రాములు ఆటోగ్రాఫ్ – 46 137

దాంతో సుబాని ఇక కోపం పట్టలేక వెంకట్ చెంప మీద గట్టిగా కొట్టాడు.

హంస వెంటనే సుబాని చేయి పట్టుకుని ఆపుతూ, “వదిలెయ్ సుబాని….మర్యాద తెలియని వాడితో మనకు మాటలు ఏంటి…వీడితో మాట్లాడితే మన టైం వేస్ట్ అవుతుంది….పద వెళ్దాం,” అని అక్కడ నుండి తీసుకెళ్ళిపోయింది.

(ఫాష్ బ్యాక్ అయిపోయింది)

వెంకట్ (సతీష్) : నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను…ఛాన్స్ దొరికితే మేకప్ మేన్ ద్వారా చంపాలని డిసైడ్ అయ్యి ఒకరోజు దాన్ని చంపేసాను…..

మనోజ్ : అదెలా జరుగుతుంది…ఇక్కడ నీ బాడీలో నుండి…ఇంకొకరి బాడీలోకి వెళ్లడం ఎలా కుదురుతుంది …క్లియర్‍గా చెప్పు….

వెంకట్(సతీష్) : నేను….అశోక్ శరీరంలోకి రాగానే నా తరువాత టార్గెట్ సుబానిని సెలక్ట్ చేసుకుని….వాడి బ్రెయిన్‍లో అప్పటి వరకు ఉన్న నా మెమొరీస్ మొత్తం కాపీ చేసుకుని….మళ్ళీ నేను అశోక్ బాడీలో ఉన్నప్పుడు చనిపోయే పరిస్థితుల్లో నా దగ్గర ఉన్న ఎలక్ట్రానికి సిగ్నల్స్ ద్వారా ఒకరి బాడీ లోనుండి సుబాని బాడీలోకి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వస్తాను…అలాగే మేకప్‍మేన్ చావగానే సతీష్ బాడీలో మేల్కొన్నాను…ఇప్పుడు సతీష్ ని చంపాలి….అప్పుడే నా చివరి జ్ఞాపకాలతో నేను కోరుకున్న మనిషిలోకి వెళ్ళగలను…

మనోజ్ : అది ఎలా చేస్తున్నావు….ఎక్కడ చేస్తున్నావు….

వెంకట్ (సతీష్) : నా ల్యాబ్‍లోనే ఆ పని చేయగలను….

మనోజ్ : నీ ల్యాబ్ ఎక్కడున్నది….

వెంకట్ : నా ల్యాబ్…..(అంటూ తనను తాను ఆ మెడిసిన్ నుండి కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు.)

మనోజ్ : ఎక్కడ ఉన్నది….వెంకట్….చెప్పు….నీ ల్యాబ్ ఎక్కడున్నది…..

వెంకట్ : నా ల్యాబ్…..(అంటూ గింజుకుంటూ…)నో….

రాము వెంటనే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా మనోజ్ దగ్గరకు వెళ్ళి అతని చెవిలో, “తరువాత ఎవరో అడగండి,” అన్నాడు.

మనోజ్ : వెంకట్….ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకుంటే తరువాత ఎవరు యాక్టివేట్ అవుతారు….(అంటూ వెంకట్(సతీష్) మీద చెయ్యి వేసి కదుపుతూ) ఎవరు యాక్టివేట్ అవుతారు…..కమాన్….వెంకట్…చెప్పు….ఎవరు…

2 Comments

  1. Anna story super ga undhi apakunda continu cheyandi

Comments are closed.