రాములు ఆటోగ్రాఫ్ – Part 4 96

మహేష్ : ఏం లేదురా…నాకు ఏం తోచక మొన్న సినిమాకు వెళ్ళినప్పుడు మీ బాబాయ్ కనిపించారు….నీ గురించి అడిగే సరికి ఈ ఊరికి వచ్చావని చెప్పారు….అందుకని నేను అంకుల్ కి ఫోన్ చేసి….ఎక్కడకు వెళ్లావో కనుక్కుని ఇక్కడకు వచ్చేసాను….
రాము : సరె…..(అంటూ సుమిత్రని చూపించి) ఈవిడ పేరు సుమిత్ర….(సుమిత్ర వైపు చూసి) సుమిత్ర గారూ…వీడు మహేష్… ఇందాక వీడి గురించే చెప్పింది…..
దాంతో మహేష్, సుమిత్ర ఒకరికి ఒకరు హాయ్ చెప్పుకున్నారు.
రాము అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటూ…..
రాము : అవునురా….ఇంత హడావిడిగా రావాల్సిన పనేంటి…..వచ్చేముందు ఒక్క ఫోన్ చెయ్యొచ్చు కదా…..
మహేష్ : ఏమోరా నాకు పనేమీ లేదు…నువ్వు ప్రాపర్టీ రిజిష్ట్రేషన్ పని మీద వచ్చావని తెలియగానే నాక్కూడా రావలనిపించింది.
రాము : సరె….నువ్వు ఇక్కడ ఎంజాయ్ చెయ్యి….నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉన్నది….(అంటూ సుకిత్ర వైపు తిరిగి) మేడమ్… మీతో చాలా విషయాలు మాట్లాడాలి…..ఆఫీస్ రూమ్ లోకి వెళ్దామా…..
రాము మాట విని సుమిత్ర మాట్లాడబోతుండగా….మధ్యలో మహేష్ కలగచేసుకుంటూ….
మహేష్ : అరేయ్….ఇందాక ఫోన్ లో నేను వచ్చానని చెబితే అంత కంగారు పడ్డావెందుకు…విశయం ఏంటి….
రాము : అదేం లేదురా….సడన్ గా వచ్చావని ఫోన్ చేసేసరికి…..
మహేష్ : సరె….ఇక ఇక్కడున్నన్నాళ్ళూ నీతోనే ఉంటాను….ముందు విషయం ఏంటో చెప్పు…..
రాము : చెబితే నువ్వు భయపడతావురా….
మహేష్ : నిజంగానా…..అవునురా….నువ్వు అలా అంటుంటే నిజంగానే నాకు భయమేస్తున్నది….
అంటూ వాళ్ళిద్దరి వైపు చూసి గట్టిగా నవ్వాడు.
వాడు అలా అనేసరికి రాముకి కోపం నషాళానికి అంటింది….వెంటనే రాము మహేష్ వైపు కొపంగా చూస్తూ….
రాము : ఏంటి చెబితే అర్ధం కావడం లేదా…..ఎప్పుడు అర్ధం చేసుకుంటావురా…..
రాము అలా గట్టిగా అనే సరికి మహేష్, సుమిత్ర ఇద్దరూ కొంచెం భయపడ్డారు.
మహేష్ : సారీరా…..ఇక జోక్ చేయను…..ఇంతకు విషయం ఏంటో చెప్పు….నువ్వెందుకు ఇంత చిరాగ్గా ఉన్నావు….
ఇక మహేష్ ఎంత చెప్పినా వినడని అర్ధం అయిన రాము సుమిత్ర వైపు చూసి…..
రాము : సుమిత్ర గారు….మీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి….ప్లీజ్….మనం ఆఫీస్ రూమ్ లోకి వెళ్దామా…(అంటూ మహేష్ వైపు చూస్తూ….) నువ్వు కూడా రా….విషయం చెప్పేది కాదు….మేము మాట్లాడుకుంటుంటే నీకు అర్ధం అవుతుంది.
రాము మహేష్ ని రమ్మనగానే….సుమిత్ర కూడా భయంతో….
సుమిత్ర : మహేష్ ఎందుకు రాము….మనిద్దరం మాట్లాడుకుందాము….
రాము : లేదు సుమిత్ర…..వాడు ఇక వినడు….మనం మాట్లాడుకున్న తరువాత వాడే ఇక్కడ నుండి భయపడి వెళ్ళిపోతాడు.
దాంతో సుమిత్ర కూడా మెదలకుండా ఉండిపోయింది.
కాని మహేష్ మనసులో మాత్రం ఇక్కడ ఏదో జరుగుతుందన్న అనుమానం కలిగింది….
మహేష్ : ఏం మాట్లాడుతున్నావురా….మీరు మాట్లాడుకునేది వింటే నేను ఎందుకు భయపడతాను….అసలు ఏం జరుగుతుంది…
ఇక రాము చెప్పక తప్పదన్నట్టు మహేష్ కి మొత్తం ఒబరాయ్ విల్లాలో జరిగింది మొత్తం చెప్పిన తరువాత సుమిత్ర వైపు తిరిగి రాత్రి ఆమె విల్లా నుండి వెళ్ళిపోయిన తరువాత జరిగిన విషయాలు, బాబా చెప్పిన సంగతి మొత్తం వివరంగా చెప్పాడు.
రాము చెప్పింది పూర్తిగా విన్న తరువాత మహేష్ కి ఒక్కసారిగా వెన్నులో వణుకు వచ్చి…..రాము వైపు చూస్తూ….
మహేష్ : ఏంటిరా నువ్వు చెప్పేది…..అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్ధం అవుతున్నదా…..అయినా ఈ రోజుల్లో దెయ్యాలేంటిరా….
రాము : మహీ…..నేను నీతో కలిసి చదువుకున్నా కదా….నా సంగతి నీకు బాగా తెలుసు….అయినా నీకు ఇలా చెబితే అర్ధం కాదు….నిన్ను ఒక రోజు ఆ విల్లాలో వదిలేస్తే అర్ధమవుతుంది…నువ్వు నమ్మితే నమ్ము….లేకపోతే లేదు…నేను చెప్పేది నిజం…. నా కళ్లారా చూసింది చెబుతున్నాను….ఎక్కువ ప్రశ్నలు వేసి విసిగించకు….(అంటూ సుమిత్ర వైపు తిరిగి) అయినా వీడితో మాటలు అనవసరం…..మనం మన పని చేసుకుందాం….
రాము అలా అనగానే వాళ్ళిద్దరూ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళారు….వాళ్ళిద్దరి వెనకాలే మహేష్ కూడా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు.
రాము తన బ్యాగ్ లోనుండి laptop తీసి ఆన్ చేసి ఇంతకు విల్లాలో జరిగింది మొత్తం ఫోటోలు సుమిత్రకు చూపిస్తున్నాడు.

మహేష్ కూడా రావడం చూసి రాము జరిగింది సుమిత్రకు చెబుతున్న వాడల్లా మహేష్ వైపు ఒక సారి చూసి జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు.
రాము చెప్పేది సుమిత్ర, మహేష్ చాలా ఆశ్చర్యంగా వింటుంటే……మహేష్ మాత్రం రాము చెప్పేది వింటూ laptop లో ఫోటోలు చాలా శ్రధ్ధగా చూస్తున్నాడు.
మొత్తం వివరంగా విన్న సుమిత్ర ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా….మహేష్ లాప్ టాప్ లో ఫోటోలు చూస్తూ….
మహేష్ : రామూ….ఒక్క నిముషం….
రాము : ఇప్పుడు నీ డౌట్ ఏంటిరా….
మహేష్ : ఇవన్నీ నువ్వు విల్లాలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలా….
రాము : అదే కదరా ఇందాకటి నుండీ చెప్పేది…..
మహేష్ : ఒక్కసారి ఈ ఫోటోలను చూడు…(అంటూ మహేష్ ఒక పోటోని జూమ్ చేసి చూపిస్తూ) ఇది ఒక్కసారి చూడు….
మహేష్ చూపించిన ఫోటో చూసి రాము, సుమిత్ర ఇద్దరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
అందులో రాము విల్లాలో సెల్ఫీ దిగినప్పుడు వెనకాల ఒక దెయ్యం నిల్చున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది.
రాము : అయితే రేణుక నిన్న రాత్రి నాకు వెలుగులో కనిపించి చెప్పిన అత్మ ఇదే అయ్యుంటుంది….అయినా ఈ ఆత్మ ఆడదానిది లాగా ఉన్నది….ఈ ఆత్మ సుందర్ ప్రేతాత్మకు హెల్ప్ చేస్తూ రేణుకని నిర్భంధించిందన్నమాట…..

2 Comments

  1. శాపం మూవీ చూసారా? But it’s ok…good one

  2. Aatma+ sapam rendu mix chesaru

Comments are closed.