రాములు ఆటోగ్రాఫ్ – Part 29 76

అనిత కిచెన్ లో పని చేసుకుంటున్నది….భాస్కర్ అనిత దగ్గరకు వెళ్ళాడు.

కిచెన్ లోకి వచ్చిన భాస్కర్ వైపు చూసింది అనిత….తన వైపు చూసిన భార్యను చూసి చిన్నగా నవ్వాడు.
అనిత కూడా చిన్నగా నవ్వింది.
అది చూసి భాస్కర్, “సారి అనిత,” అన్నాడు.
భాస్కర్ మాట విని అనిత అతని వైపు చూసింది, కాని ఏమి మాట్లాడలేదు.
అనిత ఏమీ మాట్లాడకపోయేసరికి భాస్కర్ లో కొంచెం అసహనం పెరిగింది, దాంతో అతనే మళ్ళీ, “నిన్న నేను కొద్దిసేపు మెదలకుండా ఉండాల్సింది….చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా…..రాము బాగా కోప్పడ్డాడా?” అని అడిగాడు.
అనిత భాస్కర్ వైపు చూసి, “చాలా కోపంగా ఉన్నాడు,” అన్నది.
ఆ మాట విన్న భాస్కర్ కి గుండె దడ పెరిగింది.
“రాము ఒక పక్క బిజినెస్ చేస్తూ, ఇంకో వైపు చదువుకుంటున్నాడు…టూర్‍కి వెళ్ళబోయే ముందు కూడా తన ఆటోమొబైల్ ఆఫీస్‍లో పని ఉన్నదని పొద్దున్నే వెళ్ళిపోయాడు…..షాపు నుండి కాలేజికి వెళ్తానన్నాడు, రాత్రి కూడా ఇంటికి వచ్చేసరికి 9 అయింది…..అతను అంత అలిసిపోయి ఇంటికి వస్తే నువ్వు కాసేపు కూడా రెస్ట్ తీసుకోనివ్వడం లేదు….పైగా మేమిద్దరం కలిసి బయటకు వెళ్తే ఆపకుండా వరసగా ఫోన్లు చేస్తున్నావు,” అన్నది అనిత.

అనిత, రాము బయటకు వెళ్ళినప్పుడు మొన్న ఒక్కసారి మాత్రమే తను ఫోన్ చేసానన్న విషయం భాస్కర్ కి తెలుసు, ఇంతకు ముందు వాళ్ళీద్దరు సినిమాకు వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యలేదు, కాని ఆ విషయం అడిగి అనితకి కోపం తెప్పించడం కన్నా మెదలకుండా ఉండటం మంచిది అని అర్ధం చేసుకుని, “నేను చాలా స్టుపిడ్ గా ఆలోచిస్తున్నాను అనిత….ఇక నుండి నేను అలా తప్పు చేయను….” అని ఒక సెకను ఆగి అనిత వైపు చూసి, “కాని రాము అప్పుడప్పుడు నీ భుజాల మీద, నడుం మీద చేతులు వేస్తున్నాడు….నాకు అది నచ్చడం లేదు,” అంటూ ఇంకా చెబుతున్న భాస్కర్ కి అనిత మొహం కోపంతో ఎర్రగా మారేసరికి ఇక మాట్లాడలేకపోయాడు.
భాస్కర్ మాటలు విన్న అనిత కోపంగా భాస్కర్ వైపు చూసి, “అయితే….రాము నా భుజం మీద, నడుం మీద చేతులేస్తే ఏమయింది, ఒకే ఇంట్లో ఉంటున్నాము….అప్పుడప్పుడు రాము నా మీద చెయ్యి వేస్తే తప్పేమున్నది?” అంటూ అనిత కిచెన్ లో పని పూర్తి చేసి, మళ్ళీ తన మొగుడి వైపు చూస్తూ, “రాము ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది…..ఒక వేళ నీ మాటలు వింటే ఏమయి ఉండేది?” అని అన్నది అనిత.

అనిత చెప్పిన మాటలను బట్టి రాము తన మీద చెయ్యి వెయ్యడం వలన తన భార్యకి ఏమీ ఇబ్బంది లేదని ఆమె మాటలను బట్టి అర్ధం అవడంతో భాస్కర్ కి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
దాంతో భాస్కర్ కి ఇక ఏమీ మాట్లాడాలనిపించలేదు, అందుకని అనితతో, “అవును….నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను…ఇక ఈ టాపిక్ వదిలెయ్,” అన్నాడు.
అనిత ఏమీ మాట్లాడలేదు…కాని కొద్దిసేపటి తరువాత, “అన్నం తింటావా?” అని అడిగింది.
భాస్కర్ కూడా అక్కడ వాతావరణం మార్చడానికి నిర్ణయించుకుని సరె అని తల ఊపాడు.
అనిత తన కూతురు సోనియాను భోజనానికి పిలిచి డైనింగ్ టేబుల్ మీద భాస్కర్ కి, సోనియాకి భోజనం పెట్టింది.
అది చూసి భాస్కర్, “నువ్వు తినవా?” అని అనిత వైపు చూస్తూ అడిగాడు.
“నేను తరువాత తింటాను,” అన్నది అనిత.
దాంతో భాస్కర్ మెదలకుండా అన్నం తిన్నాడు….వాళ్ళిద్దరు తిన్న తరువాత అనిత డైనింగ్ టేబుల్ సర్దేసింది.
భాస్కర్ తన బెడ్ రూంలోకి వెళ్ళి మందులు వేసుకుని పడుకుని నిద్ర పోయాడు.
డైనింగ్ టేబుల్ సర్దుతున్న అనితకు తన ఫోన్ మోగినట్టు వినిపించడంతో దాదాపుగా పరిగెత్తుకుంటున్నట్టుగా తన బెడ్‍రూమ్ లోకి వెళ్ళి ఫోన్ తీసుకున్నది.
ఫోన్‍లో రాము పేరు కనిపించేసరికి అనిత పెదవుల మీద ఆమెకు తెలియకుండానే ఒక చిరునవ్వు వచ్చింది.