దాంతో ఆ షాండియానా రాము పక్కనే పడటంతో…..అది ముక్కలు అయిపోయి దానికున్న గాజు ముక్కలు రెండు రాము మోచేతి కింద గుచ్చుకుని చేతి నుండి రక్తం కారుతున్నది
రాము అలాగే ఆ చేతిని పట్టుకుని తన బెడ్ రూమ్ లోకి వచ్చి లైట్ వేసి first aid చేసుకుని కట్టు కట్టుకున్నాడు.
జరుగుతున్నవన్నీ చూస్తుంటే రాముకి ఈ ఒబెరాయ్ విల్లా వెనక ఏదో రహస్యం ఉన్నదని అర్ధమయింది….అది ఓనర్ కి కూడా తెలియదని అర్ధం అయింది.
అలా ఆలోచిస్తూ రాము అలాగే బెడ్ మీద పడుకుని నిద్ర పోయాడు.
పొద్దున్నే లేచిన రాము టిఫిన్ చేసి వచ్చి తాను పిక్స్ చేసిన కెమేరాల్లో ఉన్న మెమరీ కార్డ్ తన laptop కి కనెక్ట్ చేసి చూస్తున్నాడు.
కాని వాటిలో ఏమీ రికార్డ్ కాకపోవడం చూసి రాము మనసులో, “అంతా కరెక్ట్ గానే పిక్స్ చేసాకదా….ఎందుకు రికార్డ్ కాలేదు,” అని మళ్ళి రివైండ్ చేసి చూస్తున్నాడు.
రాము డైనింగ్ టేబులు మీద కూర్చుని చూస్తుండగా ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి కిచెన్ లో ఏదో పట్టుకుని పారిపోవడం గమనించి, “ఏయ్….ఎవరు నువ్వు….ఏం తీసుకెళ్తున్నావు,” అంటూ అతని వెనకాలే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లాడు.
కొద్దిదూరం ఒబెరాయ్ విల్లా నుండి బయటకు పరిగెత్తిన తరువాత రాము అతన్ని పట్టుకుని ఒక చెట్టుకు ఆనించి వెనక్కు తిప్పాడు.
తాను పట్టుకున్న అతన్ని చూసి రాము ఆశ్చర్యపోయి అతన్ని అలాగే చూస్తూ రెండడుగులు వెనక్కి వేసాడు.
అతను దాబా దగ్గర డబ్బులు ఇవ్వబోతే వద్ధని ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడి వెళ్ళిపోయిన బాబా.
రాము : నువ్వా…..
బాబా : చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు కోసం వెదుకుతున్నాను…..
అంటూ తన చేతిలో కిచెన్ లో నుండి తీసుకుని పరిగెత్తిన అగ్గిపెట్టెను చూపించాడు.
రాము : అగ్గిపెట్టె అడిగితే ఇచ్చేవాడిని కదా…..దొంగతనంగా తీసుకుని పారిపోవడం దేనికి…..
బాబా : దొంగతనం ఒక వంక మాత్రమే….నిన్ను ఆ ఒబెరాయ్ విల్లా లోనుండి బయటకు తీసుకురావడానికి పరిగెత్తాను….
అంటూ తన చేతిలో ఉన్న చుట్టను నోట్లో పెట్టుకుని గట్టిగా పీల్చాడు.
అతను ఏమంటున్నాడో అర్ధం కాని రాము అతని వైపు అయోమయంగా చూస్తూ….
రాము : ఏంటి నువ్వు మాట్లాడేది….
బాబా : అతను వింటాడు…..అతను మనం మాట్లాడుకునేది వింటాడు….
అంటూ మళ్ళీ చుట్టను నోట్లో పెట్టుకుని పీలుస్తున్నాడు.
రాము : ఎవరు….మన మాటలు వినేది…..
బాబా : రాత్రిళ్ళు నీకు అరుపులు విపించలేదా…(అంటూ గట్టిగా అడుగుతూ….రాముకి చేతిని పట్టుకుని పైకి లేపి దెబ్బ తగిలిన చోటు చూపిస్తూ) నీ చేతిని ఏమయింది….
రాము : దెబ్బ తగిలింది.
బాబా ఒక్కసారి తన చేతిలో ఉన్న చుట్టను మళ్ళీ నోట్లో పెట్టుకుని గట్టిగా పీల్చి నోట్లోంచి పొగను రాము చేతికి దెబ్బ తగిలిన చోట ఊది రాము వైపు చూసి నవ్వుతూ, “నువ్వ్ అబధ్ధం చెబుతున్నావు,” అంటూ అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు.
రాము చిన్నగా తన చేతికి కట్టిన కట్టు తీసి చూసుకునే సరికి చిత్రంగా రాత్రి షాండియానా గాజు పెంకులు గుచ్చుకున్న దెబ్బ లేకుండా చర్మం ఇదివరికటిలా ఉన్నది.
అది చూసి రాముకి అతనెవరో….ఏం చెబుతున్నాడో అర్ధం కాక వెళ్తున్న అతని వైపు చూస్తూ, “ఎవరు నువ్వు….అసలు ఏం జరుగుతుంది…..అసలు ఎవరు నువ్వు….నావెంట ఎందుకు పడుతున్నావు,” అని గట్టిగా అరిచాడు.
దానికి ఆ బాబా వెనక్కు తిరిగి, “ఆ ఒబెరాయ్ విల్లాలో దెయ్యం ఉన్నది….” అంటూ వెనక్కి తిరిగి రాము దగ్గరకు వచ్చి, “నువ్వు నమ్మక పోవడం వలన వాస్తవం మారిపోదు….వాస్తవాన్ని తెలుసుకుని నువ్వే మారిపోవాలి….ఎన్నో ఏళ్ళ నుండి ఆ దెయ్యం ఆ ఒబెరాయ్ విల్లాలో బందీ అయింది…ఆ అరుపులు విని పారిపోకు…వాటిని విను….అర్ధం చేసుకో…ఆ అరుపులు నీతో ఏవో చెప్పాలనుకుంటున్నాయి,” అంటూ అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
రాము మళ్ళి ఒబెరాయ్ విల్లాలోకి వచ్చి బాబా చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్ధం కాక అలా బయటకు వెళ్ళి భోజనం చేసి వచ్చి మళ్ళీ ఒబెరాయ్ విల్లాకు వచ్చేసరికి రాత్రి అవుతుంది.
రాము మళ్ళీ తన బెడ్ రూమ్ లో ఉన్న టేబుల్ మీద కూర్చుని ఏం జరుగుతుందా అని చూస్తుంటాడు.
అలా ఆలోచిసున్న రాముకి బుక్ షెల్ఫ్ లోనుండి ఒక బుక్ కింద పడిన శబ్దం వినిపిస్తుంది.
దాంతో రాము వెనక్కి తిరిగి కుర్చీలో నుండి లేచి కింద పడిన బుక్ తీసుకుని మళ్ళీ షెల్ఫ్ లో పెట్టి వెనక్కి తిరిగి నాలుగడుగులు వేసిన వాడల్లా మళ్ళీ తల తిప్పి ఇందాక బుక్ పడిన చోట చూస్తాడు.
అక్కడ ఒక లెటర్ లాంటిది బుక్ లోనుండి పడిందని చూసి రాము అక్కడకు వచ్చి కింద పడిన లెటర్ ని తీసుకుని చదువుతుంటాడు.
లెటర్ : డియర్ మమ్మీ…పప్పా(నాన్న)….మీరు ఇక్కడ నుండి ఊరెళ్ళి వారం రోజులు అవుతుంది.
ఈ వారం రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోయాయి.
ఇక్కడ జరిగిన విషయాలు మీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు….నేను బతికి ఉండటానికి ఏ విధమైన కారణం కనిపించడం లేదు….అందుకని ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను….
అది చదివిన రాముకి ఏం జరిగిందా అన్న అత్రుతతో బెడ్ దగ్గరకు వెళ్ళి టేబుల్ లైట్ వేసి చదవడం మొదలుపెట్టాడు.
Bro flash back tharuvatha kuda continue chey story Bavundi
E story Amazon prime lo undi…English movie telugu dubbed movie
Nice erotic story