రాములు ఆటోగ్రాఫ్ – 46 137

మనోజ్ : మరి సీరియల్ యాక్ట్రస్ హంసని ఎందుకు చంపావు….ఆమెకు నీకు సంబంధం ఏంటి….
వెంకట్ (సతీష్) : దాన్ని ఎందుకు చంపానో నీకు బాగా తెలుసు…..
ఆ మాట వినగానే రాము వెంటనే మనోజ్ వైపు చూసాడు….

మనోజ్ : నాకా….నాకు ఎలా తెలుసు….వివరంగా చెప్పు…..

వెంకట్ (సతీష్) : చెబుతాను….ఒకసారి మనం రెస్టారెంట్‍కి మన ఫ్యామిలీతో వెళ్లాము గుర్తుందా…..

మనోజ్ : అవును….

వెంకట్ (సతీష్) : అప్పుడు ఒక చిన్న గొడవ జరిగింది గుర్తు లేదా…..అయితే చెబుతా విను…..

(ఫ్లాష్ బ్యాక్ మొదలు)

వెంకట్, అతని భార్య, మనోజ్, అతని భార్య ఒక రెస్టారెంట్‍లో లంచ్ చేస్తున్నారు.

వెయిటర్ వచ్చి జ్యూస్ గ్లాసులు పెట్టి వెళ్ళిపోతాడు.

వెంకట్ అక్కడ ఉన్న టిష్యూ పేపర్ తీసుకుని దాంతో గ్లాసుని శుభ్రంగా తుడిచి టిష్యూ పేపర్‍తో పట్టుకుంటాడు.

అది చూసిన మనోజ్, “రేయ్….ఏంటిరా అలవాటు….గ్లాసు క్లీన్‍గానే ఉన్నది కదా….ఇదేమైనా ల్యాబ్ అనుకున్నావా…లేక నీ చేతిలో ఉన్నది కెమికల్ అనుకున్నావా…ఊరికే తుడుచుకుంటూ పట్టుకుంటున్నావు….

వెంకట్ : ఏం చేస్తాంరా….అలవాటయిపోయింది….

మనోజ్ : మనందరం కలిసి ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేసి ఎన్ని రోజులు అయిందో…

అలా నలుగురూ కలిసి సరదాగా మాట్లాడుకుంటుండగా వెంకట్ చూపు అక్కడ ఉన్న గ్లాస్‍లో నుండి బయట అప్పుడే రెస్టారెంట్ లోకి వస్తున్న సీరియల్ యాక్ట్రస్ హంస మీదకు వెళ్ళింది.

హంస చాలా అందంగా నవ్వుతూ తన దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఆటోగ్రాఫ్‍లు ఇస్తూ ఉంటే పక్కనే ఆమె మేకప్‍మేన్ సుబాని వాళ్ళను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు.

వెంకట్ ఆమె వైపు అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు.

కాని మిగతా ముగ్గురూ మాత్రం వెంకట్‍ని పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

హంస అందరికీ ఆటోగ్రాఫ్‍లు ఇచ్చిన తరువాత రెస్టారెంట్ లోకి అడుగుపెట్టింది.

హంసని అలాగే చూస్తూ వెంకట్, “ఇక మీద బాగా ఎంజాయ్ చేయాలి….ఇప్పటి వరకు మన నలుగురం ఎంజాయ్ చేసాము…ఇక నుండి ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం…కొత్త మనిషిగా….,” అంటూ తమ వైపు వస్తున్న హంస వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు.

అలా వస్తున్న హంసని వెనక నుండి ఆమె ఆటోగ్రాఫ్ కోసం ముందుకు తోసుకురావడంతో ఆమె బేలన్స్ తప్పి వెంకట్ మీద పడింది.

ఆమె అలా పడటంతో వెంకట్ చేతిలో ఉన్న గ్లాస్‍లో ఉన్న జ్యూస్ ఒలికి పోయి అతని షర్ట్ మీద పడింది.

అసలే చాలా నీట్‍గా ఉండే వెంకట్….తన షర్ట్ మీద జ్యూస్ పడేసరికి చాలా కోపం వచ్చింది.

హంస కూడా కంగారుగా వెంకట్ వైపు చూసి, “సారి….సారీ….రియల్లీ సారి,” అన్నది.

వెంకట్ వెంటనే టిష్యూ పేపర్ తీసుకుని తన షర్ట్‍ని తుడుచుకుంటూ చైర్‍లో నుండి లేచి హంస వైపు కోపంగా చూస్తూ, “కళ్ళు కనిపించడం లేదా….” అంటూ కోపంగా చూసాడు.

హంస వెంటనే, “సారీ….అనుకోకుండా జరిగింది….వెనకాల ఎవరో తోసారు….సారీ,” అంటూ నచ్చచెప్పడానికి ట్రై చేస్తున్నది.

కాని వెంకట్ మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా, “వెనక వాళ్ళు బుధ్ధి లేకుండా మీదకు ఎక్కేస్తుంటే….సిగ్గు లేకుండా నవ్వుతూ ఉండకపోతే పక్కకు వెళ్ళొచ్చుగా,” అన్నాడు.

అంతలో పక్కనే ఉన్న సుబాని, “హలో సార్….ఎక్కువగా మాట్లాడకండి….వెనకాల ఎవరో తోస్తే….బేలన్స్ తప్పి మీద పడ్డారు….సారీ కూడా చెప్పారు కదా…ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు…” అన్నాడు.

వెంకట్ కూడా ఏమీ తగ్గకుండా, “మీ మేడమ్ మీద ఎవరు చెయ్యి వేసినా నవ్వుతూ మాట్లాడుతుంది…దానికి అలా నచ్చిందని…నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి,” అన్నాడు.

2 Comments

  1. Anna story super ga undhi apakunda continu cheyandi

Comments are closed.