రాములు ఆటోగ్రాఫ్ – 47 84

దాంతో మానస ఆ ఫైల్ తీసుకుని మొత్తం ఫోటోలను చూస్తూ ఒక రిపోర్ట్ రెడీ చేసింది.
మానస : మీరు ఇచ్చిన ఫోటోలను మొత్తం చూసిన తరువాత నా ఎనాలసిస్ ప్రకారం పదిహేను మందిని సెలక్ట్ చేసాను …అది కూడా వీళ్ళనే ఎందుకు సెలక్ట్ చేసానంటే….వీళ్ళంతా వెంకట్ కి చాలా దగ్గర వాళ్ళు, ఫైనాన్షియల్‍గా చాలా బలమైన వాళ్ళు…వీళ్ళ మెడికల్‍ రిపోర్ట్‍లు కూడా చాలా బాగున్నాయి….కాబట్టి ఈ పదిహేను మందిలో తరువాత అతను ఎవరో చెప్పబోయేది సతీష్(వెంకట్) మాత్రమే…..ఒక్కసారి నేను అతనితో మాట్లాడొచ్చా….
దాంతో రాము ఇంటరాగేషన్ రూమ్ లోకి వెళ్ళి సతీష్(వెంకట్)కి పాలిగ్రాఫ్ ఫిక్స్ చేసి…ఎదురుగా ఉన్న టేబుల్‍కి ఇంకో వైపు మానసని కూర్చోబెట్టి బయటకు వచ్చి అక్కడ ఉన్న గ్లాస్‍లో నుండి లోపల జరిగేది చూస్తున్నారు.
మానస : మీ ఎదురుగా ఉన్నది ఏంటో తెలుసా డాక్టర్ వెంకట్…..

వెంకట్(సతీష్) : నాకు ఎందుకు తెలియదు….పాలిగ్రాఫ్….నిజం తెలుసుకోవడానికి ఇంతకు ముందు మత్తు మందు ఇచ్చారు….ఇప్పుడు ఇది…..

మానస రూమ్‍లో ఉన్న లైట్లు అన్నీ ఆఫ్ చేసి ప్రొజక్టర్ ఆన్ చేసి అందులో ఉన్న ఫోటోలను వెంకట్(సతీష్)కి చూపిస్తున్నది.
వెంకట్(సతీష్)కి ఆ ఫోటోలు చూపిస్తూ తన ఎదురుగా ఉన్న మానిటర్‍లో అతని హార్ట్‍కి సంబంధిమ్చిన సిగ్నల్స్‍ని చూస్తున్నది.
మొత్తం చూపించిన తరువాత మానస లైట్లు ఆన్ చేసి బయటకు వచ్చింది.
బయటకు వచ్చిన ఆమెకు రాము వాళ్ళతో పాటు కమీషనర్ కూడా ఉండటంతో ఆయనకు విష్ చేసింది.
కమీషనర్ : ఏమైనా తెలిసిందా…..
మానస : పల్స్ రేటింగ్ టెస్ట్‍లో మొదటినుండి సతీష్(వెంకట్) హార్ట్ బీట్ మామూలుగానే ఉన్నది….కాని obnormal గా ఏమీ అనిపించలేదు…
రాము : సార్….సతీష్ (వెంకట్)కి పాలిగ్రాఫ్ టెస్ట్ ఒక వంక మాత్రమే….దాని వెనక ఇంకో ఆలోచన ఉన్నది…ఫేస్ రీడింగ్ ….దాని వలన ఒకరి మొహంలో కలిగే మార్పులను బట్టి వారి మానసిక పరిస్థితిని కనిపెట్టి టెస్ట్…దాంతో సతీష్(వెంకట్) కి తెలియకుండా పాలిగ్రాఫ్ టెస్ట్ అని చెప్పి face expression test తీసుకున్నాము….
కమీషనర్ : అలా ఎందుకు…..
రాము : face expression test అని చెబితే సతీష్(వెంకట్) జాగ్రత్త పడే అవకాశం ఉన్నది….అందుకే పాలిగ్రాఫ్ టెస్ట్ అని చెప్పాల్సి వచ్చింది….ఈ టెస్ట్ జరుగుతున్నంతసేపు సతీష్(ప్రమో) ఫేస్ expressions అన్నిటినీ కెమేరాలో రికార్డ్ చేసాము….(అంటూ కెమేరాని కంప్యూటర్‍కి కనెక్ట్ చేసాడు.)
దాంతో అందరూ ఆ వీడియోని చాలా పరీక్షగా చూస్తున్నారు.
అప్పుడు అక్కడే ఉన్న face read expert మొత్తం వీడియో చూసిన తరువాత, “ఈ వీడియోలో 3.05 లో ఒకసారి వచ్చింది రాము గారి ఫోటో….తరువాత 3.22లో ఇంకోసారి వెంకట్ ఒక ఆర్మీ ఆఫీసర్‍కి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు… ఈ రెండు సార్లు సతీష్(వెంకట్) పేనిక్ అయినట్టు తెలుస్తున్నది,” అన్నాడు.
రాము వెంటనే తన టేబుల్ మీద ఇంతకు ముందు వెంకట్ ఇంటి నుండి తెచ్చిన ఇన్విటేషన్స్ మొత్తం తీసుకుని ఒక్కోటి చూస్తూ అందులో ఒకదాన్ని కమీషనర్‍కి చూపిస్తూ, “సార్….ఈ ఫోటోలో వెంకట్ షేక్‍హ్యాండ్ ఇస్తున్నది ఆర్మీ మేజర్ నాగేష్ సార్….ఇంతకు ముందు ఎంక్వైరీ చేస్తే ఆ ఆర్మీ మేజర్ నాగేష్, వెంకట్ ఇద్దరూ కాలేజీ డేస్ నుండి మంచి ఫ్రండ్స్ అని తెలిసింది….రేపు మార్నింగ్ మేజర్ నాగేష్ సిటీలొ ల్యాండ్ అవుతున్నారు…ఆయన దిగిన వెంటనే Airport లోనే కలిసి జరిగింది అంతా వివరంగా చెప్పాలి సార్…..” అన్నాడు.
రాము చెప్పింది మొత్తం విన్న కమీషనర్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు.
రాము : సార్….నా నమ్మకం కరెక్ట్ అయితే తరువాత వెంకట్ యాక్టివేట్ అయ్యేది మేజర్ నాగేష్ లోనే సార్…..
కమీషనర్ : నమ్మకం ఉంటే సరిపోదు రామూ…పక్కా ప్రూఫ్‍లు కావాలి….మనం డౌట్ పడేది ఆర్మీ మేన్ మీద….ఆయన ఒప్పుకోకుండా ఆయన్ని కలవడం కూడా చాలా రిస్క్….అలాంటప్పుడు ఈ డౌట్ మీద ఆయన్ను కలవడం కూడా చాలా కష్టం….పైగా చాలా ప్రాబ్లం అవుతుంది….లీగల్‍గా ప్రొసీడ్ అవడానికి మన దగ్గర ఎవిడెన్స్ లేకపోయినా….మనకైనా క్లారిటీ ఉండాలి కదా….
ప్రసాద్ : సార్….లేకపోతే ఒక పని చెద్దాం….
కమీషనర్ : ఏంటది….
ప్రసాద్ : మనం సతీష్ దగ్గరకు వెళ్ళి….నీ next target ఎవరో తెలిసిపోయింది…నువ్వు తరువాత సెలక్ట్ చేసుకున్నది ఆర్మీ మేజర్ నాగేష్నే కదా మాకు తెలిసింది అని చెబుదాం….అప్పుడు వాడు టెన్షన్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేస్తే మనకు అప్పుడు కన్ఫర్మ్ అయినట్టే కదా…..
రాము : చాలా రిస్క్ ప్రసాద్….మెదలకుండా ఉండు….
కమీషనర్ : సరె…ఆ పనే చేద్దాం….
రాము : సార్….మీరు సీరియస్‍గానే చెబుతున్నారా….
కమీషనర్ : అవును రామూ….వేరే దారి లేదు…ప్రసాద్ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది….
ప్రసాద్ : అయితే మీరు నిజంగానే ఒప్పుకున్నట్టా సార్….
కమీషనర్ : అవును….(అంటూ రాము, ప్రసాద్ వైపు చూస్తూ) మీ ఇద్దరూ లోపలికి వెళ్ళీ ఈ ట్రిక్ ప్లే చేయండి….ఏం జరుగుద్దో చూద్దాం…..
దాంతో రాము, ప్రసాద్ అక్కడ నుండి ఇంటరాగేషన్ రూమ్ లోకి వెళ్ళారు.
లోపలికి వెళ్ళిన తరువాత రాము మెల్లగా వెంకట్(సతీష్) పక్కనే కూర్చుంటే ప్రసాద్ అక్కడ గోడకు ఆనుకుని వెంకట్ (సతీష్) మొహం వైపు చూస్తున్నాడు.
రాము : ఏంటి వెంకట్(సతీష్)….ఏం చేస్తున్నావో తెలుస్తుందా….అయినా ఆ మేజర్ ఏం చేసాడు…ఆయన్ని అలా ఇరికించారు….
ఆ మాట వినగానే సతీష్(వెంకట్) తల తిప్పి రాము వైపు చూసి నిర్లక్ష్యంగా నవ్వాడు.
దాంతో రాము ప్రసాద్ వైపు చూసి సైగ చేసాడు.
ప్రసాద్ : సతీష్(వెంకట్) నీకు చేసిన పాలిగ్రాఫిక్ test ఒక వంక మాత్రమే…(అంటూ మేజర్ నాగేష్కి షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫోటో సతీష్(వెంకట్)కి చూపిస్తూ ఫేస్ రీడింగ్ ద్వారా నీ తరువాత టార్గెట్ ఎవరో కనిపెట్టేసాం…ఆర్మీ మేజర్ నాగేష్నే కదా….ఒక్క ఆటోగ్రాఫ్ పెడతారా….
సతీష్(వెంకట్) ఆ ఫోటో చూడగానే అతని మొహంలో కోపం చిన్నగా పెరిగిపోతున్నది.
రాము : వదిలెయ్ ప్రసాద్….మనం మేజర్ చేత పెట్టించుకుందాం….