తన కోసం 673

నిర్విరామంగా సాయంత్రం దాకా కొనసాగుతూనే ఉంది

ప్రస్తుతం

నేలకు చతికిలపడి చావు కోసం పరితపిస్తూ వాడిలా ఎదో చిన్న ఆశతో ఇంటి గుమ్మాం వైపు చూస్తూ ఉన్నాడు ఆకాష్

అంతలో ఇంటి లాండ్ ఫొన్ మోగింది నిస్సత్తువగా నిరాశగా దాని వైపు చూసాడు
అతనికి ఎవరితోనూ మాట్లాడాలని లేదు తన భార్య వదిలి వెళ్ళాక ఇంటికే పరిమితం అయ్యాడు ఈ విశాల ప్రపంచంలో తనని పలకరించే దిక్కు కూడా లేదు తనకు ఉన్నది అతని భార్య బిడ్డ మాత్రమే ఇప్పుడు వారు కూడా లేరు

ఫొన్ మోగడం ఆగిపోయింది కానీ వెంటనే మారో సారి మోగడం మొదలైంది ఎందుకో ఆకాష్ మదిలో చిన్న ఆశ కలిగింది లేని సత్తువను తెచ్చుకుంటూ ఫొన్ తీసాడు

అవతలి వైపు నుంచి హాలో ఆకాష్ గారేనా మాట్లాడేది అంది ఒక ఆడ గొంతు తొందరగా ….
ఆ అన్నాడు ఆకాష్

నేను………..,……….. హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను నయన అనే పాప కండిషన్ ఏం బాగోలేక ఇక్కడ జాయిన్ చేసారు ఎవరో ఒక ఆమె ట్రీట్మెంట్ కి కూడా డబ్బులు లేవు ఆమె దగ్గర గట్టిగా అడిగితే మీ నెంబర్ ఇచ్చింది మీరు వెంటనే రావాలి అని చెప్పి ఫొన్ పెట్టేసింది

ఆకాష్ గుండే ఆగినంత పనైంది వెంటనే ఆగమేఘాలపై హాస్పిటల్ చేరుకుని వెంటనే పాప గురించి తెలుసుకోని పాపకు ట్రీట్మెంట్ కు కావాల్సిన డబ్బు కోసం తనకు తెలిసినా ఆఫీస్ ఫ్రెండుకు ఫోన్ చేసి ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయించి పాప ఆరోగ్యం కుదుట పడి ఆక్సిజన్ పెట్టి ఇప్పుడు భయం లేదు అని డాక్టర్లు చెప్పే వరకూ ఊపిరి కూడా తీసుకోలేదు ఆకాష్
సరేనా ఆహారం లేక జ్వరంతో చాలా రోజులుగా ఉండటం వల్ల ఇలా జరుగిందని డాక్టర్ చెప్పాడు

ఏం జరిగిందో తెలియదు ఎందుకు జరిగిందో తెలియదు కానీ పాప ఆరోగ్యంగా బాగుండాలి అని ఆకాష్ కోటి సార్లు తలుచుకుని ఉంటాడు దేవున్ని

అప్పటికి సమయం రాత్రి పన్నేడు దాటింది
హాస్పిటల్ అంతా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది డాక్టర్స్ అందరూ తమ డ్యూటీ అయిపోయాక ఇల్లుకు వెళ్ళిపోయారు

నైట్ డ్యూటీ నర్సులు అప్పుడప్పుడు తమ పని చేసుకుంటూ తీరుగుతున్నారు
ఆకాష్ పాప ఉన్న రూం సెకండ్ ఫ్లోర్ లో ఉంది
చాలా వరకు ఆ ఫ్లోర్ లో ఎవరూ లేరు పేషెంట్స్ కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు పడుకుని ఉన్నారు
మనిషి జాడ లేదు ఆకాష్ ఆ ఫ్లోర్ చివర ఉన్న నర్స్ దగ్గరికి వెళ్ళి పాపను జాయిన్ చేసిన ఆమె గురించి అడిగాడు

ఆమె ఎంత చెప్పినా వినకుండా రూమ్స్ చివర ఉన్న పబ్లిక్ టాయిలెట్ గొడకు అనుకుని కూర్చుని ఉంది ఉలుకు లేదు పలుకలేదు సాయంత్రం నుండి తన పరిస్థితి కూడా సరిగ్గా లేదు
తిండి తిని ఎన్ని రోజులు అయిందో
చూడ్డానికి బజారు దానిలా ఉంది అని ఇంకా ఎదో
అనబొయింది

ఆకాష్ కళ్ళు ఆ నర్సు వంక చూస్తూ ఆమె మీద నిప్పులు చెరిగాయి ఆమె భయపడిపోయింది

ఆకాష్ వెనువెంటనే కిందికి వెళ్లి తినడానికి ఏమైనా దొరుకుతాయోమోనని చూసాడు టి బన్ తప్ప ఆ రాత్రి వేళ ఆ ప్రాంతంలో ఏమీ లేవు
ఒక పెద్ద యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ గ్లాస్లో టి ఇంకా బన్ తీసుకుని పైకి వెళ్ళాడు రూములు ఒక్కోకటి దాటుతూ వెలుతున్నాడు
ఒక్కోక అడుగు వేెస్తుంటే అతనికి భార్య ఆకాంక్ష రూపం మదిలో మెదులుతుంది
ఇంకా తన భార్య తనతో ఉండిపోతోంది అనే సంతోషం కలుగుతుంది ఎప్పటిలాగేనే ముగ్గురు సంతోషంగా కలిసి ఉండోచ్చూ అనుకుంటున్నాడు

పేషెంట్స్ రూములు ఉండే ఫ్లోర్ దాటగానే పబ్లిక్ టాయిలెట్ వెళ్ళే దారి పక్కనే గొడకు అనుకుని
ముడుచుకుని తన రెండు మోకాళ్ల మధ్యన తన ముఖాన్ని తలను దాచుకుని ఒక స్త్రీ చాలా దీన స్థితిలో కూర్చుని ఉంది

మొదట అక్కడికి చేరిన ఆకాష్ టి బన్ పక్కనే ఉన్న కూర్చి మీద ఉంచి
ఆమెను చూసి ఆకాష్ ఆమె ఎవరో గుర్తించలేకపోయాడు
ఆమె ఆకారం వాలకం పరిస్థితి అలా ఉంది
దాదాపుగా ఆకాష్ తో ఉన్నప్పుడు ఉన్న బరువులో సగం కోల్పోయింది ఆమె
ఒంటికి చుట్టకున్న చీర దుమ్ము ధూళి కలిసి చిరిగి
పోయి ఉంది జుట్టు ధూళి రంగులో మాసిపోయి
కృంగి కృశించి పోయి ఉంది

ఆమెను నిశితంగా గమనిస్తున్న ఆకాష్కు తన భార్య రూపంలా కనిపించడమే లేదు ఆమె
ఆమె తన భార్య కాదు అని నిర్ధారించుకుని వెనుతిరగా బోయాడు

కానీ నర్సు చెప్పింది గుర్తుకు వచ్చింది అటు ఇటు చూసాడు అక్కడ మారో స్త్రీ జాడ లేదు
భయం భయంగా ఆమెను చూస్తూ ఆకాంక్ష అని పిలిచాడు

1 Comment

  1. అక్క రోల్ బాగుంటుంది

Comments are closed.