రాములు ఆటోగ్రాఫ్ – 47 84

ఇదే అదనుగా రాము అక్కడ గ్లాస్ డోర్ పగలడంతో అక్కడ ఉన్న గ్లాస్ ముక్కను తీసుకుని కాళ్ళ మీద, చేతుల మీద గట్టిగా గాయపరిచాడు.
దాంతో మేజర్ నాగేష్ కాళ్ళు, చేతులు కదపలేక కింద పడిపోయాడు.
ఇక రాము అతనికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మేజర్ నాగేష్ రెండు కాళ్ళు, చేతులు కట్టేసి కదలకుండా చేసేసాడు.
కాని అప్పటికి ఇంకా కోపం చల్లారకపోవడంతో రాము పక్కనే ఉన్న గ్లాస్ ముక్కని తీసుకుని మేజర్ పొట్టలో మూడు పోట్లు పొడిచాడు.
అప్పటికి సిస్టమ్‍లో వెంకట్ బెయిన్ మెమరీ కాపీ ప్రోగ్రెస్ బార్‍లో 73% కాపీ అయినట్టు చూపిస్తున్నది.
రాము గన్ తీసుకుని మేజర్ నాగేష్ ని షూట్ చేయడానికి అతని వైపు గురి పెట్టాడు.
అది చూసిన మేజర్, “రాము….ప్లీజ్ నన్ను చంపొద్దు….నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను…” అంటూ రాముని బ్రతిమలాడుతూ చిన్నగా జరుగుతు అక్కడ ఉన్న టేబుల్‍కి ఆనుకోగానే డేటా కాపీ అయిపోయినట్టు సిగ్నల్ వినిపించింది.
అది విన్న మేజర్ నాగేష్ (వెంకట్) తన ఒంటి మీద గాయాలు పెడుతున్న బాధ అంతా మరిచిపోయి గట్టిగా నవ్వాడు.
మేజర్ నాగేష్ అలా సడన్‍గా నవ్వేసరికి రాముకి ఏదో అనుమానం వచ్చి, “ఎందుకలా నవ్వుతున్నావు,” అనడిగాడు.
“ఇప్పుడు నువ్వు నన్ను చంపితే నీకు ఏమొస్తుంది….నువ్వు ఏది చెబితే అది చేస్తాను….నిన్ను కూడా వెయ్యేళ్ళు… కాదు….నీ ఇష్టం వచ్చినంత కాలం బ్రతికేలా చేస్తాను…నా మాట విను,” అన్నాడు మేజర్ నాగేష్.
“మరణం దేవుడు ఇచ్చిన వరం….అది లేకపోతే మనిషి బ్రతుకు బోర్ కొడుతుంది….అయినా నాకు అలాంటి ఆశ ఉన్నదని ఎలా అనుకున్నావు,” అంటూ రాము గట్టిగా అరిచాడు.
కాని అంతలొనే ఏదీ ఆలోచన వచ్చిన వాడిలా అక్కడ ఉన్న చైర్‍లో కూర్చుని ఆలోచిస్తూ తన ఫోన్ తీసుకుని రేణుకకి ఫోన్ చేసాడు.
రాము : హలో….రేణు….
రేణుక : హా…చెప్పండి…..
రాము : ఎక్కడ ఉన్నావు….
రేణుక : ఇంట్లోనే ఉన్నాను….ఏంటి సంగతి…అలా కంగారు పడుతున్నావెందుకు….అంతా బాగానే ఉన్నది కదా…..
రాము : అంతా బాగానే ఉన్నది….నువ్వు ఇప్పుడు వెంటనే న్యూరో రీసెర్చ్ సెంటర్‍కి వచ్చేయ్….
రేణుక : ఎందుకు రామూ….నీకు అంతా బాగానే ఉన్నది కదా….(అంటూ కంగారు పడింది.)
రాము : రేణూ…రేణూ….ఎక్కువ కొశ్చన్లు వేయకుండా నేను చెప్పిన చోటకు వచ్చేయ్….
రేణుక : సరె….రామూ….ఇప్పుడే బయలుదేరుతున్నా….(అంటూ ఫోన్ పెట్టేసింది.)
రాము కూడా ఫోన్ కట్ చేసి మేజర్ నాగేష్ వైపు చూసి, “ఇప్పుడు ఒకామె వస్తుంది….ఆమె బ్రెయిన్ డేటా మొత్తం కాపీ చేసి ఇంకొకరి బాడీలొకి ట్రాన్స్ ఫర్ చేస్తావా,” అనడిగాడు.
మేజర్ నాగేష్ (వెంకట్) : తప్పకుండా….ఇంతకు ఆమె ఎవరు….
రాము : ఆ విషయాలు నీకు అనవసరం….చెప్పింది చేస్తే బ్రతికి ఉంటావు…లేకపోతే ఇప్పుడే చంపేస్తాను….
మేజర్ నాగేష్ : సరె….సరె….ఇంతకు ఎవరి బాడీలోకి పంపించాలో అదైనా చెబుతావా…..
రాము కొద్దిసేపు ఆలోచించి వెంటనే మానసకు ఫోన్ చేసి ఆమెను కూడా ల్యాబ్‍కి రమ్మని చెప్పాడు.
దాంతో మానస ఏమీ ఆలోచించకుండా రాము పిలిచాడని చెప్పి బయలుదేరింది.
కాని రాము మనసులో ఆలోచనను మాత్రం పసిగట్టలేకపోయింది.
రాము : (ఫోన్ కట్ చేసి) మానస బాడీలోకి కాపీ చెయ్…..
మేజర్ నాగేష్ (వెంకట్) : తప్పకుండా….అలాగే కాపీ చేస్తాను….(అంటూ అక్కడ ఉన్న సిస్టమ్‍ ని దాని కోసం రెడీ చేస్తున్నాడు.)
అరగంటకు మానస, రేణుక ఒకరి తరువాత ఒకరు ల్యాబ్‍లోకి అడుగుపెట్టారు.
వాళ్ళిద్దరూ దాదాపుగా ఒకేసారి రావడంతో రాముకి ఏం చెయ్యాలో తోచలేదు.
రాము ఒంటి మీద దెబ్బలు, ఒళ్ళంతా గాయాలతో ఉన్న మేజర్ నాగేష్(వెంకట్), ల్యాబ్ అంతా చిందవందరగా ఉండటంతో మానసకు మాత్రం ఏం జరిగిందో అర్ధమయింది.
కాని ఇవేమీ తెలియని రేణుక మాత్రం రాము ఒంటి మీద దెబ్బలు చూసేసరికి కంగారు పడుతూ రాము దగ్గరకు వెళ్ళీ కావలించుకుని, “ఏమయింది….ఈ దెబ్బలేంటి,” అంటూ ఏడుస్తున్నది.
రాము కూడా రేణుక చుట్టూ చేతులు వేసి, “రేణూ….నాకు ఏమీ కాలేదు…బాగానే ఉన్నాను…ముందు ఆ ఏడుపు ఆపు,” అన్నాడు.
ఒక ముసలావిడ రాముని కౌగిలించుకుని ఏడవడం చూసి రాము ఆమె మనవడు అనుకున్నది మానస.
కాని రాము కూడా ఆమెను పేరు పెట్టి పిలవడం….అంతే కాకుండా కొంచెం అధికారం ఉన్నట్టు మాట్లాడుతుండటంతో అమెకు అర్ధం కాక వాళ్ళిద్దరిని అలాగే చూస్తున్నది.
రాము ఆమె దగ్గర నుండి తన దగ్గరకు రాగానే మానస తనతో పాటు ల్యాబ్‍లోకి వచ్చిన రేణుకని చూసి రాముని పక్కకు తీసుకెళ్ళి, “రామూ….ఈ ముసలావిడ ఎవరు ఇక్కడకు ఎందుకు వచ్చింది,” అనడిగింది.
“నేనే ఆమెను రమ్మన్నాను….నీకు అంతా వివరంగా చెబుతాను….ఇక్కడే కూర్చో,” అన్నాడు రాము.
అలాగే అని అక్కడే కూర్చున్నది.
రాము వెంటనే రేణుకని ఇంకో రూమ్ లోకి తీసుకెళ్ళి జరిగింది అంతా చెప్పి, “రేణుకా…నిన్ను ఇప్పుడు ఈ ముసలి శరీరం లోనుండి….ఆవిడ శరీరంలోకి పంపేలా ఏర్పాటు చేస్తున్నా,” అన్నాడు.
రాము చెప్పింది మొత్తం వివరంగా విన్న రేణుక ఆశ్చర్యపోతూ, “వద్దు రాము…ఇది చాలా తప్పు….ఇంకొకరి ఒంట్లోకి వెళ్ళి….వాళ్ళు అనుభవించాల్సిన సుఖాలను మనం అనుభవించాలనుకోవడం చాలా తప్పు…” అన్నది.
రాము : కాని నాకు నీతో సంతోషంగా గడపాలని ఉన్నది….
రేణుక : నాక్కూడా నీతో సంతోషంగా ఉండాలని ఉన్నది…కాని అది ఇలా కాదు….
రాము : ప్లీజ్ రేణు….నేను చెప్పింది విను….
రేణుక : నీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు….నాకు నీతో గడపలేదు అన్న ఒక్క బాధ తప్ప నేను నా జీవితంలో అన్ని సంతోషాలను చూసాను…నీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఇన్నేళ్ళు గడిపాను….ఇప్పుడు నన్ను నువ్వు ఈ పని చేసి తప్పు చేయమంటున్నావు….అయినా ఒక వేళ నేను ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోవాలి కదా….
రాము : ఎవరైనా ఇలా చెబితే ఒప్పుకుంటారా….తెలియకుండా చెయ్యడమే…..
రేణుక : ఇది ఇంకా పెద్ద తప్పు రామూ….అయినా నువ్వు ఇలా తప్పుగా ఆలోచిస్తున్నావేంటి….మా అందరికీ మంచి చెప్పాల్సిన నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావా…ఇంకా జీవితంలో ఆవిడ ఏ సంతోషాలను అనుభవించలేదు….అలాంటి అమ్మాయికి నేను ద్రోహం చేయలేను…..నా వల్ల కాదు…..
రాము : నేను చెప్పినా వినవా…..
రాము అలా అనగానే రేణుక ఒక్కసారి రాము కళ్ళల్లోకి చూసి, “రామూ….నీకు ఎప్పుడైనా ఎదురు చెప్పానా….సరె… నువ్వు చెప్పినట్టు తప్పకుండా వింటాను….కాని ఒక్క షరతు,” అన్నది.
రాము : ఏంటది…..
రేణుక : నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను….కాని ఆవిడ పేరు ఏంటి…..
రాము : మానస….
రేణుక : హా….మానసకు మొత్తం నిజం చెప్పు….ఈ పనికి ఆవిడ ఒప్పుకుంటే నేను సంతోషంగా నువ్వు చెప్పినట్టు చేయడానికి రెడీగా ఉన్నాను…..
మానస ఎలాగూ ఒప్పుకోదన్న విషయం రేణుకకి తెలుసు.

మానసే కాదు ఏ ఆడది ఈ పనికి ఒప్పుకోదని రేణుకకి తెలుసు….అందుకే రాము మాట కాదనలేక ఈ విధంగా చెప్పింది.