రాములు ఆటోగ్రాఫ్ – 47 84

రాము : రేణూ….(అంటూ ఆశ్చర్యపోయాడు.)
రేణుక : అవును రామూ….నువ్వు ఒక రెస్పాన్స్ బుల్ జాబ్‍లో ఉన్నావు….ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని మన ఇంట్లో వాళ్ళకు తెలిసిందంటే….ఇప్పటి దాకా నిన్ను దేవుడిలా చూసిన వాళ్ళందరి దృష్టిలో ఒక్కసారిగా దిగజారిపోతావు….వాళ్ళందరిని బాధ పెట్టి….ఈ అమ్మాయి జీవితాన్ని బాధ పెట్టి మనిద్దరం సంతోషంగా ఎలా ఉండగలమనుకున్నావు….ఇప్పుడు నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా….తరువాత నువ్వు నీ తప్పు తెలుసుకున్నా అప్పుడు బాధ పడి ప్రయోజనం లేదు…..అందుకని నా మాట విని ఈ ఆలోచన మానుకో….ఇది చాలా తప్పు రాము….
అంటూ రాముకి ఇంకా నచ్చచెప్పాలని చూస్తున్నది….కాని మానస ఆమెని మధ్యలోనే ఆపుతూ….
మానస : వద్దు రేణు గారు….మీరు రాముని అంతలా బ్రతిమలాడాల్సిన పని లేదు….రాము ఏంటో…అతని ప్రేమ ఏంటో నాకు బాగా తెలుసు….(అంటూ రాము వైపు తిరిగి) నువ్వు ఎలా చెబితే అలా చేయడానికి నేను ఒప్పుకుంటున్నా రామూ….నాకు నీతో కలిసి బ్రతకడం కావాలి….ఈ పని చేయడం వలన నేను మానసికంగా నీకు దగ్గరగా లేకపోవచ్చు….కాని శారీరకంగా నీకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను కదా…..అది చాలు నాకు….(అంటూ కళ్ళు తుడుచుకుని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు రాము వైపు చూసింది.)
మానస అలా అనేసరికి రాము ఏమీ చెప్పలేక అలాగే చూస్తున్నాడు.
కాని రేణుక మాటలు మాత్రం రాము మనసుని అతలాకుతులం చేస్తున్నాయి.

దాంతో ఎటూ తేల్చుకోలేక ఏం చేయాలో తెలియక అలాగే కదలకుండా ఉన్నాడు.

ఇక మానస వెంటనే వెనక్కు తిరిగి మేజర్ నాగేష్ (వెంకట్) దగ్గరకు వెళ్ళి అతనితో, “వెంకట్….రేణుక గారి మెమరిని నా బాడీలోకి కాపీ చేయండి….” అన్నది.
నాగేష్(వెంకట్) : నిజంగానా…..
మానస : అవును….(అంటూ రేణుక వైపు తిరిగి) రేణుక గారూ….మీరు వచ్చి స్కాన్ చేయించుకుంటే మీ మొమరీని కాపీ చేసి నాలో ప్రవేశపెడతాడు….రండి….
మానస అలా అనగానే రేణుక ఒక్కసారి రాము వైపు తిరిగింది.
కాని రాము అలాగే మానస వైపు చూస్తున్నాడు….అతని మొహంలో ఏవిధమైన భావాలు కనిపించడం లేదు.
దాంతో రేణుక చిన్నగా రాము దగ్గరకు వచ్చి, “రామూ….ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకో….ఆ అమ్మాయి నీ సుఖం కోసం, సంతోషం కొసం తన జీవితాన్ని పణంగా పెడుతున్నది….నాకు మాత్రం ఇష్టం లేదు….ఒకవేళ నీ బలవంతం మీద నేను ఈ పనికి ఒప్పుకున్నా….నీతో మాత్రం సంతోషంగా గడపలేను….” అంటూ రాము కళ్ళల్లొకి చూసింది.
కాని రాము ఏమీ మాట్లాడకపోయేసరికి ఇక చేసేది లేకపోవడంతో రేణుక మెల్లగా స్కాన్ మిషన్ దగ్గరకు వచ్చింది.
నాగేష్(వెంకట్) ఒక ఇంజక్షన్‍లో జెల్‍ని ఎక్కించి….రేణుకని స్కాన్ బెడ్ మీద పడుకోబెట్టి ఆమె తలకు ఆ జెల్ ఇంజక్షన్ చేసాడు.
దాంతో ఎలక్టానిక్ జెల్ రేణుక మెదడులో అన్ని న్యూరాన్స్ లోకి నానో మీటర్స్ రూపంలో ఫిక్స్ అయినట్టు అక్కడ మానిటర్‍లో చూపిస్తున్నది.
నాగేష్(వెంకట్) సిస్టమ్ ముందు కూర్చుని రేణుక బ్రెయిన్‍ మొత్తాన్ని కాపీ చేయడం మొదలుపెట్టాడు.
అది కాపీ అవుతున్నట్టు ప్రోగ్రెస్ బార్ పెరిగేకొద్ది రేణుక, మానస, రాము ముగ్గురిలో టెన్షన్ పెరిగిపోతున్నది.
రేణుక బ్రెయిన్ కాపీ అయిపోయినట్టు చూపిస్తుండటంతో నాగేష్(వెంకట్) మానస వైపు, “తరువాత నీదే వంతు,” అన్నట్టు చూసాడు.
నాగేష్(వెంకట్) చూపులో భావాన్ని అర్ధం చేసుకున్న మానస వెంటనే రేణుక దగ్గరకు వెళ్ళి, “మీ బ్రెయిన్ కాపీ అయిపోయింది రేణు గారు,” అన్నది.
దాంతో రేణుక స్కాన్ బెడ్ మీద నుండి దిగింది.
మానస ఆ బెడ్ మీదకు ఎక్కబోతూ ఒక్కసారి రాము వైపు చూసింది.
వెంటనే ఆ బెడ్ మీద నుండి దిగి రాము దగ్గరకు వెళ్ళి ఒక్కసారి గట్టిగా కౌగిలించుకుని, “ఇదే చివరి సారి రామూ…. నేను మానసికంగా నీ దగ్గర లేకపోయినా శారీరకంగా నీకు దగ్గరగా ఉంటానన్న తృప్తితో వెళ్తున్నాను….నేను ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలనే కొరుకుంటున్నాను,” అంటూ రాము పెదవుల మీద ఒక ముద్దు పెట్టి మళ్ళీ స్కాన్ బెడ్ దగ్గరకు వచ్చి పడుకుని నాగేష్(వెంకట్) వైపు కానివ్వమన్నట్టు చూసింది.
నాగేష్(వెంకట్) ఎలక్ట్రానిక్ జెల్‍ని మానస మెదడుకి ఇంజక్ట్ చేయగానే అక్కడ మానిటర్‍లో మెదడులోని న్యూరాన్స్ లోకి నానో మీటర్లు ఫిక్స్ అయినట్టు చూపిస్తున్నాయి.
నాగేష్(వెంకట్) సిస్టమ్ దగ్గరకు వెళ్ళి రేణుక బ్రెయిన్ మెమరీ కాపీని మానస మెదడు లోకి ట్రాన్స్‍ఫర్ చేయడం మొదలుపెట్టాడు.
అందులో ప్రోగ్రెస్ బార్ పెరిగేకొద్ది మానస కళ్లల్లో నీళ్ళు ఆగడం లేదు.
రాము కూడా మనసులో ఒక వైపు తప్పు, ఇంకో వైపు రేణుక మీద ప్రేమ రెండు యుధ్ధం చేసుకోవడం మొదలుపెట్టాయి.
రేణుక మళ్ళి ఒక్కసారి రాము దగ్గరకు వెళ్ళి, “రాము…ఇప్పటికైనా మించి పోయింది లేదు….ఈ ప్రాసెస్‍ని అపెయ్…” అంటూ బ్రతిమలాడుతున్నది.
కాని రాము ఏమీ మాట్లాడకపోయేసరికి రేణుక ఇక చేసేది లేక అక్కడ చైర్‍లో కూర్చుని బాధపడుతున్నది.
అలా ప్రోగ్రెస్ బార్ 95% కి రాగానే….ఇంకో ఐదు శాతం కాపీ పూర్తవగానే మొత్తం మెమెరీ మానస బ్రెయిన్‍లో కాపీ చేయడం పూర్తి అయిపోతుంది అనగా అక్కడ ఎవరూ ఊహించని విధంగా రాము తన నడుముకి ఉన్న పౌచ్‍లో నుండి రివాల్వర్ తీసి కాపీ చేసున్న సిస్టమ్‍ని, అక్కడ ఉన్న ప్రతి ఎక్విప్‍మెంట్‍ని పనికిరాకుండా షూట్ చేసాడు.
దాంతో సిస్టమ్ పనిచేయకపోయేసరికి కాపీ ప్రాసెస్ మధ్యలో ఆగిపోయింది.
అది చూసిన నాగేష్(వెంకట్) కొపంగా రాము వైపు చూస్తూ, “ఏం చేసావో తెలుస్తుందా నీకు….ఇంత పెద్ద ప్రయోగాన్ని మధ్యలో ఆపేసావు….పైనా ఎక్విప్‍మెంట్ మొత్తం నాశనం చేసావు….ఎంత ఖర్చు అవుతుందో తెలుసా…ఇంత మూర్ఖంగా చేసావు,” అంటూ మీదకు వస్తున్నాడు.
రాము వెంటనే నాగేష్(వెంకట్) కాళ్ళ మీద షూట్ చేసాడు.