తన కోసం 673

నీరసంగా ఆమె తల పైకెత్తి చూసింది కొన్ని క్షణాల పాటు చూసి వెంటనే తల మళ్ళీ మోకాళ్ళ మధ్యన దాచుకుంది

కళ్ళలో కన్నీరు కూడా రానంతగా ఎండిపోయిన కళ్ళు పూడుకు వాడిపోయిన చెంపలు పోల్చుకో లేనంతగా మారిపోయిన ముఖం వెరసి ప్రాణం లేని శవంలా చలనం లేని శరీరంలా మాంసపు ముద్దల కుప్పలా ఉంది ఆకాంక్ష

ఇప్పుడు ఆకాష్ అది తన భార్యెనని గుర్తించాడు
తన భార్యను ఇలాంటి ఒక రూపంలో ఉంటుందని అసలు ఊహించలేదు ఆకాష్
అందమైన తన భార్య ముఖ రూపం అతనికి ప్రతి క్షణం గుర్తు
కానీ ఇప్పుడు చూస్తున్నా ముఖం ఆమెది కానేకాదు ఎప్పటికీ అలా జరగదు నిండేన యవ్వనంతో మెరిసే తన భార్య ముఖ చర్మం ఇలా ముదుసలిలా మారాదు అది కూడా ఆరు నెలల కాలంలో అని ఆకాష్ చూస్తున్న దానికి విరుద్ధంగా మనసు చేబుతుంది

కానీ ఆకాష్ ఆమె చూసిన చూపు అతను చూసిన ఆమె కళ్ళు అది ఆకాంక్ష నే అని అతని గుండె ఘోషిస్తుంది

ఎందుకైనా మంచిదని మరోసారి పూడుకు పోయిన గొంతుకతో చిన్నగా ఆకాంక్ష అన్నాడు

ఈ సారి ఆమె తల ఎత్తకూండనే చిన్నగా ఏడవటం మొదలెట్టింది

ఆకాష్ గుండె లోతుల్లోంచి దుఃఖం పొంగుకొచ్చింది అతను ఏడవటం మొదలెట్టాడు
స్మృతి నిస్సహాయతతో అతని శరీరం ఆమె వైపు మెల్లగా కదులుతూ ఆమె పక్కకు చేరింది
ఆమె మరింతగా తన గుండె ఘోష వినిపిస్తుంది
అతని రాక ఆమెకు చేరువ అయ్యే కొద్ది

ఆకాష్ ఆమెను చేరువయ్యాడు ఆమె పక్కకు కూర్చోవడానికి ముందు ఆమె తలపై చేయి వేసాడు

ఆమె దుఃఖంతో మరింతగా ఘోషిస్తూ తన బాధను వ్యక్తం చేయాలని చూస్తుంది నిరశించిన ఆమె శరీరం ఆమె ఏడుపును ఆమె గొంతు చిన్న కిచు స్వరంతో పలుతుంది వినిపిస్తుంది అతనికి

మోకాళ్లు మధ్యన తన తల దాచుకుని బాధపడుతున్న ఆమె తల పైకెత్తాలని ప్రయత్నించాడు పక్కనే కూర్చుని ఏడుస్తూ ఆకాష్

ఆమె తన ముఖాన్ని అతనికి చూపడానికి నిరాకరించింది
అసలైతే కాసేపటికి ముందు అతడి రూపాన్ని చూసిన ఆమె ఆమె ఎంత తప్పు చేసిందో ఆమెకు తెలియజేసింది
ముందుగా ఆమె పాపను అతనికి అప్పగించి చచ్చిపోవాలని దృఢమైన నిర్ణయంతోనే ఇప్పటికి ఉంది

కానీ తను ఇల్లు వదిలి పోయే ముందు తన భర్త చూసినంత కాలం చూసి మారో పెళ్లి చేసుకుంటాడు అనుకుంది (కాదు కాదు అలా ప్రేరేపించబడింది )
తన భర్త ప్రేమను చాలా తక్కువగా అంచనా వేసింది (కాదు కాదు వేసేలా చర్యలు తీసుకోబడింది )
తన సుఖం తాను చూసుకుంటాడు అనుకుంది (కాదు కాదు అనుకునేలా చేసారు)

కానీ ఇప్పుడు తన భర్త తన కోసం రాక అతని
నిండైన విగ్రహంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండే తన భర్త ఇప్పుడు
దీన స్థితితో వడలి కృశించిన అతని శరీరం ముప్పేఏళ్ళకే పిచ్చి వాడిలా బెదురు చూపులతో చూడటం ఆమె చేసిన తప్పుకు అతనికే పెద్ద శిక్ష పడినట్లు ఆమెకు విపరీతమైన వేదనకు గురి చేసింది

సమయం గడుస్తు ఉంది ఇద్దరి మధ్య మాటలు లేవు చిన్నని స్వరాలతో ఏడవడం తప్ప ఆకాష్ చేయి ఇంకా ఆమె తల మీద ఉంది
చిన్నగా చెదిరిన మురికి జుట్టు నిమురుతూ

తనను ఇలా చూసి వదిలి వెళ్లి పోతాడు అనుకుంటూ ఉంది మరోసారి తన భర్త ప్రేమను తక్కవ చేసి ఆమె
కానీ అతను ఎంతకీ కదలక పోవడంతో అతను చూపిస్తున్న ప్రేమకు తాను అర్హురాలని కాదని తన ముఖాన్ని అతనికి చూపించాలేక మరింత
భాధతత్వ హృదయంతో కుమిలి పోతూ
ఉంది

సమయం గడుస్తునే ఉంది ఇంకో సారి ఆమె తలను ఎత్తడానికి ప్రయత్నించాడు అతడు
ఈ సారి ఆమె ఆమె ముఖం చూపడానికి ఇష్టం పడకపోయినా చివరి సారి అతని రూపాన్ని తన కంటిపాప లో భద్ర పరచి పోవాలి అనుకుంటుంది

తన భర్త రూపాన్ని కళ్ళారా చూసి
ఇంకా చాలు ఈ ఈ నీచమైన మనసు గల నా
చెడిపోయిన ఈ శరీరం అతను తాకడానికి కూడా పనికి రానిది అనుకుంటూ కళ్ళు మూసుకుంది హాయిగా
చాలా సేపటిగా నిలుపుకున్న ప్రాణాన్ని వదులుతూ చావును ఆహ్వానిస్తూ అతని భుజం మీద తల వాల్చింది

ఒకరకంగా ఇప్పుడు ఆమెకు స్వాంతన చేకురింది
అనే చెప్పాలి ఆమె మనసు శరీరం రెండు ఎంతగానో అలసి పోయాయి ఈ ఆరు నెలల కాలంలో అవసరానికి కోరికకు మోసానికి
గురయ్యింది
ఆమె బాధ్యతకు కామానికి తేడాను గుర్తించలేక పోయింది
ఆమె ఇల్లు విడిచి వెళ్ళే రోజు ఒక్కరోజు వాయిదా వేసినా ఇప్పుడు ఆమె పరిస్థితి ఇలా ఉండేది కాదేమో

ఆకాష్ ఎన్నో రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ చివరికి ఆ రోజు ఒక కఠిన నిర్ణయానికి వచ్చాడు

1 Comment

  1. అక్క రోల్ బాగుంటుంది

Comments are closed.