రాములు ఆటోగ్రాఫ్ – Part 4 95

ఇక సుమిత్ర కూడా బయటకు వచ్చి తన అసిస్టెంట్ ని పిలిచి మహేష్ ని ఆఫీస్ రూమ్ లోకి తీసుకురమ్మన్నది.
ఆఫీస్ రూమ్ లో సుమిత్ర తన లాప్ టాప్ ఓపెన్ చేసి ఆ రాత్రికి చేయవలసిన పని గురించి ఒకసారి మొత్తం చెక్ చేసుకుని, అక్కడకు తీసుకెళ్లాల్సిన వస్తువులను తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని తృప్తిగా తలాడించింది.
అలా మొత్తం చెక్ చేసుకుంటుండగా డోర్ తీసుకుని రాము, మహేష్ లొపలికి రావడం చూసి వాళ్ళిద్దరి వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ కూర్చోమని సైగ చేసింది.
వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న కుర్చిల్లో కూర్చుంటూ సుమిత్ర వైపు చూసి…
రాము : సుమి…..ఇప్పుడు….
అలా అనగానే సుమిత్ర ఒక్కసారిగా తల ఎత్తి రాము వైపు చూసింది….మహేష్ కూడా ఆశ్చర్యంగా రాము వైపు చూసాడు.
వాళ్ళిద్దరూ తన వైపు ఎందుకలా చూస్తున్నారో రాము అర్ధం కాక వాళ్ళిద్దరి వైపు ఏంటన్నట్టు చూసాడు.
సుమిత్ర మాత్రం ఏం చెప్పాలా అన్నట్టు తడబడుతున్నది.
వెంటనే మహేష్ రాము వైపు చూస్తూ….
మహేష్ : ఏంటిరా సుమిత్ర గారితో బాగా పరిచయం ఉన్నట్టు….చిన్నప్పటి నుండి కలిసి తిరిగినట్టు అలా సుమీ అని పిలిచావు….
మహేష్ అలా అనగానే రాముకి తను చేసిన తప్పేంటో అర్ధం అయింది.
రాము తల తిప్పి సుమిత్ర వైపు చూసాడు….సుమిత్ర కళ్ళతోనె పక్కనే మహేష్ ఉన్నాడన్నట్టు సైగ చేసింది.
రాము : అదేం లేదురా….ఏదో నిన్ను పిలిచినట్టు సుమిత్ర గారిని కూడా చనువుతో పిలిచాను….(అంటూ సుమిత్ర వైపు చూస్తూ) సారి సుమిత్ర గారు….అనుకోకుండా అలా వచ్చేసింది….
సుమిత్ర : పర్లేదు రాము….
రాము : సరె….ఇప్పుడు విషయానికి వద్దాము….మనం ఎక్కడకు వెళ్తున్నాం….
సుమిత్ర : ఇప్పుడు మనకు విల్లాలో ఉన్న సుందర్ ప్రేతాత్మతో పాటు అతనికి సహాయం చేస్తున్న ఆడ ఆత్మ ఒకటి ఉందన్నావు… అది అసలు అక్కడ ఎందుకున్నది…సుందర్ కి ఎందుకు హెల్ప్ చేస్తున్నది….దానికి ఏం కావాలి….ఎలా నాశనం చేయాలి….అనేది ఆలోచించాలి….
మహేష్ : సుమిత్ర గారు….మీరు చెప్పేది వింటుంటే….లాప్ టాప్ లో ఫోటోలు చూసిన నాకే ఇంత టెన్షన్ గా ఉంటే….ఒక రొజు విల్లాలోకి వెళ్ళిన మీకు ఎలా ఉండాలి….రెండు రోజుల నుండి విల్లాలో రాము ఎలా ఉన్నాడో తలుచుకుంటేనే భయమేస్తున్నది….
రాము : అందుకనేరా…నువ్వు ఇంటికి వెళ్ళిపో….అనవసరంగా నీ ప్రాణాలు రిస్క్ లో పెట్టలేను….
మహేష్ : అదేం లేదురా….నెను నీతో రావడానికి నిర్ణయించుకున్నాను….
సుమిత్ర : వద్దు మహేష్ గారు….ఇప్పుడు మేము చేసే పనిలో చాలా ప్రమాదం ఉన్నది….అర్ధం చేసుకోండి….
మహేష్ : లేదు సుమిత్ర గారు….ఒకరికి ఒకరం ఉంటే ధైర్యంగా ఉంటుంది….నా మాట వినండి….నన్ను రానివ్వండి….నాకు చేతనైనంత హెల్ప్ చేస్తాను….
దాంతో సుమిత్ర ఇక ఏం చెప్పలేక రాము వైపు చూసింది….
రాము : ముందు మన ప్లాన్ ఏంటో చెప్పు సుమిత్ర….తరువాత వాడు వస్తాడా….లేదా….అన్నది డిసైడ్ చేద్దాం…..
సుమిత్ర సరె అన్నట్టు తల ఊపుతూ తన ముందు ఉన్న లాప్ టాప్ ని వాళ్ల వైపు తిప్పింది.
అందులో ఒక పాడుబడ్డ బిల్డింగ్ కనిపిస్తున్నది….సుమిత్ర తన చైర్ లోనుండి లేచి వాళ్ళ దగ్గరకు వచ్చి వెనకాల నిల్చుని….
సుమిత్ర : ఇప్పుడు మనం ఒక మనిషి గురించి అడగాలంటే ఏం చేస్తాము….
మహేష్ : ఎంక్వైరీ చేస్తాము….అక్కడ దగ్గరలొ ఉన్న మనుషుల్ని అడిగి తెలుసుకుంటాము….
సుమిత్ర : కరెక్ట్ గా చెప్పారు మహేష్….అదే ఇక్కడ ఇప్పుడు మనం చనిపోయి దెయ్యం అయిన దాని గురించి తెలుసుకోవాలంటే… ముందు మనం దాని మరణం గురించి తెలుసుకోవాలి….ఎలా చనిపోయింది….ఎందుకు చనిపోయింది….
రాము : అంటె….ఎలా….
సుమిత్ర : చెప్తాను….మనం ఆ దెయ్యం గురించి తెలుసుకోవాలన్నా…దాన్ని నాశనం చేయాలన్నా….అది తన శరీరాన్ని ఎప్పుడు, ఎక్కడ వదిలిపెట్టింది అనేది తెలుసుకోవాలి….(అంటూ తన లాప్ టాప్ లో కనిపిస్తున్న బిల్డింగ్ వైపు చూపిస్తూ) మీ ఎదురుగా కనిపిస్తున్న ఆ బిల్డింగ్ ఒకప్పుడు షాపింగ్ కాంప్లెక్స్….15-20 ఏళ్ళ మధ్యలో ఒక అగ్ని ప్రమాదం జరిగి ఆ సమయంలో షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది బయటకు వెళ్లడానికి అన్ని దారులు మూసుకుపొవడంతో లోపలే దాదాపు వెయ్యి మంది దాకా చనిపోయారు….
మహేష్ : అయితే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అప్పటి నుండి అలాగే మూసేసి ఉంచారా…..
సుమిత్ర : అవును….ఇప్పుడు మనం అక్కడకు వెళ్ళి అక్కడ చనిపోయిన వాళ్ల ఆత్మల సహాయంతో ఈ సుందర్ కి హెల్ప్ చేస్తున్న దుష్ట ఆత్మ గురించి తెలుసుకుందాం….
సుమిత్ర చెప్పింది విన్న తరువాత రాము, మహేష్ ఇద్దరూ ఒకరి మొహంలో ఒకరు చూసుకున్నారు.
వాళ్ళిద్దరి మొహాల్లో టెన్షన్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నది…..అది గమనించిన సుమిత్ర వాళ్ళిద్దరి వైపు చూసి….
సుమిత్ర : అందుకే మహేష్ గారూ….మిమ్మల్ని వద్దంటున్నది….(అంటూ రాము వైపు తిరిగి) నువ్వు కూడా ఈ ప్రయత్నాన్ని మానుకొ రాము…..ఇందులో చాలా రిస్క్ ఉన్నది…..మనం ఈ పని మొదలుపెట్టిన తరువాత….పూర్తి అయ్యే సరికి ఎవరు ప్రాణాలతో ఉంటారో…ఉండరో తెలీదు….అందుకని నా మాట విను….
అంటూ సుమిత్ర ఇంకా ఏదో చెప్పబోతుండగా….రాము మధ్యలో ఆపుతూ….

2 Comments

  1. శాపం మూవీ చూసారా? But it’s ok…good one

  2. Aatma+ sapam rendu mix chesaru

Comments are closed.