అర్జున్ రొమాన్స్ 416

దాదాపు గా రెండు గంటలు ప్రయాణం అశోక్ తాను ACP ఎలా అయ్యాడు అన్నది ఈ రెండు గంటల్లో కార్తిక్ తో షేర్ చేసుకున్నాడు కార్తిక్ కూడా తాను ఫారిన్ లో మనేజ్మెంట్ కోర్స్ చేసి రెండు మూడు బిసినెస్ చేసి మంచి ప్రాఫిట్స్ వస్తున్నా బోర్ కొట్టడం తో వేరే ఫ్రెండ్స్ కి హాండ్ఓవర్ చేసేసి ఇండియా కి వచ్చాడని ఇక్కడ తన అమ్మ చెల్లెలు భర్త సతీష్ బాబాయ్ ఫ్రెండ్ అయిన సంజయ్ వాళ్ళ అక్క ప్రసన్న కూతురు రియాని మనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నప్పుడే ప్రేమించినందుకు పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు.

రిసార్ట్ ఉండే ఏరియా కి వచ్చి చూస్తే అక్కడ ఏమి లేదు మొత్తం కాలిగా ఉంది రీసెంట్ గా ఎవరో కొని కన్స్ట్రక్షన్ చేయడానికి పిల్లర్స్ వేయడానికి అని గుంతలు తీసి ఉంచారు అదంతా చూసి కార్తిక్ షాక్ అయ్యి అశోక్ తో ఎన్టీరా ఇది ఇక్కడే ఉండింది రా ఆ రిసార్ట్ అదిగో అక్కడ చిన్న షాప్ ఉంది చూడు హా ఇక్కడే రా ఆ రిసార్ట్ ఉన్నది ఏమైనట్టు తీసేసారా అలా ఎలా తీస్తారు రా 5 అక్రస్ ప్లేస్ లో అంత పెద్ద రిసార్ట్ అలా ఎలా ఎత్తేస్తారు అసలేం జరిగింది.

కూల్ డౌన్ రా కార్తిక్ కూల్ అక్కడ షాప్ వాడిని అడుగుదాం ఉండు అనగానే కార్తీక్ ఆ షాప్ దగ్గర కార్ ఆపగానే నేను ఇక్కడే ఉంటా నువ్వు వెళ్లి అడుగు అని అశోక్ అనడం తో కార్తిక్ కార్ దిగి షాప్ దగ్గరకి వెళ్ళి అందులో ఒక 20 ఏళ్ల లోపు అమ్మాయి ని చూసి తనని ఎస్క్యూస్ మీ వన్ వాటర్ బాటిల్ ప్లీస్ అని ఒక బాటిల్ ఇస్తే కాసిన్ని నీళ్లు తాగి ఇక్కడ ఒక రిసార్ట్ ఉండాలి కదా అండి వేరే చోటులోకి ఏమన్నా మార్చారా అని ప్రశ్నించాడు.

ఆ అమ్మాయి ఏమో తెలిదండి నేను రీసెంట్ గా వచ్చాను మా వారిని పిలుస్తాను ఉండండి, ఏవండి…… ఏవండి…. ఒకసారి ఇలా రండి, ఏంటి బుజ్జి అలా అరుస్తున్నావ్ ఏమైంది అని ఒక 50 కి పైన వయసు ఉన్న ఒక ఆయన వచ్చి చెప్పండి బాబు అని కార్తిక్ ని అడిగాడు, మామయ్య ఆయన ఎక్కడ ఎదో అడుగుతున్నారు చూడండి నేను ఇప్పుడే వస్తా అని అమ్మాయి లోనికి వెళ్ళగానే కార్తిక్ మళ్ళీ రిసార్ట్ గురించి అడిగాడు, ఆయన తెలీదు బాబు మేము ఇక్కడ 20 ఏళ్లనుంది ఉంటున్నాం మీరు అడిగినట్లు ఇక్కడ అలాంటి కట్టడాలు ఏమి కట్టలేదు,ఇప్పుడే ఒక గవర్నమెంట్ కాలేజ్ కట్టడానికి ఈ స్థలాన్ని కొన్నది అని మాత్రం తెలుసు.

చూడండి మీరేదో దాస్తున్నారు మంచిగా అడుగుతున్న చెప్పండి లేకపోతే అనగానే వాడు భయపడ్డాడు కార్తిక్ వెనక కార్ లో నుండి అశోక్ యూనిఫామ్ లో కార్ దిగి షాప్ దగ్గరికి రాగానే వాడు కార్తీక్ ని ఒక్క తోపు తోసి లోపలనుండి షట్టర్ కిందకి లాగేసి పారిపోయాడు, ఇక్కడ కార్తిక్ ని అశోక్ పట్టుకుని తనని బాలన్స్ చేసి షట్టర్ పైకి లాగి చూసే సరికి లోపల ఎవరు లేరు కౌంటర్ పక్క గా ఉన్న చిన్న సందులో నుండి లోపలికి డోర్ కుడి పక్కాగా ఉన్న తెలుపులో నుండి చూస్తే దూరంగా ఒక వ్యక్తి పరుగులు పెడుతుంటే అశోక్ వాడిని వెంబడించి మొత్తానికి పట్టుకున్నాడు.

తలకి గన్ పెట్టి వాడిని జాగ్రత్తగా కార్ దగ్గరికి నడవమని వాడి వెనకానే అశోక్ కార్ దగ్గరికి రాగానే కార్తిక్ డోర్ తీస్తూ వాడిని లోపలికి తోసి అశోక్ వాడి పక్కనే కూర్చుంటే కార్తిక్ డ్రైవ్ చేస్తూ కార్ ని స్టేషన్ కి పోనిచ్చారు, దారిలో బాగా కొట్టి కొట్టి వాడికి తెలిసింది చెప్పక పోతే చంపేస్తానని అశోక్ బెదిరించినా నోరు విప్పక పోయే సరికి, సెల్ తీసుకుని ఎవరికో కాల్ కలిపి హా శివరాం వీడిని స్టేషన్ కి తీసుకొస్తున్నాం. కళ్ళ ముందు కన్న కొడుకు సెక్యూరిటీ అధికారి దెబ్బలు తింటుంటే వీడు తట్టుకుంటాడో లేదో చూద్దాం, ఆ మాటలు వినగానే ఒద్దు బాబు నిజం చెప్పేస్తాను నా కొడుకుని ఎం చేయకండి నాకు తెలిసిందంతా చెప్తాను అనడం లోపే స్టేషన్ చేరుకున్నారు, తలకి గన్ పెట్టి కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకొచ్చి చైర్ లోకి తోసి టేబుల్ పైన కూర్చుని చెప్పు ఇప్పుడు.

సార్ మీరన్నది నిజమే ఒక నెల క్రితం మీరు అంటున్నది ఉండేది కానీ అది అప్పుడప్పుడే కట్టింది అంత ఒక సెట్టింగ్ లా వేసారు ఎందుకు ఏమిటి అని అడిగితే సినిమా షూటింగ్ జరుగుతోంది ఒక పెళ్లి సీన్ తీస్తున్నాం అన్నారు నేను నిజమే అనుకున్నాను కానీ పెళ్లి సీన్ అయిపోయిన వెంటనే చాలా మంది వెళ్లిపోయారు కానీ కొందరు అక్కడే ఉండిపోయారు దాదాపు ఒక 10, 15 కార్లు కూడా ఉన్నాయి, కానీ నేను షాప్ బంచేసిన తరువాత రెండు గంటలకు పెద్ద పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి బాణసంచా అయివుంటుంది, కాలిగా ఉన్న చోటు గనక పెద్దగా వినిపిస్తుంది అనుకోని పట్టించుకోలేదు, కానీ తెల్లారి లేచి చూసే సరికి మొత్తం మంటలు బూడిద స్మశానం గా మారిపోయింది అంత పేల్చేశారు అప్పుడు నేను ఒక్కడినే ఇంట్లో ఉన్నాను నా కొడుకు కోడలు అత్తగారింట్లో ఉన్నారు. ఇంతే సార్నాకు తెలిసింది, రెండు రోజుల తరువాత రెండు పెద్ద పెద్ద లారీ లు ఒక JCB తో అంత శుభ్రం చేసేసారు. అంతే సార్.

అంత విన్న తరువాత కార్తీక్ కి కన్నీళ్లు ఆగట్లేదు అశోక్ కూడా ఇంత దారుణం జరగడానికి కారణం ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ అర్జున్ పైకి తన ధ్యాస మల్లడం తో ఈ బ్లాస్ట్ లో అర్జున్ ఒక్కడే తన ప్రాణాన్ని కాపాడుకున్నాడేమో అనుకుని 104 అని కేకేసి వీడు చెప్పిందంతా రికార్డ్ చేశావ్ గా ఒక FIR రాసి వీడిని ప్రత్యక్ష సాక్షి ని చేయి.

కార్తిక్ ప్లీస్ రా ఉరుకో ఇంత దారుణానికి ఒడి గట్టిన వాళ్ళని ఎవరిని నేను ఉరికె వదలను వాళ్ళు ఎవరైనా సారి చట్ట రీత్యా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను, అది కాదురా రియా కి ఈ విషయం ఎలా చెప్పాను ఆల్రెడీ ఆ సెక్యురిటి గాడి నాన్న చెప్పడం తోనే తను షాక్ అయ్యి స్పృహ తప్పింది ఇప్పుడు అదంతా నిజం అని తెలిస్తే ఎలా అసలు ఇంతకు ఎవరెవరు ఆ బ్లాస్ట్ లో పోయారో ఎవరెవరు తప్పించుకున్నారో ఏమి తెలియకుండా పోయింది, కనీసం కార్ నంబర్స్ ని బట్టి అన్న అక్కడ చనిపోయింది ఎవరన్నది తెలుస్తుంది.

ఒక ఐడియా రా కార్తిక్ లాస్ట్ వన్ మంత్ నుండి మన దగ్గర మిస్సింగ్ కేస్ లు ఏమేంఉన్నాయో వెతికితే ఏమన్నా క్లూ దొరుకుద్దేమో, నేను ఆ పని చూస్తాను నువ్వు ముందు ఇలా రా, ఎక్కడికి రా ఇప్పుడు చాలా డిస్తూర్బ్డ్ గా ఉన్నావ్ ఒక మంచి స్ట్రాంగ్ టీ ఒకటి తాగుదాం పద కార్ తీ, కార్తిక్ ఇంకా అశోక్ ఇద్దరు కార్ లో బయలుదేరారు, ఎక్కడ ఆపమంటావ్ రా ఇక్కడ టీ స్టాల్ ఉంది ఆ పక్కన ఆపన, వద్దు ఇక్కడ కాదు నేను చెప్తాను పదా, ఒక 20 నిమిషాలు తరువాత అశోక్ దారి చెప్తుంటే కార్తిక్ డ్రైవ్ చేస్తూ చేస్తూ చివరికి ఒక ఇంటి దగ్గర ఆగారు, కార్ దిగుతూ దిగరా కార్తిక్ మనిల్లే అంటూ గేట్ తీస్తుండగా ఒక 20 ఏళ్ల లోపు అమ్మాయి తలుపు దగ్గర నిలబడి అమ్మా అన్నయ్య వస్తున్నాడే అని అరిచింది.

కార్తిక్ కి కొంచం కొంచం గుర్తుంది అశోక్ కి ఒక చెల్లెలు ఉండేది అని తన పేరు మాత్రం గుర్తు రాలేదు అశోక్ చెల్లెలు తన అన్నయ్య అశోక్ తో ఇంకెవరో వస్తున్నారని చూసి ఎవరబ్బా ఇతను డార్క్ బ్లూ జీన్స్ వైట్ షర్ట్ లో ప్రభాస్ లా ఉన్నాడు కానీ కాస్త పొట్టి, అని అనుకుని వెనక్కు తిరిగి చెంగు చెంగున ఎగురుతూ లోపలికి వెళ్ళిపోయింది,

అశోక్ ఇంటి డోర్ దగ్గరికి రాగానే రా కార్తిక్ అంటూ కార్తిక్ ని లోపలికి పిలిచి పక్కన ఉన్న సోఫా చుయిస్తూ కూర్చో అని కిచెన్ వైపు వెళ్తూ అమ్మ రెండు టీ కాస్త స్ట్రాంగ్ గా పెట్టావా అని వాష్ రూమ్ వైపు వెళ్ళాడు, కార్తిక్ సోఫాలో కూర్చుని చుట్టూ చూస్తూ ఇల్లు బలే అలంకరించారే అనుకుని తనకి ఎదురుగా ఉన్న గోడకి ఒక ఫోటో దానికి దండ ని చూసి ఓహ్.

అని లేచి అరె అశోక్ వాళ్ళ నాన్న ప్రసాద్ రావు గారు అనుకుంటుంటే చేతిలో ట్రే పట్టుకుని ఒక 45 ఏళ్ళు ఉండొచ్చు ఆవిడ వచ్చి కార్తిక్ పక్కన నిలబడి మా ఆయన బాబు చనిపోయి 2 ఏళ్ళు అయ్యింది ఆయన చివరి కోరికగా నా కొడుకుని సెక్యూరిటీ అధికారి అవ్వమనడం తో ఇలా మీరు….?

అంటి నన్ను గుర్తు పట్టలేదా నేను కార్తిక్ ని 10 ఏళ్ల క్రితం ఒకసారి మీ ఇంటికొచ్చాను ఇంటర్ చదువుతున్నప్పుడు గుర్తు పట్టలేదా, అరె కార్తిక్ నువ్వేనా ఏయ్ రజిని ….. రజిని ఎక్కడికెళ్లావే కార్తిక్ అన్న కార్తిక్ అన్న అంటూ ఎడిచేదానివిగా ఇన్నాళ్లకు వచ్చాడు అని అరుస్తూ ఉంటుంటేనే అశోక్ వచ్చి కార్తిక్ తో అవునురా కార్తిక్ నా చెల్లెలు గుర్తుంది గా అప్పుడు నీతో బలే ఆడుకునేది థాంక్స్ అమ్మ అంటూ ట్రే లోంచి కప్ తీసుకోగానే అశోక్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది అశోక్ చెల్లెలు రజిని మాత్రం తాను తన అమ్మ పడుకునే బెడ్రూం డోర్ దగ్గర కర్టెన్ చాటున దాక్కుంటు కార్తిక్ ని దొంగ చూపులు చూస్తూ చి చి ఇలాంటోడిని అన్న అన్న అని మళ్ళీ పిలుస్తాన ఏంటి.

1 Comment

  1. Please update full story, ramance ane kante suspence story ante baagundedi

Comments are closed.