తొలి ముద్దు సరసాలు 161

అలామొదలైన మా చాట్లో చాలా విషయాలని మాట్లాడుకున్నాము..
సినిమాలు, క్రికెట్, స్పోర్ట్స్, మ్యూజిక్, ఫిలాసఫీ, ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాము…
కొంతసేపు ఈ విషయాలు మాట్లాడిన తరువాత, భావన ఒక నిర్దుష్టమైన అభిప్రాయలు ఉన్న అమ్మాయి అని అర్థమయింది…
తనకు జీవితంలో ఏమి కావాలో తన జీవితాన్ని ఎలా మలచుకోవాలో తెలిసిన ఒక మెచ్యూరిటీ కలిగిన మనిషి గా అర్థమైంది…
అప్పటికే 9 గంటలు అయింది…
నేను తొందరగా తన ప్రేమ సంభంధాల టాపిక్ తీసుకువద్దామని అనుకున్నా, ఎందుకో తొందర చెయ్యలేక పోయాను..
ఇప్పటివరకు తన దగ్గర ఒక మచ్యురిటి ఉన్న మగాడిలా ప్రవర్తిస్తూ ఉన్నాను…
సడన్ గా అటువంటి టాపిక్ తీసుకువచ్చి చీప్ అయిపోదల్చుకోలేదు…
నేను కూడా అన్ని టాపిక్ లలో నా అభిప్రాయాలు చెప్తూ వచ్చాను…
కొంతసేపు తరువాత, సడన్ గా, తను ‘నా అభిప్రాయాలను, నేను వ్యక్తపరిచిన విధానం చాలా బాగా నచ్చాయి’ అని చెప్పింది…
ఒక్కసారి భుజం తట్టుకొని ‘శభాష్’ అని ఒక్కసారి నన్ను నేనే అభినందిచుకున్నాను…
కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, నేను చెప్పినవన్ని నాకు కరెక్ట్ అనిపించిన నా అభిప్రాయాలు మాత్రమే!.. వాటిల్లో makeup లు ఏమీ లేవు..
అందువలన నాకు గర్వం అనిపించింది సబబే..

ఇంతలో నా మనసు తెలుసుకున్నట్లుగా, తనే నా ‘Love టాపిక్’ తీసుకువచ్చింది…
తను ‘నా love life గురించి చెప్పు’ అని డైరెక్ట్ గా అడగడంతో, నేను, నా గురించి నా అభిప్రాయాల గురించి చెప్పాను…
నాకు అంత వరకూ యెవ్వరూ ‘ girlfriend’ లేదు అని చెప్పాను…
‘ఇంత ఇంటలిజెంట్ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే నేను నమ్మను’ అని అంది తను…
నేను వెంటనే, నా మనసులో ఎటువంటి అమ్మాయికి తావు ఉందొ చెప్పాను…
అలా మొదటిసారిగా, ఒక అమ్మాయికి నేను అంత ఓపెన్ గా నా మనసులో ఉన్న విషయం చెప్పడం జరిగింది.
తను నా అభిప్రాయాలను మెచ్చుకుంది…
‘నిన్ను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు’ అని అంది…
మళ్ళీ నాకు కొంచం గర్వంగా అనిపించింది…
నేను కొంచం సంకోచిస్తూ, తన విషయం అడిగాను…
తను ‘ఇంతకూ ముందెన్నడూ తన విషయాలు బయటవాళ్ళతో చెప్పలేదు’ అని అంటూ, ‘కాని ఎందుకో నీతో అవి చెప్పటానికి ఇబ్బందిగా ఫీల్ కావడం లేదు’ అంటూ, మెల్లగా చెప్పటం మొదలుపెట్టింది…
తను నన్ను స్పెషల్ గా ట్రీట్ చెయ్యడం నాకు చాలా సంతోషంగా అనిపించింది…

తను తన స్టొరీ చెప్పడం మొదలుపెట్టింది…
తనకు కాలేజిలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే వాడట…
కానీ తను ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడట…
తను ‘ఆ షాక్ నుండి బయటపడడానికి 3-4 సంవత్సరాలు పట్టింది’ అని చెప్పింది…
తరువాత తన తల్లిదండ్రుల కోరికను కాదనలేక, పెళ్లి చేసుకుందిట…
తనకు ఇప్పుడు వివాహ బధంలో ఏమి ఇబ్బందులు లేవు అని చెప్పుకొచ్చింది…
తనేందుకో అబద్ధం చెబుతోంది అనిపించింది నాకు..
తనూ అక్కడితో కొంతసేపు టైపు చెయ్యడం ఆపింది…
నాకు ఎలా స్పందించాలో కొంచం సేపు తికమక కలిగింది..
మనస్సులో తన గురించి నేను అనుకుంటున్నది నిజం అవుతుందేమో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది…
కానీ తనకు తానే చెప్పాలని మిన్నకున్నాను…
కొంత గాప్ తరువాత, మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది…
వాళ్ళాయన అంతా ఒక స్కూలు టీచర్ లాగా ఒక క్రమంలో ఉండేలా ఉంటాడని, అది తనకు చాలా బోర్ కొడు తుంది అని, చెప్పింది…
ఆయనకు, తన బిజినెస్ వ్యవహారాలు చాలా ఇంపార్టెంట్ అని, తన గురించి పట్టించుకునే తీరిక ఆట్టే లేదు అని చెప్పుకొచ్చింది…
అందుకే తను ఈ ఇంటర్నెట్లో తన అభిప్రాయాలకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాను అని కూడా చెప్పింది…
తన మనసులోని విషయాలు చెప్పుకునే వొక తోడు కోసం తను వెంపర్లాడుతున్నాను అని మెల్లగా వెళ్ళ బుచ్చింది…
అప్పటికే రాత్రి పదకొండు గంటలు కావస్తుండటంతో, ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకొని, చాట్ కి స్వస్తి చెప్పా ము…

ఇలా వారంరోజులు గడిచిపోయాయి…
ప్రతిరోజూ సాయంకాలం నుండి రాత్రి వరకు చాట్ చేసుకోవడం అలవాటు అయిపొయింది…
రోజు రోజుకీ తను నాకు దగ్గర అవుతోంది అని, అనిపించ సాగింది…
నాకూ నేను వెతుకుతున్న ఆ ‘అమ్మాయి’ తనే కావచ్చని బలంగా అనిపించసాగింది…
మా చాట్ లో చాల పర్సనల్ విషయాలు కూడా మాట్లాడడం మొదలు పెట్టాము…
తను చాల ముక్కుసూటి మనిషి అని చెప్పాలి…
తన అభిప్రాయాలని నిక్కచ్చిగా చెప్పడానికి వెనుకాడదు అని త్వరగానే నాకు అర్థం అయింది…
క్రమేణా, తనతో సెక్సు విషయాలు ముచ్చటించుకొనే చనువు మా ఇద్దరి మధ్య ఏర్పడింది…
దాంతో తనకు చాల సెక్సు యావ ఉంది అని నాకు ఖచ్చితంగా అనిపించసాగింది…
తన సెక్సువల్ ఇష్టాలని గురించి ఒకసారి అడిగాను…
తనకు బాగా కండలు తిరిగిన ఉన్న అబ్బాయిలు అంటే చాల ఇష్టం అని చెప్పింది…
వాళ్ళు చాల మ్యాన్లిగా ఉంటారనీ, అలా ఉండే అబ్బాయిలతో చేయించు కోవటమంటే తను చాల ఇష్టపడు తుంది అని చెప్పింది…
నాకు ఎగిరి గంతేయ్యలని అనిపించింది…
ఎందుకంటే నేను తను వెల్లడిస్తున్న ఊహలకు తగ్గట్టుగానే ఉంటాను…
ఇంక ఆపుకోలేక నేను తన ఫోటో పంపించమని అడిగేసాను…
తను ఏమాత్రం సంకోచం లేకుండా వెంటనే తన ఫుల్ స్కేప్ ఫోటో స్కాన్ పంపించింది….
నేను ఒక్కసారిగా స్టన్నయిపోయాను…
నాతో ఇన్నిరోజులు మాట్లాడిన అమ్మాయి ఇంత అందగత్తె అని నమ్మలేకపోయాను…
తను 5’4” అడుగుల ఎత్తుతో, యెత్తు పల్లాలు వయ్యారాలు పోతపోసిన విగ్రహం లాగా అద్భుతంగా ఉంది…
తను అంత సన్నము కాదు లావు అంతకంటే కాదు…
అన్ని వంపులు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నట్లు ఉంది…
ఈ అందం కోసం ఎన్ని యుద్దాలైన చెయ్యచ్చు, ఎన్ని యుగాలైన వేచిఉందవచ్చు అని అనిపించింది…
నిజంగా ఇలాంటి అమ్మాయి నాకు తారసపడటం నా అదృష్టం అనుకుంటూ, ఆ అందానికి దాసుడిని అయి పోయాను..
అదే విషయం తనతో చెప్పాను…

తను నా ఫోటో పంపించమని అడిగింది…
నేను కూడా వెంటనే పంపించాను…
తను కూడా నేను బాగా ఉన్నాను అని చెప్పింది…
అది విని నా చాతి నలుగు ఇంచీలు ఉబ్బిందని వేరే చెప్పక్కరలేదు!
అటువంటి అందమయిన అమ్మాయి కోసం ఎమైనా చెయ్యడానికి సిద్ధం అని ఆ రోజే డిసైడ్ అయ్యాను.
ఇలా ఇంకా కొన్నిరోజులు చాట్ చేస్కున్నాము…
ఇప్పుడు మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము…
తను నాలోని చాల లక్షణాలు నచ్చాయని చెప్పింది…

1 Comment

  1. Story matram super Andi dengudu lekunda only foreplay intha Baga rayochu Ani ippude telisindhi Inka ilane mi story ni rayandi I’m eegarly witing for ur story

Comments are closed.