అభినవ సుమతి 193

చాలా రోజుల తర్వాత బాగా కసిగా చేసుకున్నాం…
ఆయాసం తగ్గాక నేను ఆయన ఛాతీ మీద పడుకొని…

” ఏమండీ… మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెపుతారా…” అని అడిగాను

“అడుగు” అన్నారాయన నా తలని నిమురుతూ…

ఆయన చెయ్యి మీద నా చెయ్యిని వేసి నా తల మీద అలాగే ఉంచి “నిజమే చెప్పాలి… ప్రామిస్?.” అన్నాను…

“ఏంటో…అడుగు..” అన్నారాయన…

“మీరీ మధ్య డల్ గా ఉంటున్నారు… ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటున్నారు… కారణం ఏంటో నాకు చెప్పండి…”

“ఏం లేదు సుమతీ…” అని ఆయన అంటుండగానే మధ్యలో కల్పించుకొని..
“మీరు నాకు నిజం చెప్తానని ప్రామిస్ చేశారు… ప్లీజ్ చెప్పండి… భార్యా భర్తలు అన్నీ సమంగా పంచుకోవాలి అంటారు… మీ సుఖాలని నాకు పంచుతున్నారు… మీ బాధల్ని కూడా పంచండి… వీలైతే నాకు చేతనైన సాయం చేస్తాను…” అన్నాను…

“నువ్వు చెయ్యలేవు సుమతీ…” అన్నారాయన…

“సమస్య ఏంటో ముందు చెప్పండి… చేయగలనో లేదో నేను చెప్తాను….”

“చెప్తాను సుమతీ… కానీ నువ్వూ నాకు ఒక మాట ఇవ్వాలి…”

“ఏమని…”

“మొత్తం విన్నాక నా మీద కోపం తెచ్చుకోవడం, అలగడం, బాధపడడం, మాట్లాడకుండా ఉండడం ఇలాంటివి ఏవీ చెయ్యకుండా… ఎప్పట్లానే నాతో ఉండాలి… అలా అని నాకు మాటిస్తేనే చెబుతా…” అంటూ చెయ్యి చాచాడు…

“ఏంటండీ … అంత సీరియస్ విషయమా… సరే మాటిస్తున్నా….” అంటూ ఆయన చేతిలో చేయి వేసా…

ఆయన గట్టిగా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టాడు…

“సుమతీ… ఈ మధ్య నాకొక పిచ్చి కోరిక మొదలైంది… అది ఎందుకు మొదలైందో, ఎలా మొదలైందో నాకు తెలియదు… ఎన్నిరోజులు గానో కూడా తెలియదు… కానీ రోజు రోజుకీ అది పెరుగుతుంది… తప్పని నా నా బుద్ధికి తెలుస్తుంది… కానీ మనసుకు తెలియడం లేదు… మనసుని కంట్రోల్ చెయ్యాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు… రోజు రోజుకీ బుద్ధిని మనసు డామినేట్ చేస్తుంది… ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేకా కొట్టుమిట్టాడుతున్న…. ” అంటూ ఆపాడు…

నాకు ఆతృత పెరిగిపోయింది…. ఆయన పైనుండి లేచి కూర్చున్నాను…
ఆయన కొనసాగించాడు…

“సుమతీ… ఇన్నేళ్ల మన కాపురంలో నాగురించి నీకు తెలియని విషయం ఏమీ లేదు… నా మనస్తత్వము, నా ప్రవర్తన, నా కోపతాపాలు, నాకు సంతోషం కలిగించేవి, బాధ కలిగించేవి అన్నీ నీకు తెలుసు… అవునా…”

నేను అవునని తలూపాను…

“ఏ రోజైనా పరాయి అమ్మాయి వంక కన్నెత్తి చూసానా…”

“చీ చీ అలా అని ఎవరైనా అంటే వాళ్ళ నాలుక తెగ్గోస్తాను… చెప్పండి ఎవరైనా మీ మీద అభాండం వేశారా… ఆ పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా…”

“లేదు సుమతీ ఎవరూ అనలేదు…”

“మరి…”

“సుమతీ… నాకే ఈ మధ్య ఇంకో స్త్రీ మీద కోరిక కలిగింది…”

“ఏంటీ….” అని అరిచాన్నేను… బ్రహ్మాండం బద్దలైన ఫీలింగ్ కలిగింది నాకు… వెయ్యి ఓల్టుల కరెంట్ తీగను పట్టుకున్నంత షాక్ తగిలింది…

“అవును సుమతీ… నాకే ఈ కోరిక కలిగింది… ఇందాకే చెప్పాన్నేను… ఆ కోరిక ఎందుకు కలిగిందో నాకు తెలియదు… కానీ ఎంత అనుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు….”

నా చెవులను నేను నమ్మలేకపోతున్నా… నేను వింటున్నది నిజమేనా… “అభిరామ్” అంటే “అభినవ రాముడు” అని అందరి దగ్గరా నేను గర్వంగా చెప్పుకునే నా భర్తేనా ఇంకో ఆడదాని మీద మనసైంది అని చెప్తున్నది… క్షణకాలం పాటు నాకు మతిపోయిందనిపించింది… ఏం మాట్లాడాలో తెలియట్లేదు… అంతలోనే ఆయన్నే చలింపజేసిన “ఆమె” ఎవరై ఉంటుందా అని డౌట్ వచ్చింది… అడగాలంటే మాట పెగలట్లేదు…

“ఎవరూ….” అని మాత్రం అనగలిగాను…

“నీ ఫ్రెండ్… సంజన…” అన్నాడాయన…

నాకు మరింత షాక్ తగిలింది… కాసేపు కాలం స్తంభించిన ఫీలింగ్ కలిగింది నాకు… నోటమాట రాని దానిలా అలాగే కూర్చుండిపోయాను… ఎంతసేపు అలా ఉన్నానో తెలియదు… తేరుకునే సరికి చాలాసేపు పట్టింది… తిరిగి ఆయన వైపు చూసాను… రెండు కళ్ళ మీద చేయి అడ్డంగా పెట్టుకొని పడుకున్నడాయన… నిద్రపోతున్నారా, ఆలోచిస్తున్నారా అనేది తెలియలేదు… “నీ ఫ్రెండ్ సంజన…” అన్న ఆయన మాట ఇంకా నా చెవుల్లో మారు మోగుతుంది…

*****************************************************************************************************************

1 Comment

  1. Very pleasant story
    Real-time sex described
    Hats off

Comments are closed.