రాములు ఆటోగ్రాఫ్ – 47 84

రాము అక్కడ నుండి వచ్చి మనోజ్ ని కలిసి జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు.
అంతా విన్న ఆయన రాము వైపు చూస్తూ, “నువ్వు చెబుతుంది వింటుంటే చాలా షాకింగా ఉన్నది రామూ….మనకు వేరే దారి లేదు….ఎలాగైనా వెంకట్ ల్యాబ్‍ని కనిపెట్టి తీరాలి….ఆ AICPని నాశనం చేయాలి….అప్పుడే మనం దీన్ని ఆపగలం,” అన్నాడు.
దాంతో రాము తన స్టేషన్‍కి వెళ్ళి ప్రసాద్‍తో సహా తన టీమ్ అందరినీ పిలిచి జరిగింది మొత్తం చెప్పి, “ఇప్పుడు మనం రెండు టీమ్స్‍గా పని చేయాలి…..ఒక టీం వాడి ల్యాబ్ ఎక్కడ ఉన్నదో కనిపెట్టాలి….అదే టైంలొ వెంకట్ ల్యాబ్‍లోకి వెళ్లకుండా కనిపెట్టాలి….మేజర్ నాగేష్(వెంకట్) ఎక్కడకు వెళ్తున్నాడు….ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు అని తెలుసుకోవడానికి ఫాలో అవ్వాలి…ఇంకో టీం మానస ఇచ్చిన పదిహేను మందిని వాచ్ చేస్తూ ఉండాలి….దీని కోసం రిటైర్డ్ పోలిస్ ఆఫీసర్స్ అందరి హెల్ప్ తీసుకుందాం….
వీళ్ళందరూ ఎలా చేయాలా అని ప్లాన్ చేస్తుండగా ఇక్కడ మేజర్ నాగేష్(వెంకట్) మాత్రం ప్రశాంతంగా తన కారులో తనకు తెలిసిన వాళ్ళను కలవడానికి ట్రై చేస్తున్నాడు.
కాని అక్కడ రాము పోలీసులను కాపలా పెట్టడంతో వెళ్ళడానికి వీల్లేక వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు.
అప్పటికే మేజర్ నాగేష్(వెంకట్)ని ఇద్దరు పోలీసులు మఫ్టీలో ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు రాముకి ఇన్ఫర్‍మేషన్ అందిస్తున్నారు.
మానస కూడా ఈ కేసులో రాముకి తన వంతు సహాయం చేస్తూ మధ్యమధ్యలో తన అందాలతో రాము టెన్షన్‍ను తగ్గిస్తున్నది.
రాము కూడా ఈ కేసుని చాలా ప్రెస్టేజియస్‍గా తీసుకుని దాని మీదే వర్క్ చేస్తుండే సరికి చూసేవాళ్ళకు రాము, మేజర్ నాగేష్(వెంకట్) మధ్యలో యుధ్ధం జరుగుతున్నదా అన్నట్టు సాగుతున్నది.
దాంతో రెండు రోజుల తరువాత రాముకి ఒక ఫోన్ కాల్ రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంకట్ భార్య ట్రీట్‍మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్‍కి వెళ్ళాడు.
రాముతో పాటు మానస కూడా హాస్పిటల్‍కి వెళ్ళింది.
వీళ్ళిద్దరూ రావడం చూసిన డ్యూటీ డాక్టర్, “కొద్దిసేపటి క్రితం సృహ వచ్చింది….అందుకే మీకు ఫోన్ చేసాను….కాన్ వెంటనే మళ్ళి సృహ కోల్పోయారు….” అన్నాడు.
దాంతో రాముకి ఆమెతో మాట్లాడటానికి ఏమీ లేక వెళ్ళబోతుండగా ఆమె తన చేత్తో రాము చేతిని పట్టుకుని ఆపింది.
రాము వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, “అమ్మా….మీ భర్త వెంకట్ గురించి ఏమైనా చెప్పగలరా,” అని అడిగాడు.
ఆమె చిన్నగా రాము వైపు తల తిప్పింది.
రాము వెంటనే డాక్టర్ వైపు మాట్లాడొచ్చా అన్నట్టు చూసాడు.
“అడగండి….ఏం పర్లేదు సార్,” అన్నాడు డాక్టర్.
రాము : మీ ఆయన వెంకట్ కి ఒక ప్రైవేట్ ల్యాబ్ ఉన్నది కదా…..అది ఎక్కడ ఉన్నది…తెలుసా మీకు…..
ఆ మాటకు ఆమె తెలుసు అన్నట్టు తల ఊపుతూ రాయడానికి పెన్ను కావాలి అన్నట్టు సైగ చేసింది.
పక్కనే ఉన్న ప్రసాద్ వెంటనే ప్యాడ్ తీసుకుని ఆమె రాయడానికి అనుకూలంగా పెడుతూ….ఆమె చేతికి రాయడానికి అన్నట్టు పెన్ను ఇచ్చాడు.
ఆమె పెన్ను పట్టుకుని ప్యాడ్ మీద సున్నా లాగా రాస్తూ అలాగే మళ్ళీ సృహ తప్పి పోయింది.
ఆమె ఏం రాసిందో అర్ధం కాక రాము అలాగే దాని వైపు చూస్తున్నాడు.
ప్రసాద్ : ఏం రాసారు సార్…..
రాము : అర్ధం కాలేదు ప్రసాద్….ఏవో సర్కిల్స్ డ్రా చేసారు….
ఆమె రాసిన సర్కిల్స్‍కి అర్ధం ఏమిటో తెలియక ముగ్గురూ బయటకు వచ్చి రౌండ్ షేప్‍లో ఏముంటాయో ఒక్కొక్కటి చెప్పుకుంటున్నారు.
అలా హాస్పిటల్ కారిడార్‍లో నడుస్తున్న వాళ్ళకు దెబ్బలతో రక్తంతో తడిచిపోయిన ఒకతన్ని స్ట్రక్చర్ మీద తీసుకువస్తూ ఉంటే అతను చనిపోవడం చూసి రాముకి ఒక్కసారిగా తల తిరిగినట్టు అయింది.
అది చూసిన మానస వెంటనే రాముని పట్టుకుని అక్కడ విజిటర్స్ గ్యాలరీలో ఉన్న చైర్‍లో కూర్చోబెట్టింది.
రాముని అలా చూసిన ప్రసాద్ కంగారు పడుతూ……
ప్రసాద్ : ఏమయింది….ఇప్పటి దాకా బాగానే ఉన్నారు కదా….
మానస : ఇదివరకు ట్రీట్‍మెంట్ చేసినప్పుడు ఏదో మర్చిపోలేని సంఘటన బావిలో జరిగిందంట…దాంతో అప్పుడప్పుడు ఇలా కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది…..
మానస అలా అనగానే రాముకి ఏదో ఆలోచన వచ్చినట్టు ఆమె వైపు చూస్తూ….
రాము : ఇప్పుడు నువ్వు ఏమన్నావు….
మానస : మీ జీవితంలో ఏదో ముఖ్య సంఘటన ఏదో బావిలో జరిగింది అని…..

అని ఇంకా ఏదో చెబుతుండగా రాము ఆమెను మధ్యలోనే ఆపుతూ…..

రాము : వెంకట్ భార్య పేపర్ మీద గుండ్రంగా ఏదో గీసింది కదా….అది ఒక బావి ఎందుకు అయి ఉండకూడదు….
రాము అలా అనగానే మానస కూడా అవునన్నట్టు తల ఊపింది.
ప్రసాద్ : డాక్టర్ వెంకట్ ఇంటి వెనకాల పెద్ద బావి ఉన్నది కదా….
రాము : అవును ప్రసాద్….మన ఊహ కరెక్ట్ అవడానికి చాన్స్ ఉన్నది….(అంటూ చైర్‍లో నుండి లేచి) ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు ప్రసాద్….పద….చెక్ చేద్దాం…..
ముగ్గురూ వెంకట్ ఇంటికి బయలుదేరారు.
మధ్యలో రాము తన టీంని కూడా వెంకట్ ఇంటికి రమ్మని చెప్పడంతో వీళ్ళు అక్కడకు చేరుకునే సరికి వీళ్ళ టీం వీళ్ళ కోసం ఎదురుచూస్తున్నారు.
అందరూ కలిసి వెంకట్ ఇంటి వెనకాల బావి దగ్గరకు వెళ్ళారు.
ఆ బావి మూసి వేయడంతో దాని మిద చెత్తా చెదారం, ఇనుప కడ్డీలు పడి ఉన్నాయి.
ఒక కానిస్టేబుల్ వాటిని మొత్తం తీసేయడంతో వాళ్లకు బావి పైన కాంక్రీట్‍తో స్లాబ్ లాగా పోసి దానికి ఒక మనిషి దూరడానికి మూత పెట్టి ఉన్నది.
ప్రసాద్ దాని మీదకు వెళ్ళి పైన ఉన్న మూతని తీసాడు….ఆ మూత తీయగానే వాళ్ళకు లోపల ఒక ఛాంబర్ డోర్ కనిపించింది.
దాన్ని చూడగానే రాము, ప్రసాద్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
కాని ఛాంబర్ డోర్‍ని ఓపెన్ చెయడానికి కుదరకపోవడంతో రాము, “దాని పక్కనే డ్రిల్ చేయండి,” అన్నాడు.
కానిస్టేబుల్ డ్రిల్లింగ్ మిషన్ తీసుకువచ్చి ఛాంబర్ డోర్ చుట్టూ డ్రిల్ చేయడం మొదలు పెట్టాడు.
కొద్దిసేపటికి వాళ్ళకు లోపలికి దిగడానికి సరిపోయేంత హోల్ పడగానే ఒక్కొక్కళ్ళు తాడు పట్టుకుని లోపలికి దిగారు.
లోపలికి దిగిన వాళ్లకు ఆ ల్యాబ్‍ని చూసేసరికి కళ్ళు తిరిగినట్టు అనిపించింది.