రాములు ఆటోగ్రాఫ్ – 52 81

రాము కూడా ఫోన్ కట్ చేసి….తన బైక్ ని పార్కింగ్ లో పెట్టి మళ్ళీ లిఫ్ట్ లో పైకి వెళ్ళి జరీనా వాళ్ళింట్లోకి వెళ్లాడు.
జరీనా : లోపలికి రా రాము….
రాము : ఏంటి మేడమ్…ఇప్పుడే కదా వెళ్లమన్నారు….అంతలోనే ఫోన్ చేసి పిలిచారేంటి…..
జరీనా : అవును రాము….మహేష్ తో పాటు డాన్స్ కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చేయడానికి డ్రస్ మెజర్ మెంట్లు ఫారం పూర్తి చేసాను. వాటిని కాస్ట్యూమ్స్ డిజైనర్ కి ఫోన్ చేసి చెబుదామని మహేష్ కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు….అందుకని నిన్ను పిలిచాను….(అంటూ తన చేతిలో ఉన్న మెజర్ మెంట్ ఫారం రాముకి ఇచ్చి దాని మీద ఉన్న ఫోన్ నెంబర్ చూపించి) ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మన డ్రస్ నెంబర్ చెప్పి ఈ మెజర్ మెంట్లు చెప్పాలి రాము….
రాము ఆమె చేతిలో ఉన్న ఫారం తీసుకుని చూస్తూ, “అన్నీ పూర్తి చేసినట్టున్నారు కదా…” అంటూ తన ఫోన్ తీసుకున్నాడు.
జరీనా : అన్నీ పూర్తి అయిపోయాయి…..

అంతకు ముందు రవి బర్త్ డేకి కూడా షాపింగ్ కి రవి ఫోన్ ఎత్తకపోవడంతో ఆమె ఆరోజు తనకు ఫోన్ చేయడం రాముకి గుర్తుకొచ్చింది.
ఆ రోజు రవి ఫోన్ ఎత్తకపోవడంతో రాము కళ్ళ ముంది షాప్ లో ట్రైల్ రూమ్ సంఘటన కళ్ళ ముందు కదిలింది.
ఇప్పుడు మహేష్ గాడు ఫోన్ ఎత్తలేదు….ఇప్పుడు ఇంకేం జరుగుతుందో అనుకుంటూ రాము దాని మీద ఉన్న నెంబర్ కి డయల్ చేసాడు.
రాము : హలో….మోహిత్….నిన్న మేము డ్రస్ నెంబర్ *4544 గురించి మాట్లాడుకున్నాం కదా….
మోహిత్ (డ్రస్ డిజైనర్) : హా….అవును….ఎవరు మహేషా మాట్లాడేది….
రాము : లేదు….నేను అతని ఫ్రండ్ రాముని మాట్లాడుతున్నాను….నిన్న మీరు ఫోన్ లోకూడా మెజర్ మెంట్ నోట్ చేసుకుంటారని చెప్పారంట కదా….
మోహిత్ : అవును రాము…..సాధారణంగా మేము ఫోన్ లో చెప్తే నోట్ చేసుకోము….ఎందుకంటే ఒక్కోసారి మెజర్ మెంట్లు తేడా వస్తాయి….రెండు మూడు కేసులు ఇలాగే ఫేస్ చేసాము….కాకపోతే మీ ఫ్రండ్ రిక్వెస్ట్ చేయడంతో తప్పనిసరిగా తీసుకుంటున్నాము…ఒక్క నిముషం ఇక్కడ నేను కూడా ఆ డ్రస్ కేటలాగ్ తీసుకుంటున్నాను….
రాము : అలాగే….తప్పకుండా….
మోహిత్ : *4544….హా….అవును….పేమెంట్ కూడా జరిగిపోయింది….మహేష్ నిన్ననే అతని డ్రస్ కి మెజర్ మెంట్ ఇచ్చేసాడు. ఇక ఫిమేల్ డ్రస్ మెజర్ మెంట్లు రావాలి…..
రాము : అవునా….ఇప్పుడు ఫిమేల్ మెజర్ మెంట్లు చెబుతాను రాసుకోండి….
మోహిత్ : నేను ఒక్కొక్కటి అడుగుతాను….దాని ప్రకారం ఆ ఫారంలో ఉన్నది చెప్పండి….పీస్ 1 లెగ్గిన్స్ సైజ్ చెప్పండి…
రాము ఆ ఫారంలో మోహిత్ అడిగిన చోట జరీనా రాసిన సైజ్ చెప్పాడు.
మోహిత్ : ఒకె…..ఇప్పుడు పీస్ 2 చెప్పండి….టాప్….
దాంతో మోహిత్ అడిగిన వాటన్నింటికీ అతను అడిగిన వాటి ప్రకారం జరీనా కొలతలు చెప్పేసాడు.
జరీనా కూడా పక్కనే కూర్చుని వింటూ…..అంతా కరెక్ట్ గా చెబుతున్నందుకు రాము వైపు సంతోషంగా చూస్తున్నది.

మోహిత్ : అంతా బాగానే ఉన్నది….ఇప్పుడు మెజర్ మెంట్ 5, 6 చెప్పండి…..
రాము : కాని ఇక్కడ మీరు చెప్పినవి లేవే…..
మోహిత్ : అలా ఎలా జరుగుతుంది….ఉంటుంది సరీగ్గా చూడండి….
రాము : నేను కేటలాగ్ చేతిలో పట్టుకుని చూస్తూ మీతో మాట్లాడుతున్నాను….
మోహిత్ : ఓహ్….అయితే పేజీ తిప్పండి….వెనక వైపు చూడండి…..
రాము కేటలాగ్ వెనక్కు తిప్పి చూస్తే అక్కడ రెండు కాలమ్స్ ఉన్నాయి….
రాము : ఓహ్….ఇక్కడ రెండు ఐటమ్స్ ఉన్నాయి…..
మోహిత్ : అవును…ఈ రెండు వెనక పేజీలో ఉన్నాయి…..ఇప్పుడు అవి చెప్పండి….
రాము : కాని ఇక్కడ ఏమీ పూర్తి చేయలేదు…..
మోహిత్ : అదెలా….మర్చిపోయారు….
రాము : మొదటి పేజీలో చాలా ఖాళీ ఉన్నది….అలాంటప్పుడు వెనకపేజీలో కూడా ఇంకో రెండు కాలమ్స్ ఉంటాయని ఎవరు అనుకోరు కదా….
పక్కనే ఉన్న జరీనా కూడా అవి చూసి ఆశ్చర్యపోయింది….ఫారం అంతా ఫిలప్ చేసి….ఆ రెండు కాలమ్స్ ఇంకా ఉంటాయని అసలు ఊహించలేదు….
మోహిత్ : సారి రాము గారు….కాని ఆ మెజర్ మెంట్లు కూడా కావాలి….ఫిమేల్ డాన్సర్ మీ పక్కనే ఉంటే ఆమెను అడిగి చెప్పండి.
రాము : ఆమె నాతోనే ఉన్నది….
జరీనా : అవును….ఒక్కసారి అవెంటో చూద్దాం…..
అంటూ రాము చేతిలో ఫాం తీసుకుని చూడగానే ఆమె మొహం తెల్లగా పాలిపోయింది….ఆమెకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.
వెంటనే రాము చేతిలో నుండి ఫోన్ తీసుకుని మాట్లాడుతూ….
జరీనా : ఈ రెండు మెజర్ మెంట్లు రేపు ఇవ్వొచ్చా……
మోహిత్ : లేదు మేడమ్….రేపు రెండు రోజులు సెలవులు వచ్చాయి కదా….మీకు కాంపిటేషన్ టైం కి డ్రస్ కావాలంటే ఇప్పుడే ఇవ్వాలి….మీరు ఇప్పటికే చాలా లేట్ చేసారు…..
రాము : ప్లీజ్ మోహిత్….మాకోసం చిన్న హెల్ప్ చెయ్యి…..(అంటూ జరీనా దగ్గర నుండి ఫోన్ తీసుకుని చెప్పాడు)
మోహిత్ : లేదు రాము గారు….ఇక్కడ మేము వర్క్ ప్రెజర్ తో పని చేయము….అలా చేస్తే దాని ప్రభావం డ్రస్ మీద పడి సరిగా కుట్టలేము…దాంతో మా బ్రాండ్ నేమ్ పడిపోతుంది…అందుకని ఇప్పుడే ఆ రెండు కాలమ్స్ కూడా చెప్పేస్తే డ్రస్ కరెక్ట్ టైంకి వస్తుంది.
రాము : మాకు కరెక్ట్ డ్రస్ లేకపోతే కాంపిటేషన్ ఎలా…..చేస్తాము…..
మోహిత్ : ఇందుకో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్ధం కావడం లేదు….ఆమె మీ పక్కనే ఉందంటున్నారు కదా…కనుక్కుని చెప్పండి….ఇందులో ఇబ్బంది ఏంటి….
జరీనా : ఈ మెజర్ మెంట్లు….వేటి గురించో మీకు తెలుసు కదా……
మోహిత్ : నాకు తెలుసు మేడమ్…మీరు నన్ను నమ్మొచ్చు….ఇవన్నీ మాకు మామూలే…మేము టాలీవుడ్ వాళ్లకు కూడా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తాము….
జరీనా : కాని……