కారు నెంబర్ xxxxx కనిపిస్తున్నదా….
సుభద్ర అటూ ఇటూ చూసి తన ఇంటి ఎదురుగా బెంజ్ కారు కనిపించడంతో దాని దగ్గరకు వచ్చింది.
సుభద్ర రావడం చూసిన డ్రైవర్ వెంటనే కారు వెనక డోర్ తీసి, “ఎక్కండి మేడమ్,” అన్నాడు.
సుభద్రకు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు….అంత ఖరీదైన కారు తను ఎప్పుడూ ఎక్కి ఉండకపోవడంతో అసలు తనకు మెసేజ్‍స్ పంపుతున్నది ఎవరో అర్ధం కాక, “కారులో కూర్చున్నా….” అని మెసేజ్ పంపించింది.
రాము : గుడ్….మెదలకుండా కూర్చో….డ్రైవర్‍తో మేము ఎవరు, ఏంటి అని ఏమీ అడగొద్దు…అతను నిన్ను తీసుకుని వస్తాడు….
సుభద్ర : నన్ను ఎక్కడకు తీసుకెళ్తున్నారు….నాకు చాలా భయంగా ఉన్నది….
రాము : భయపడాల్సిన పని ఏం లేదు సుభద గారూ…మేము చాలా మంచి వాళ్ళం….మిమ్మల్ని మళ్ళీ సేఫ్‍గా ఇంటి దగ్గర దింపే భాధ్యత నాది….
సుభద్ర : సరె…..(అని మెసేజ్ పంపి కారులో నుండి తనను ఎక్కడకు తీసుకెళ్తున్నారో అని బయటకు చూస్తున్నది.)
పావుగంట తరువాత కాలు పెద్ద విల్లా లోకి వెళ్ళడం గమనించింది.
గేటు దగ్గర నుండి విల్లా దగ్గరకు వెళ్ళడానికే కిలో మీటర్ దూరం ఉన్నది.
సుభద్ర తన మనసులో, “ఇంత పెద్ద విల్లానా….అయినా వీళ్ళు ఎవరు…నన్నెందుకు ట్రాప్ చెస్తున్నారు….ఇంకొద్ది సేపటిలో వీళ్ళు ఎవరో తెలిసిపోయిద్ది,” అని అనుకుంటూ విల్లా వైపు చూస్తూ ఉన్నది.
డ్రైవర్ విల్లా ముందు కారు ఆపి కిందకు దిగి వెనక డోర్ తెరిచి సుభద్రని దిగమన్నట్టు నిల్చున్నాడు.
సుభద్ర అయోమయంగా కారు దిగి విల్లా లోపలికి వెళ్ళింది.
విల్లాలోకి వెళ్ళగానే పనామె వచ్చి, “సార్….పైన ఉన్నారు….వెళ్ళండి…” అంటూ అటు వైపు వెళ్ళమన్నట్టు మెట్లు చూపించింది.

2 Comments

  1. Anna story super ga undhi apakunda continu cheyandi

Comments are closed.