వూహించని మలుపు

మాడం , నేను మీ వారు పనిచేసే ఆఫీస్ లో అడ్మిన్ మేనేజర్ ని . మా కంపెనీ MD ఒకసారి మీతో మాట్లాడాలంట అర్జెంటు గా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు .

మా ఆయనికి ఏమయ్యింది ?

మాడం , ఆయనికి ఏమి కాలేదు . ఎదో విషయం మాట్లాడడానికి రమ్మన్నారు అంతే .రండి

(ఆచారి దగ్గర 1 హావర్ పర్మిషన్ తీసుకుని కార్ ఎక్కింది హేమ )

కార్ లో 30 నిముషాల్లో సూర్య ఆఫీస్ కి చేరుకుంది .అదే ఫస్ట్ టైం సూర్య ఆఫీస్ కి వెళ్లడం .ఆ వచ్చిన ఎగ్జిక్యూటివ్ సరాసరి MD గది దగ్గరికి తీసుకు పోయాడు .లోపల కూర్చోండి సార్ ఒక 5 నిముషాల్లో వస్తారు అని చెప్పాడు .

ఆ గది చాలా రిచ్ గా వుంది . ఆ టేబుల్స్ ,కూర్చీలు , గోడ పైన పెయింటింగ్స్ ,చల్లటి AC గాలి కి కొంచెం వణుకు వస్తుంది .

కొద్దిసేపటికి ఠీవి గా నడుచుకుంటూ వచ్చాడు ధర్మా సార్ .

లేచి నిలబడి నమస్కారం చేసింది హేమ .

కూర్చోమని కళ్ళ తో నే చెప్పాడు తాను సీట్ లో కూర్చుంటూ . ధర్మ కి పెద్ద వయసేమే కాదు .
జిమ్ బాడీ ఏమో అనుకుంది హేమ మనసులో .

ధర్మ మాట్లాడుతూ : చూడండి హేమ , మిమ్మల్ని ఎందుకు పిలిపించానో చెప్పే ముందు మీ భర్త గురించి ఎమన్నా విషయాలు మీకు తెలుసా?
తెలియదనట్టు గా తల ఊపింది హేమ .

ఒకే , మీ భర్త ఈ కంపెనీ అకౌంట్ నుండి 25 లక్షలు దొంగతనం చేసాడు .

(ఈ మాట వినగానే కాళ్ళ కింద భూమి కంపిస్తుంది )

యా ..నిజం. ఇది మీకు తెలియదన్న సంగతి కూడా మాకు తెలుసు . ఎంక్వయిరీ చేస్తే మీ భర్త ఒక పిచ్చి బాబా ని కలిసి మాయ లో ఆ డబ్బు ఇచ్చాడని తెలిసింది.

(ఈ మధ్య ఆ బాబా గురించిన మాటలు ఇంట్లో వింది )

కానీ మా కంపెనీ కి ఇవన్నీ సంబంధం లేదు కావలిసింది డబ్బు . నువ్వు కానీ నీ భర్త కానీ ఆ డబ్బు ని 3 డేస్ లోగా కట్టాలి .లేకుంటే పోలీస్ లకి , మా స్పెషల్ రికవరీ టీమ్ కి చెప్పవలసి ఉంటుంది .

హేమ కి కన్నీళ్లు ఆగట్లేదు . శరీరం అంతా వణికిపోతోంది . ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు. తల తిరుగుతున్నది .

అప్పుడే ఆ రూమ్ లోకి వచ్చాడు ఆ కంపెనీ మరో MD రాజీవ్ .

హేమ రాజీవ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది . ఇతను నా డిగ్రీ క్లాసుమేట్ రాజీవ్ అవునా కాదా అనుకుంటూ .

8 Comments

  1. Super. Nice. Continue please

  2. Super continue don’t stop story

  3. Are you taking this much time to continuu/post story. This is too much.

  4. How much time it will take

  5. How much time it will take

  6. గోపాల్

    త్వరగా తరువాయి బాగం post చేయండి

  7. Continue cheyandi story ni readers andaru adugutunaru kadha update fast plz

Comments are closed.