రాములు ఆటోగ్రాఫ్ – Part 9 85

అలా చుట్టూ చూస్తున్న రాముకి గోడమీద ఒక చెక్క మీద “ఓం” ఆకారం దాని కింద కత్తిలాగా తగిలించి ఉండటం చూసాడు.
ఇక రాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ “ఓం” ఉన్న కత్తిని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి సునీత (సుందర్ ప్రేతాత్మ) వీపులో దించాడు.
దాంతో సునీత (సుందర్ ప్రేతాత్మ) ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ రేణుకని వదిలేసి తన వీపులో గుచ్చుకున్న కత్తిని బయటకు లాగడానికి ట్రై చేస్తున్నది.
కాని దైవ శక్తి బొమ్మ ఉన్న కత్తి కావడంతో సునీత (సుందర్ ప్రేతాత్మ) దాన్ని పట్టుకోలేకపోతున్నది.
అలా అని తన శరీరంలో దాన్ని భరించలేకపోతుండటంతో పెద్దగా అరుస్తూ గిలగిలలాడిపోతున్నది సునీత (సుందర్ ప్రేతాత్మ) అలా గిలగిలలాడిపోవడం కొయ్యబారిపోయి అలాగే కదలకుండా చూస్తున్న రేణుక చెయ్యి పట్టుకుని రాము బయటకు లాక్కెళ్ళి గది బయట నుండి గడి వేసి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ హోటల్ బయటకు వచ్చి వెంటనే కారులో కూర్చుని స్టార్ట్ చేసి పోనిచ్చాడు.
గదిలో ఉన్న సునీత (సుందర్ ప్రేతాత్మ) అలాగే తన వీపులో ఉన్న కత్తిని భరిస్తూ రాము రేణుకని తీసుకెళ్లాడన్న కోపంతో తలుపు దగ్గరకు వచ్చి గట్తిగా అరుస్తూ తీయడాని ట్రై చేస్తూ గట్టిగా తలుపుని లాగుతున్నది.
కొద్దిసేపటికి సునీత (సుందర్ ప్రేతాత్మ) తలుపు పగలకొట్టుకుని బయటకు వచ్చింది.
కాని అప్పటికే రాము, రేణుక కారులో చాలా దూరం వెళ్ళిపోయారు…..బయటకు వచ్చిన సునీత (సుందర్ ప్రేతాత్మ) కు వీళ్ళిద్దరూ…..ముఖ్యంగా రేణుక కనిపించకపోయేసరికి కోపంతో గట్టిగా అరిచింది.
**********
రాత్రంతా ఆపకుండా ప్రయాణం చేసిన తరువాత రాము కారుని ఎవరికీ కనిపించకుండా అక్కడ అడవిలో ఒక పొద లోపల ఆపాడు.
అప్పటికే ఇద్దరూ బాగా అలిసిపోయి ఉండటంతో ఒకరిని ఒకరు కౌగిలించుకుని ఒళ్ళు తెలియకుండా నిద్ర పోయారు.
అలా నిద్ర పోయిన కొద్దిసేపటికి రాము పక్కన రేణుక కనిపించకపోవడంతో వెనక సీట్లో ఉన్నదేమో అని చూసాడు.
కాని రేణుక వెనక సీట్లో కూడా లేకపోవడంతో రాము చుట్టూ చూస్తూ, “ఈ అడవిలో ఎక్కడకు వెళ్ళింది,” అనుకుంటూ కారు దిగి నాలుగడుగులు ముందుకు వేసి, “రేణూ…..రేణు,” అంటూ పిలుస్తూ ఆమె కోసం వెదుకుతున్నాడు.
కాని రేణుక కనిపించకపోయేసరికి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ఆ దారి వెంబడి పరిగెత్తుకుంటూ ముందుకువెళ్ళాడు.
అలా కొద్దిదూరం పరిగెత్తిన తరువాత దూరంగా రేణుక వెళ్తూ కనిపించడంతో అలాగే, “రేణూ…రే…ణూ…ఆగు…ఎక్కడికి వెళ్తున్నావు ఆగు….” అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి, “రేణూ….ఎక్కడికి వెళ్తున్నావు,” అనడిగాడు.
రేణుక ఏమీ మాట్లాడకుండా అలాగే నడుస్తుండటంతో…రాము అసహనంగా ఆమె వైపు చూస్తూ, “నేను నీతోనే మాట్లాడుతున్నాను. రేణూ ఎక్కడకు వెళ్తున్నావు,” అన్నాడు.
అంతలా అడిగినా రేణుక ఏమీ మాట్లాడకుండా నడుస్తుండటంతో రాముకి కోపం వచ్చె ఆమెను రెండు భుజాల మీద చేతులు వేసి తన వైపుకి తిప్పుకుని, “ఎక్కడికి వెళ్తున్నావు….అడుగుతుంటే మాట్లాడవేంటి,” అని గట్టిగా అడిగాడు.
దాంతో రేణుక రాము వైపు చూస్తూ, “నీ నుండి దూరంగా వెళ్తున్నాను….” అన్నది.
“ఎందుకు….రేణూ….అలా నన్ను వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు….” అనడిగాడు రాము.
“ఎందుకంటే…ఏదైతే జరుగుతున్నదో దానికంతటికి కారణం నేనే అని నాకు అర్ధమయింది…జరుగుతున్నది మనం ఆపలేమని కూడా నాకు బాగా అర్ధమయింది….ప్రొఫెసర్ సుందర్ చనిపోవాలి కాబట్టి అతను చనిపోయాడు….కాని కిషన్, సునీత వీళ్ళిద్దరిని నువ్వు రక్షించలేకపోయావు….” అన్నది రేణుక.
“అంటే నువ్వు నానుండి దూరంగా వెళ్ళి నిన్ను నువ్వు రక్షించుకోగలననుకుంటున్నావా….” అంటూ రెట్టించిన కోపంతో అడిగాడు రాము. అది విన్న రేణుక రాము కళ్ళల్లోకి చూస్తూ, “నన్ను నేను రక్షించుకోవడానికి వెళ్ళడం లేదు…..నేను నిన్ను రక్షించుకోవడానికి ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను….” అంటూ తనను పట్టుకున్న రాము చేతులను విడిపించుకుని అక్కడ నుండి కదిలింది.
రాము ఒక్క క్షణం ఏం చెయ్యాలో అర్ధం కాలేదు….వెనక్కు తిరిగి అలా వెళ్ళిపోతున్న రేణుక వైపు చూస్తూ వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, “రేణూ……” అంటూ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు.
రాము తన ముందుకు వచ్చి నిల్చోవడంతో రేణుక ఆగి రాము వైపు ఏంటన్నట్టు చూసింది.
రాము రేణుక కళ్ళల్లోకి చూస్తూ, “రేణు…..నువ్వు చెప్పింది నిజమే….జరిగేది ఎవరూ ఆపలేరు….కాని ఎవరైనా 2010 నుండి యాభై ఏళ్ళు కాలంలో వెనక్కి 1960 కి ఎవరైనా రాగలుగుతారా….ఒక్కసారి ఆలోచించు…నన్ను ఆ కాలం నుండి ఈ కాలంలో ఏ శక్తి తీసుకొచ్చిందో నాకు తెలియదు….ఏ శక్తి మనిద్దరిని కలిపిందో అది కూడా నాకు తెలియదు….కాని ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెబుతాను…..నేను ఇక్కడికి వచ్చింది మాత్రం జరుగుతున్నది మార్చడానికే అని మాత్రం చెప్పగలను,” అన్నాడు.
ఆ మాట వినగానే రేణుక రాము కళ్ళల్లొకి చూస్తూ, “ఒకవేళ నా కారణంగా నీకు ఏదైనా జరిగితే….నన్ను నేను జీవితంలొ ఎప్పటికీ క్షమించుకోలేను రాము,” అంటూ తన చేతిని రాము మొహం మీద వేసి అతని బుగ్గల మీద నిమురుతున్నది.
“నువ్వు చెప్పింది కరెక్టే….కాని నేను ఉండగా నీకు ఏదైనా జరిగితే ఆ మరుక్షణమే నేను బ్రతికిఉండను….నీతో పాటే చనిపోతాను,” అంటూ తన మొహం మీద ఉన్న రేణుక చేతి మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు.
ఆ మాట వినగానే రేణుక కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి….అలాగే రాము వైపు చూస్తూ, “ఎందుకు రాము….ఎందుకలా…నా గురించి నీకు అంత శ్రధ్ధ దేనికి….నాకు అంత ఇంపార్టెంన్స్ దేనికి,” అని అడిగింది.
రాము ముందుకు జరిగి రేణుక దగ్గరకు వచ్చి తన రెండు చేతులను ఆమె భుజం మీద వేసి దగ్గరకు లాక్కుంటూ తన చేతులను రేణుక భుజాల మీద నుండి పైకి తీసుకొచ్చి మెడ వెనక ఒక చెయ్యి వేసి నిమురుతూ, ఇంకో చేతిని ఆమె జుట్టులోకి పోనిచ్చి నిమురుతూ ఆమె మొహం మీద మొహం పెట్టి కళ్ళల్లోకి చూస్తూ, “రేణూ….నాకదంతా తెలియదు….నీ మీద ప్రేమో….ఆకర్షణో నాకు తెలియదు….కాని నాకు మాత్రం నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు….ఎప్పుడూ నీతోనే ఉండాలి అనిపిస్తున్నది….కాని ఒకటి మాత్రం నాకు తెలుసు….ఇప్పుడు నాకు నేనంటె కూడా నువ్వే ఇక్కువ ఇష్టంగా అనిపిస్తున్నది. ఇదే ఫీలింగ్ ప్రేమ అయితే….నాకు నువ్వంటే చెప్పలేనంత ప్రేమ…..రేణూ….నిన్ను చూస్తుంటే నీకంటే అయిన వాళ్ళు ఇష్టం అయిన వాళ్ళు ఎవరు లేరనిపిస్తున్నది….” అంటూ తన పెదవులను ఆమె పెదవుల దగ్గరకు తీసుకొస్తున్నాడు.
రాము పెదవులు తన మీదకు రావడం చూసి రేణుక కూడా తన మొహాన్ని ముందుకు తీసుకొచ్చి పెదవులతో రాము పెదవులను మూసేసింది.

7 Comments

  1. Good script without dragging.
    Continue with a second season the escapades after returning to future with daughter in law’s and granddaughters and others.

  2. Boaring story. Pl don’t people like this type of stories. People like open sex language stories.

  3. very nice and interesting storie

  4. Brother plz upload today episode

  5. Hi.. brother awesome narration and twists in the story.. keep it up so post similar some more stories ..

  6. Hi Brother .. your story narration’s and twist are awesome. Keep it up. So post similar stories ..

  7. nenu kuda anukunnanu…sunithani kuda ramutho dengipiste bagundani. dengipinchesaru. super.

Comments are closed.