వూహించని మలుపు 378

ఏమిలేదు కొద్ది గా కళ్ళు తిరిగాయి అంది హేమ
ఓ అవునా మీ స్టాప్ వచ్చేసింది మాడం
హా అంటూ బస్ దిగి చక చక నడుచుకుంటూ వీధి లోకి వెళ్ళిపోయింది హేమ.
డ్రైవర్ కి థాంక్స్ చెబుతూ కన్ను కొట్టాడు రాజు.

అగ్రిమెంట్ కాపీ రాజు చేతిలో పడడం హేమ అదృష్టమా లేక దురదృష్టమా ముందు ముందు వచ్చే updates లో చూద్దాం .

ఇంటికి చేరుకున్న హేమ కి ఎదురు వచ్చింది కూతురు దీపు
ఈవాళ ఇంత లేట్ అయ్యిందేంటమ్మా ?
ఆఫీస్ లో కొంచెం వర్క్ ఎక్కువయ్యింది కొంచెం ముభావం గానే సమాధానం ఇచ్చింది హేమ
అవునా అయినా అదేంటి అలా వున్నావ్ ?
ఏమి లేదు బస్ లో కొంచెం కళ్ళు తిరిగాయి . కొంచెం వంట నువ్వు చేసేయ్ నేను కాసేపు పడుకుంటాను .
సరే అమ్మా
మీ నాన్న ఎక్కడ ?
నాన్న ఇంకా రాలేదమ్మా . ఇప్పుడే ఫోన్ చేశారు ఇంకో 1 హావర్ లో వస్తానని చెప్పారు.
సరే లే వంట అయ్యాక లేపు

హేమ పడుకుని అలాగే నిద్ర లోకి జారిపోయింది

రాత్రి 10.00 గంటలప్పుడు కాలింగ్ బెల్ మోత కి మెలుకువ వచ్చింది.

లేచి చూసేసరికి దీపు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది . సరే అని అనుకుంటూ వెళ్లి డోర్ తీసింది ఎదురుగా భర్త సూర్య. సూర్య మొహం లో ఎదో తెలియని సంతోషం.

హేమా , లక్ అంటే మనదేనే
ఎందుకు కొంచెం ప్రశ్నార్థకంగా అడిగింది హేమ
ఇంకో 4 డేస్ లో నా ప్రమోషన్ కంఫర్మ్ చేస్తానని మా బాస్ రాజీవ్ చెప్పారు. అంతే కాదు నేను కొలిచే కొల్లం బాబా ఆయన కలలోకి కనపడి నేను కట్టవలసిన కొంత డబ్బు కూడా వెనక్కి తీసుకోవద్దని చెప్పారు అంట .నేనే అనవసరం గా కొల్లం బాబా ని అపార్ధం చేసుకున్నాను. అందుకే రేపు ఉదయం మా బాస్ లు ఇద్దరు కొల్లం వెళ్లి ఆయన ఆశ్రమం లో 3 రోజులు ఉండి వస్తామని చెప్పారు . నేను కూడా వస్తానంటే వద్దన్నారు . ఆనందం గా చెప్తూవుంటే హేమ కి సూర్య పిచ్చివాడి లా కనిపిస్తున్నాడు.

సరే , అవన్నీ తర్వాత ముందు భోజనం చెయ్యండి.

అదికాదు హేమ అంటూ ఎదో చెప్తుండగా ఇంక చాలు అన్నట్టు గా చూసింది హేమ .

నేను రేపు ఆఫీస్ పని మీద విజయవాడ వెళ్ళాలి . వచ్చేటప్పటికి 3 రోజులు పడుతుంది .

అదేంటి కొత్తగా టూర్ లు మీ ఆఫీస్ లో ?

ఎదో ఆడిట్ రిపోర్ట్ తప్పులున్నాయంట ఆచారి గారు నన్ను వెళ్లమన్నారు . సరే మీరు ఫ్రెష్ అయ్యి భోజనానికి రండి.

8 Comments

  1. Super. Nice. Continue please

  2. Super continue don’t stop story

  3. Are you taking this much time to continuu/post story. This is too much.

  4. How much time it will take

  5. How much time it will take

  6. గోపాల్

    త్వరగా తరువాయి బాగం post చేయండి

  7. Continue cheyandi story ni readers andaru adugutunaru kadha update fast plz

Comments are closed.