నిన్ను చూస్తే నాకే ఇలా వుంది అంటే, మీ నానమ్మ అమ్మమ్మ తట్టుకో గలరా, అంటూ వాటేసుకొని ముద్దులు పెడుతూ వదలటం లేదు, అది చూస్తున్న ఉష కి కళ్ళు చెమ్మగిల్లాయి ఆనంద బాష్పాలు ఒక్కొకటి నేలను తాకుతూ వున్నాయి, వీళ్ళను చూసి స్వీటీ కూడా ఏడుస్తుంది.
అల ఇద్దరు స్వీటీ తో ముచ్చట్లలో పడ్డారు, ఇంతలో ఉష నాన్న వచ్చారు, రావటమే ఉష నీ చూసి సంతోషం తో ఏరా ఎప్పుడు వచ్చావు, చెప్పనే లేదు, చెప్పి వుంటే ఇంట్లో వుండే వాడిని గా అన్నారు, అల్లుడు ఎలా వున్నాడు, అని అన్ని ప్రశ్నల తర్వాత పాపని చూసే సరికి, ఉష నా ఫ్రెండ్ కూతురు అని అమ్మకి చెప్పినట్లే చెప్పింది, ఆయన స్వీటీ నీ దగ్గరకి తీసుకొని అమ్మ అడిగినట్లు నే పేరు ఎంటి అని అడిగాడు, ఉష అమ్మ లాగా నాన్న కూడ కనిపెడతాడ ఎంటి అన్న అనుమానంతో వల్ల అమ్మ వైపు చూసింది, మీ నాన్నకి అంత సీన్ లేదు లే అని కళ్ళతోటే చెప్పింది ఉష నవ్వుకుంది, పేరు అడగగానే స్వీటీ అని ముద్దుగా చెప్పింది, నీ లాగా నీ పేరు కూడ ముద్దుగా వుంది తల్లి అని దగ్గరకి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు, థాంక్స్ తాతయ్య అని స్వీటీ చెప్పింది, తాతయ్య అనగానే కొంచం ఎమోషనల్ అయ్యి మళ్ళీ దగ్గరకి తీసుకొని ముద్దు పెట్టాడు, తర్వాత ఉష తో ఉష ఈ పాపని చూస్తుంటే ఎవర్నో చూస్తున్నట్టు వుంది కదా అనగానే ఉష ఒక్కసారి ఉలిక్కి పడి హా నాన్న అని చెప్పింది తదపడుతు,
ఉష అమ్మగారు స్వీటీ కి నచ్చినవి అన్ని చేసింది, అందరూ బోజనానికి కూర్చున్నారు, ఉష అమ్మ స్వీటీ కి తినిపిస్తింది, అమ్మమ్మ నువు కూడా తిను అని స్వీటీ అంది, నువు తిన్నాక తింటా తల్లి అని చెప్తే ఊహు నువ్వు కూడా తిను అని గారంగా అనేసరికి ఉష నాన్న గారు నువు కూడా తిను అని చెప్తే, ఉష అమ్మ షాక్ తిని( ఎందుకంటే పెళ్లి అయిన దగ్గర నుండి నువు తిన్నావా నాతో పాటు తిను అనే మాటే తను వినలేదు,) తను కూడా తినటానికి కూర్చింది, స్వీటీ కి తినిపిస్తూ తను కూడ తింటుంది, పిన్ని నువు కూడా ముద్ద పెట్టు అని ఇద్దరి దగ్గర తిన్నది, స్వీటీ చెప్పే కబుర్లు కి ఇల్లు మొత్తం సందడి గా వుంది, తిన్నాక ఎక్కడ పడికుంటువ్ అంటే నేను అమ్మమ్మ దగ్గర పడుకుంటా అని చెప్తే నా బంగారు తల్లి పద పాడుకుందాం అని పడుకున్నారు,
పొద్దున్నే ఉష లేచే సరికి వల్ల నాన్న పేపర్ చదువుతూ గార్డెన్ లో వున్నాడు, ఉష కాఫీ తీసుకెళ్ళి నాన్నకి ఇచ్చి తను కూడా పేపర్ చదువుతూ తాగుతుంది, ఇంతలో ఉష నాన్న మంగ కనిపిస్తే ఒకసారి ఇటు రమ్మను అని చెప్పాడు ( మంగ అంటే మధు వల్ల ఇంట్లో పెట్టిన పని మనిషి), ఇంతలో ఉష పూలు కోసుకుంటు గేట్ దెగ్గరలో వుంది, అప్పుడే అటుగా వెళ్తున్న మంగని పిలిచి మంగ బాగున్నావా అంటే నేను బాగున్న అమ్మ మీరు ఎలా వున్నారు ఎప్పుడు వచ్చారు అంది, ఇంతలో ఉష నిన్ను నాన్న పిలుస్తున్నారు అని చెప్తే ఎంటంట ఇప్పుడు నాతో పని అని గిరగ అంటే ఉష కి కాలి అదే మంగ రోజు నువు ఎవరికో ఫోన్ చేసి ఇక్కడ మూడు ఇళ్ళల్లో జరిగేవి చెప్తున్నా వూ అంటగా అది తెలిసి రమ్మన్నారు, ఒక్కసారి మంగ మొహం మడిపోయి బయం బయం గా చూస్తుంది, ఉష వేళ్ళు అని అటు చేయి చూపెట్టింది, మంగ మెల్లిగా అడుగు లో అడుగు వేసుకుంటూ బయం బయం గా మద్య లో ఉష వైపు చూస్తూ వెళ్తుంది, మంగ నీ చూసి ఉష నవ్వుకుంటుంది, ఆయన దగ్గరికి వెళ్లి ఫాస్ట్ గా కొట్టుకున్న గుండెతో అయ్యగారు పిలిచారట అనగానే ఆయన మంగ మీ అయన్ని ఒకసారి మధ్యానం నన్ను కలవమనే నేను కొబ్బరి తోటలో వుంటాను అని చెప్పగానే అలాగే అయ్యగారు అని వెనక్కి తిరిగి గుండెల మీద చేతులు వేసుకుని హమ్మయ్య అనుకొని ఉష దగ్గరికి వెళ్ళింది,
