రాములు ఆటోగ్రాఫ్ – Part 29 76

భోజనం పూర్తి అయిన తరువాత నలుగురూ బట్టలు మార్చుకుని వెళ్దామని రెడీ అవుతుండగా సింగన్న అక్కడకు వచ్చాడు.
సింగన్న : ఒక్క నిముషం ఆగండి….ఇక్కడ ఒక చిన్న పూజ ఉన్నది…ఇది జరిగితే జాతర పూర్తి అవుతుంది….
జరీనా : ఏం పూజ సింగన్నా….
సింగన్న : మా గూడెం దేవతకి పూజ చేయాలి….ఆ పూజ చేస్తే మా దేవత మమ్మల్ని చల్లగా చూస్తుంది…..ఎక్కువ టైం కూడా పట్టదు…..
జరీనా : ఇప్పటికే చాలా లేటయింది సింగన్నా….వెళ్ళాలి.
సింగన్న : చాలా చిన్న పూజ మేడమ్….
జరీనా : సరె….తొందరగా కానివ్వు….మేము ఉంటాం….
సింగన్న : సరె….కాని స్టూడెంట్లు రాకూడదు…..
జరీనా : ఎందుకు…..
సింగన్న : అది మా ఆచారం….కేవలం పెద్దవాళ్ళే ఈ పూజలో ఉండాలి….
జరీనా : అలాగా….ఇప్పుడు ఏం చేద్దాం…..
సింగన్న : వీళ్లను ఇక్కడే ఉండమని….మీరు పూజలో కూర్చోండి….ప్లీజ్ మేడమ్….అక్కడ మా గూడెం ఆడవాళ్ళు కూడా ఉంటారు…..మీరు భయపడాల్సిన అవసరం లేదు….పూజ అయిపోయిన తరువాతనే మీరు రిసార్ట్ కి వెళ్లాలి…..

ఆ మాట అనగానే అక్కడ జరీనా చుట్టూ ఉన్న ఆడవాళ్ళు కూడా ఆమెని ఉండమని బ్రతిమలాడారు.
దాంతో జరీనాకి ఒప్పుకోక తప్పలేదు.
మహేష్ : మనం ఎందుకు పూజలో ఉండకూడదు…..
రాము : ఏమోరా నాకు తెలియదు….
రవి : నాకు జరీనా మేడమ్ ని ఒంటరిగా పంపించడం అంత సేఫ్ అనిపించడం లేదు.
మహేష్ : అయితే మనం ఇక్కడే ఉందాం….ఏదైనా అవసరం అయితే పిలవమని ఆమెతో చెబుదాం….పూజ అయిపోయిన తరువాత అందరం కలిసి వెళ్దాం….
రవి : అవును….దాంతో ఆమెను ఇంప్రెస్ చేసినట్టు ఉంటుంది….ఆమెకు దగ్గరవడాని చాన్స్ వచ్చినట్టు ఉంటుంది.
మహేష్ : మేడమ్….మేము ఇక్కడే ఉంటాము….మీరు పూజ పూర్తి చేసుకుని వచ్చేయండి….
జరీనా : సరె…..
సింగన్న : అవును…..మహేష్ చెప్పింది బాగున్నది……ఇక పదండి….పూజకి టైం అవుతుంది….
అంటూ తన గూడెం వాళ్ళకు పూజ ప్రారంభించమని చెప్పాడు.
ఐదు నిముషాల తరువాత సింగన్న మళ్ళీ అక్కడకు వచ్చి జరీనాతో….