రాములు ఆటోగ్రాఫ్ – Part 2 266

రాము : దెయ్యం సంగతి నాకు తెలియదు గాని….రంగ కళ్ళల్లో మాత్రం భయం స్పష్టంగా కనిపిస్తున్నది.
నాన్న : ఈ దెయ్యం సంగతి బయటకు రాకముందే మనం ఆ ఒబెరాయ్ విల్లాని సాధ్యమైనంత వరకు రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఈ విషయం బయటకు వచ్చిందంటే….మన కాంపిటేటర్స్ కి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము….అందుకని నువ్వు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి….
రాము : తప్పకుండా నాన్నా….సాధ్యమైనంత తొందరగా పని పూర్తి చేస్తాను….
నాన్న : కాని రాము…నువ్వు జాగ్రత్తగా ఉండు…మనకు ఆ ఒబెరాయ్ విల్లా మీద వచ్చిన డీల్ చేజారిపోయినా పరవాలేదు. కాని నీకు ఏదైనా అయితే మాత్రం మేము తట్టుకోలేము….
రాము : అలాగే నాన్నా….జాగ్రత్తగా ఉంటాను….సరె….ఉంటాను…..
నాన్న : సరె….ఉంటా….
అని వాళ్ల నాన్న ఫోన్ పెట్టేసాడు…..రాము కూడా ఫోన్ కట్ చేసి బ్యాగ్ లో నుండి టవల్ తీసుకుని బాత్ రూమ్ కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యాడు.
హాల్లో కూర్చుని అక్కడ హాల్లో ఉన్న ఫోటోలు, వస్తువులు చూస్తున్నాడు.
కాని రాముకి అక్కడ ఏ ఒక్కటీ అనుమానంగా కనిపించలేదు….కాకపోతే రంగ వాళ్లందరూ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడంలేదు.
అలా ఆలోచిస్తున్న రాముకి అక్కడ ఉన్న ఒక బుక్ తీసుకుని చూస్తు….అక్కడ దెయ్యం ఉన్నదా….లేదా అన్న ఆలోచనలో ఉన్నాడు.
కాని ఇంతవరకు రాముకి ఎటువంటి అనుభవం ఎదురుకాలేదు….నిజంగా దెయ్యం ఉన్నదా….లేక ఎవరైనా పుకారు పుట్టించారా అని అర్ధం కాక తన చేతిలో ఉన్న బుక్ ని మళ్ళీ అక్కడే పెట్టి సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు.
టైం చూస్తే సాయంత్రం ఆరు అయింది…..రాము వాచీ చూసుకుంటూ బోరుగా ఉండటంతో అలా బయటకు వెళ్దామని లేచి రెడీ అవుతున్నాడు.
అలా రెడీ అవుతున్న రాముకి కాలింగ్ బెల్ కొట్టిన సౌండ్ వినిపించింది….దాంతో రాము విసుక్కుంటూ, “ఇప్పుడు ఎవరు వచ్చారు. సరదాగా బయటకు వెళ్దామనుకుంటే….మనకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరున్నారు….ఒక్క రంగ తప్పితే….వస్తే వాడు వచ్చి ఉండాలి….లేకపోతే ఒబెరాయ్ విల్లా గురించి మాట్లాడటానికి ఎవరైనా వచ్చి ఉండాలి….” అనుకుంటూ వెళ్ళి తలుపు తీసాడు.
కానీ ఎదురుగా అనసూయ కనిపించేసరికి రాము మనసు ఆనందంతో నిండిపోయింది.
అనసూయ అంత తొందరగా వస్తుందని రాము అసలు ఊహించలేదు….ఆమె చేతిలో ఏవో రెండు కవర్లు ఉన్నాయి.
అనసూయ : ఏంటి బాబు….అలా చూస్తున్నావు….లోపలికి రానివ్వవా….(అంటూ చిన్నగా నవ్వుతున్నది)
రాము : రా…రా….తొందరగా లోపలికి వచ్చేయ్…(అంటూ రాము పక్కకు జరిగి అనసూయ లోపలికి రావడానికి దారి ఇచ్చాడు)
అనసూయ : అంత తొందరగా ఉన్నదా….(అంటూ నవ్వుతూ లోపలికి అడుగు పెట్టింది)
రాము : చాలా బోర్ గా ఉన్నది….అలా బయటకు వెళ్ళి వద్దామని రెడీ అయ్యాను….నువ్వు ఇంత తొందరగా వస్తావని అసలు ఊహించలేదు.
అనసూయ లోపలికి వచ్చి తలుపు గడి వేసి తన చేతుల్లో ఉన్న కవర్లలో ఒకటి డైనింగ్ టేబుల్ మీద, ఇంకోటి కిచెన్ లో ఉన్న ఫ్రిజ్ లో పెట్టి మళ్ళీ హాల్లోకి వచ్చింది.
అలా నేరుగా హాల్లోకి వచ్చి రాము కూర్చున్న సోఫా దగ్గరకు వచ్చి నిల్చున్నది.
ఆమె కళ్ళు రాము పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్టు అనిపిస్తున్నది.
రాము అనసూయను పైనుండి కింద దాకా చూసాడు….చక్కగా స్నానం చేసి ఉన్న వాటిల్లో మంచి చీర కట్టుకొచ్చినట్టున్నది.
చాలా ఫ్రెష్ గా ఉన్నది….హెడ్ బాత్ చేయడంతో ఆమె ముంగురులు మొహం మీద పడుతూ ఇంకా అందంగా ఉన్నది.
ఆమె జుట్టు కూడా జడ వేసుకోకుండా దువ్వి వదిలేసి చివరిలో రబ్బర్ బ్యాండ్ వేసి వదిలేసింది.
రాము ఆమె చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు.
అనసూయ : ఏంటి బాబు అలా లాగుతున్నారు….అదీ మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు….ఏంటి….
రాము : మరి ఇంత అందంగా ఉంటే పట్టుకోవాలనిపిస్తుంది.

3 Comments

  1. Bro flash back tharuvatha kuda continue chey story Bavundi

  2. E story Amazon prime lo undi…English movie telugu dubbed movie

  3. Nice erotic story

Comments are closed.