రాములు ఆటోగ్రాఫ్ – Part 7 118

దాంతో రాము ఇక చేసేది లేక అక్కడ నుండి రాజ మహల్ బయట ఉన్న నది వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.
రాము పరిగెత్తుకుంటూ వెళ్ళిన అడుగులు చప్పుడు విని మహేష్ అక్కడే తలుపు తెరడానికి ట్రై చేస్తున్నాడు.
పరిగెత్తుకుంటూ వెళ్ళిన రాము మహల్ లో ఉన్న కారిడార్ లోకి రాగానే గట్టిగా నవ్వు వినిపించేసరికి ఆగి చుట్టూ చూసాడు.
రాముకి కొద్దిదూరంలో తాను వెళ్ళవలసిన డోర్ చూస్తుండగానే మూసుకుపోవడంతో తన చేతిలో ఉన్న కుండను చూసి అక్కడ పక్కనే ఉన్న పొడవాటి పాత గుడ్డని తిసుకుని కింద పరిచి దానిలొ ఆ అస్థికలు ఉన్న కుండను కట్టి దాన్ని తన భుజం మీదగా గట్టిగా తన ఒంటికి కట్టుకుని కారిడార్ లో చిన్నగా నడుస్తూ డోర్ దగ్గరకు వెళ్ళి దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు.
కాని డోర్ తెరుచుకోకపోవడంతో అలాగే నిల్చున్నాడు….అంతలో డోర్ లోనుండి ఒక చెయ్యి వచ్చి రాము గొంతు పట్టుకుని పైకి లేపుతున్నది.

రాము ఆ చేతిని గట్టిగా పట్టుకుని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ కాలు పెట్టుకోవడానికి ఆసరా కోసం చూస్తున్న అతనికి కాలికి తలుపు గడి తగలడంతో దాన్ని గట్టిగా కొడుతున్నాడు.
నాలుగు దెబ్బలు వేసేసరికి పాత బడిన ఆ గడి ఊడిపోయి తలుపు తెరుచుకున్నది.
వెంటనే మోహిని చేతి పట్టులో నుండి విడిపించుకుని కింద పడి ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అలా రాము గట్టిగా ఊపిరి పీల్చుకోవడాని ట్రై చేస్తూ చిన్నగా పాక్కుంటూ ముందుకు వెళ్తుంటే పక్కనే ఉన్న డోర్ తెరుచుకోవడం చూసి రాము మెల్లగా ఓపిక తెచ్చుకుని పైకి లేచి ఆ డోర్ దగ్గరకు వచ్చి నడుస్తుంటే….అతనికి పక్కనే నవ్వుతూ గుసగుసలాడుతున్నట్టు వినిపిస్తు ఉండగా…..కారిడార్ లోకి రాగానే వెనక తలుపు మూసుకుపోయింది.
రాము చిన్నగా కారిడార్ లో నడుచుకుని వస్తుండగా అక్కడ రెండు వైపులా కిటికీలకు ఉన్న గ్లాస్ డోర్స్ చిన్నగా నెర్రిలు ఇవ్వండ గమనించి అవి ఏ క్షణంలో అయినా పగిలిపోవచ్చని రాముకి అర్ధమయింది.

రాము చిన్నగా నడుచుకుంటూ వస్తుంటే….ఏ కిటికీ దగ్గరకు వస్తే ఆ కిటికీకి ఉన్న గ్లాస్ పేలిపోయి రాము వైపు రావడం మొదలుపెట్టాయి.
దాంతో రాము వాటికి అతి కష్టం మిద తప్పించుకుంటూ అక్కడ నుండి బయట పడతాడు….కాని అప్పటికే రాము రెండు చేతులకు కాళ్లకు గాజు పెంకులు గుచ్చుకొవడమ్తో అతని ఒళ్ళంతా రక్తంతో తడిచిపోయింది.
ఇక రాము అక్కడే ఒక మూల కూర్చుని తన ఒంటికి గుచ్చుకున్న గాజు పెంకులను ఒక్కొక్కటి తీసుకుని చిన్నగా అడుగులొ అడుగు వేసుకుంటూ నొప్పితో కుంటుకుంటూ మహల్ నుండి బయటకు వచ్చాడు.
బయటకు వచ్చిన రాముకి మోహిని జాడ కనిపించకపోయే సరికి చుట్టూ చూస్తూ చిన్నగా అడుగులు వేస్తూ కోట మొదలులో పడవలు రావడానికి వీలుగా ఓడ రేవు లాంటికి అప్పటి కాలంలో కట్టించినది ఉంటే అక్కడ ఏదో వర్క్ జరుగుతుండటంతో అటు వైపు నీళ్ళు రాకుండా ఇసుక మూటలు పెట్టారు.
రాము చిన్నగా నడుచుకుంటూ అక్కడ కిందకు దిగడానికి మెట్ల దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా ఉన్న రంబు పెద్దగా శబ్ధం చేస్తూ మెట్ల మిద నుండి పడిపోవడం చూసి మోహిని ఇక్కడే ఉన్నదని అర్ధం అయ్యి అలెర్ట్ అయ్యాడు.
రాము చిన్నగా మెట్ల దగ్గరకు వచ్చి తన ఒంటికి కట్టుకున్న గుడ్డని విప్పదీసి అందులో ఉన్న కుండను చేతిలోకి తీసుకుని నీళ్లల్లో కలపడానికి నీళ్ల దగ్గరకు వచ్చాడు. కాని అక్కడ నీళ్ళ పైనుండి మోహిని గాల్లో తేలుకుంటూ గట్టిగా అరుస్తూ రాము మీదకు వచ్చింది.
రాము వెంటనే తేరుకుని పక్కకు దూకేలోపుగానే మోహిని స్పీడుగా వచ్చి రాముని బలంగా గుద్దేసరికి రాము అక్కడ మెట్ల మిద నుండి కింద పడిపోయాడు.
అతని చేతిలొ ఉన్న కుండ పగిలిపోయి అందులో ఉన్న అస్థికలు, బూడిద అక్కడ చెల్లాచెదరుగా పడిపోయాయి.
బలంగా దెబ్బలు తగలడంతో రాము అలాగే నొప్పిని తట్టుకుంటూ పైకి లేచి చుట్టూ చూసాడు.
అక్కడ లోపలికి నీళ్ళు రాకుండా కట్టిన ఇసుక బస్తాలు….అవి నిలబడటానికి సపోర్ట్ గా కట్టిన కర్రలను చూసేసరికి రాము వెంటనే తన ఒంట్లో ఉన్న బలాన్నంతటినీ కూడగట్టుకుని చిన్నగా లేచి పడుతూ లేస్తూ అక్కడ కర్రలకు కట్టి ఉన్న తాడు పట్టుకుని వెనక్కు తిరిగి తన వైపు వస్తున్న మోహిని ప్రేతాత్మని చూస్తూ గట్టిగా లాగాడు.
రాము ఆ కర్రల్ని లాగడం చూసి మోహిని ప్రేతాత్మ జరగబోయేది ఊహించి రాముని ఆపడానికి స్పీడుగా వచ్చింది.
కాని అప్పటికే రాము కర్రల్ని లాగడంతో నదిలో నీరు మహల్ లోకి రాకుండా పేర్చిన ఇసుక మూటలు పడిపోయే సరికి నీళ్ళు ఒక్కసారిగా ఆ ఓడరేవులోకి రావడం మొదలుపెట్టాయి.

రాము కూడా ఆ నీళ్ళ ధాటికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఈత రాకపోయేసరికి చేతులు కాళ్ళు తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడు.
నీళ్ళు అక్కడ రేవులోకి రాగానే అక్కడ చెల్లాచెదురుగా పడిఉన్న మోహిని అస్థికలు, బూడిద నీళ్ళల్లో కలిసిపోగానే…..నీళ్ళల్లో కాళ్ళు చేతులు ఆడిస్తూ పైకి తేలడానికి ట్రై చేస్తున్న రాముకి అతని కళ్ళ ముందు మోహిని ప్రేతాత్మ గాల్లో కలిసిపోవడం కనిపించింది.
ఎప్పుడైతే మోహిని ప్రేతాత్మ నీళ్ళల్లో కలిసిపోయిందో మహేష్ ని, సుమిత్రలను అప్పటిదాకా ఆపి ఉంచిన శక్తి కూడా నాశనం అయిపోయింది.
దాంతో వాళ్ళిద్దరూ రాము ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ గట్తిగా అతన్ని పిలుస్తూ రాజమహల్ నుండి బయటకు వచ్చారు.
మోహిని ప్రేతాత్మ నాశనం అయిందన్న ఆనందంలో రాము పక్కనే ఉన్న ఒక నిచ్చెన లాంటిది పట్టుకుని చిన్నగా పైకి వచ్చేసరికి అప్పటికే అతనిలో శక్తి సన్నగిల్లిపోయి కళ్ళు మూసుకుపోతుండగా దూరంగా మహేష్, సుమిత్రలు ఇద్దరూ పరిగెత్తుకుంటూ తనను పిలుస్తూ రావడం గమనించి రాము తన చేతిని పైకి లేపి వాళ్ళను పిలవడానికి ట్రై చేస్తున్నాడు.

కాని నోట్లో మాట రాకపోయే సరికి రాము వాళ్లను చూసి చేతులను పైకి చాపి ఊపుతూ అలాగే సృహ తప్పి నీళ్ళల్లో మునిగిపోయాడు.
రాము కూడా ఆ నీళ్ళ ధాటికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఈత రాకపోయేసరికి చేతులు కాళ్ళు తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడు.
నీళ్ళు అక్కడ రేవులోకి రాగానే అక్కడ చెల్లాచెదురుగా పడిఉన్న మోహిని అస్థికలు, బూడిద నీళ్ళల్లో కలిసిపోగానే…..నీళ్ళల్లో కాళ్ళు చేతులు ఆడిస్తూ పైకి తేలడానికి ట్రై చేస్తున్న రాముకి అతని కళ్ళ ముందు మోహిని ప్రేతాత్మ గాల్లో కలిసిపోవడం కనిపించింది.