విమల 1141

ఇప్పుడు తనకు జీవితం లో ఎలాంటి లోటు లేదు,కేవలం ఒక మొగతోడు తప్ప. విమలకు పేలలేదు వచ్చే సమయానికి తన తల్లి కన్నుమూసింది,తరువాత పెళ్లి మీద ద్యసలేదు. ఇప్పుడు చేసుకుందాం అంటే వచ్చే వాడు తన మీద ప్రేమ తో కాకుండా తన ఒంటి మీద వున్నా ఖాఖి చొక్కా మీద ఆశతో వస్తాడు అన్న బయం తో ఇక పెళ్లి చేసుకోకూడదు అన్న నిర్ణయించుకొని తన డ్యూటీనే మొగుడుగా బావించి కన్యగానే మిగిలిపాయి బ్రతుకుతోంది తను. అలా సాఫీగా సాగిపోతున్న తన జీవితం లోకి హటాతుగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇయింది ఒక స్పెషల్ కేసు ని డీల్ చేయమని.
అసలే రైలు ప్రయాణం తో అలసిపోఐన తను త్వరగా స్నానం ముగించి , బయటుకు వచ్చి చూసి షాక్ అయింది,తన బాగులు, సూట్ కేసు అని చెల్లా చెదురుగా వున్నాయి. తన లోదుస్తులు చీరలు జాకెట్లు అన్ని చిందరవందరగా పడిఉన్నాయి,ఒక్కసారి మొత్తం ఇల్లంతా చూసింది విమల,తను వేసిన తలుపులు వసినట్టే వున్నై,బయట నుండి లోపాలకి ఎవరు వచ్చే ఆస్కారం లేదు,మరి ఇది చేసింది ఎవరు ఏంటో ఏమి అర్థం కావడం లేదు తనకి. అయోమయంగా చూస్తూ మెల్లగా తన బట్టలని మడిచి కబోర్డు లో సర్దింది. బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏ/సి ఆన్ చేసుకొని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తోంది విమల. అసలే అలుపు మీద వున్నా తనకి నిద్ర రావడం లేదు.తన బాగులు, సూట్ కేసు అని చెల్లా చెదురు ఎవరు చేసారు ఏంటి ఈ మిస్టరీ ఏమి అర్థం కావడం లేదు తనకి. మెల్లగా లేచి హాల్ లోకి తన సూట్ కేసు ఒక్కదాని ఓపెన్ చేసి అందులోని విస్కీ బాటిల్ సిగ్గరేట్ ప్యాకెట్ తీసుకొని బెడ్ రూం లోకి వచ్చి విస్కీ గ్లాస్ లో ఒక పెగ పోసి వాటర్ కోసం ఫ్రీద్జ్ దగ్గరికి వెళ్ళింది.

ఫ్రీద్జ్ లో వాటర్ లేకపోవడం తో వాటర్ కోసమని సీనుని ఇంటర్కం లో కాల్ చేసి పిలిచింది,వాటర్ తీసుకొచ్చిన శీను బెల్ కొట్టడం తో డోర్ తెరిచింది. శీను చేతిలో బాటిల్ తీసుకొని శీను ఇంతకముందు ఈ ఇంటిలో ఎవరు ఉండేవారు ? అందుకు శీను ఇంతక ముందు ఇక్కడ సివిల్ ఇంజనీర్ ఒక్కరు ఫ్యామిలీ తో వుండేవారు మేడం,ఈ మద్యనే ఆయన చాలా హడావిడిగా ఇల్లు కాళీ చేసి వెళ్లారు మేడం, ఎందుకు మేడం ఏమైంది ? ” అబ్బే ఏమిలేదు జస్ట్ అడిగా ఇల్లు చాలా బాగా మైంటైన్ చేసారు వాలు అందుకని అంటుండగా ఎక్కడ మేడం వారు వచ్చిన 20 రోజులకే వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ కట్టిన 15 క్వార్టర్స్ లో ఇప్పుడు వున్నది మీరు ఇంకో 3 ముగ్గరు మాత్రమే మేడం. ఇక్కడ వచ్చిన వాలు యే వేళా విశేషం లో వస్తారో గాని ఫట్ మని నెల రోజులు కూడా వుండరు,ఏమో మేడం ఈ విచిత్రం అని చెప్పి శీను వెళ్ళిపోయాక డోర్ లాక్ చేసుకొని తన బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
బెడ్ రూమ్ లోకి వెళ్ళిన విమల కు దిమ్మ తిరిగింది ఒక్కటే సిగ్గరేట్ పొగ వాసన..తను తీసుకు వచ్చిన ఫుల్ బాటిల్ విస్కీ లో మూడో వంతు బాటిల్ కాళిగా వుంది, తను ప్యాకెట్ కూడా విప్పని సిగ్గరేట్ ప్యాకెట్ లో మూడు సిగ్గరెట్లు మిస్సింగ్. ఒక్కసారి రూం ని పరీక్షగా చూసింది ఎవరు లేరు,ఇంటిలోకి వచ్చే ఎవరు వచ్చే అవకాశమే లేదు మరి ఎవరు చేస్తున్నారు ఏంటో ఏమిఅర్థం కావడం లేదు. రూములో ఒక మూల లో 3 సిగ్గరేట్ పీకలు పది ఉన్నాయి. కేర్ టేకర్ శీను ని పిలుదం అంటే తన అహం అడంమోస్తోంది. సైలెంట్గా వెళ్లి మంచం మీద కుర్చుని ఆలోచిస్తోంది విమల , ఎంతకి అంతుపట్టక పోవడం తో మిగిలిన విస్కీ బాటిల్ లోంచి రెండు పేగులు వేసి ఒక సిగ్గరేట్ కాల్చి మతుగా మంచం మీద వాలింది.