తన కోసం 673

తన కోసం

ఈ కధలోని పాత్రలు పేర్లు అన్ని కల్పితం ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు

ఆకాష్ ఇప్పుడు వయసు 34
ఆకాంక్ష వయసు ఇప్పుడు 32

ఆకాష్ కు 22 ఆకాంక్ష కు 20 ఏళ్ళ వయసులోనే పెళ్లి జరిగింది
ఆకాంక్ష కు అమ్మ నాన్న లేరు మేనమామ ఇంట్లోనే పెరిగి పెద్దదైంది ఆయనే పెళ్లి చేసాడు

ఆకాష్ తండ్రి చిన్న తనంలోనే పోవడంతో వారికున్న కొద్దిపాటి పొలాన్ని కౌలుకు ఇచ్చి ఆకాష్ ను బాగా చదివించాలని సీటీకి చేరుకుంది ఆకాష్ వల్ల అమ్మా

అంతా సవ్యంగా సాగి ఆకాష్ బాగా చదువుకోని మంచి ఉద్యోగం సంపాదించాడు తొందరగానే
ఆకాంక్ష సంబంధం రాగానే వెంటనే ఒకరికొకరు నచ్చి పెళ్లి జరిగిపోయింది

పెళ్లి కుదిరిన వెంటనే ఊరిలో పొలం అమ్మి సిటీకి దూరంగా ప్రశాంత వాతావరణంలో బాగా డబ్బు పెట్టి పేరుమోసిన వెంచర్ లో ఇండివిడ్యువల్ హౌస్ కట్టించాడు

పెళ్లి కాగానే కొత్త ఇంటిలో కొత్త కాపురం ఆనందంగా మొదలు పెట్టాడు అమ్మా ఆకాంక్ష ఉద్యోగం చాలా చక్కగా సాగుతుంది ఆకాష్ జీవితం ఆకాష్ ఇప్పుడు నీ వయసు 20 ఇంకా ఐదు సంవత్సరాల వరకు మనకు పిల్లలు వద్దు అన్నాడు ఆకాంక్షతో ఎందుకంటే ఉన్న డబ్బుతో ఇల్లు కొన్నాడు మరి కాస్త సమయం దొరికితే కాస్తా డబ్బు సంపాదించవచ్చు అని అలాగే తన ఉద్యోగంలో ప్రమోషన్ కలుగుతుంది అని
అలాగే తమ శృంగార జీవితం కొన్ని రోజులు సరదాగా గడపవచ్చు అని కూడా
ఆకాంక్ష కు 24 ఏళ్ళ వయసులో అంటే పెళ్లి జరిగిన నాలుగేళ్లకు అత్తగారు అంటే ఆకాష్ అమ్మా గారు చనిపోయారు

ఆ తరువాత సంవత్సరం గడిచాక పాప పుట్టింది
ఆకాష్ తన తల్లి మళ్ళి తనకి బిడ్డగా పుట్టింది అని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు

ప్రస్తుతం

నిస్తేజంగా తలుపు వైపు చూస్తూ ఉన్నాడు ఆకాష్
తనలో తాను కుమిలి పోతూ నెలపైన పడి ఏడుస్తూ లోలోపల

అతని భార్య వెళ్లిపోయింది అతన్ని వదిలి
ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయాయి
ఎందుకో ఈ రోజు చాలా గుర్తుకు వస్తుంది
ముఖ్యంగా పాప అతని కూతురు మరి మరి ఎక్కువగా గుర్తుకు వస్తుంది
తన ఆరేళ్ల కూతురు నయన గుర్తుకు రాగానే ఒక్కసారిగా అతని కళ్ళు కన్నీటితో వర్షంచడం మొదలుపెట్టాయి

అసలు ఆకాంక్ష వదిలి పోవడానికి కారణం అతనికి ఇప్పటికీ అర్థం కాలేదు
ఏ రోజు తనని కొప్పడింది లేదు కష్టపెట్టింది లేదు
పైగా ఆకాంక్ష చేసిన తప్పును కూడా మన్నించి జరిగింది మరిచి పోయి సంతోషంగా మిగిలిన జీవితం తనతో గడపాలి అనుకున్నాడు
ఆ నిజం తెలిసిన ఆ రోజే

కానీ ఆకాంక్ష ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా ఊహించలేదు ఆకాష్

ఆరునెలల క్రితం వరకు ఈ ప్రపంచంలో తనకంటే అదృష్టవంతుడు ఇంకోడు లేడు అనుకోనే వాడు ఆకాష్ అనుకువైన భార్య దానికి తోడుగా అబ్బరా పరిచే అందంతో చిలిపిగా నవ్వుతూ భర్త కళ్ళకు రోజు కొత్తగా అందంగా ఆకట్టుకునేలా కనిపించేది ఆకాంక్ష
తమ ప్రేమకి గుర్తుగా చాలా కాలానికి పుట్టిన నయన ఒక మనిషికి జీవితంలో ఇంతకంటే సంతోషం ఉంటుందా ఈ ప్రపంచంలో అనిపించేది ఆకాష్ కు

కానీ ఇప్పుడు అతని బాధ వర్ణనాతీతం ఎంతో ప్రేమగా చూసుకున్నా అతని భార్య ఇంకా ప్రేమగా ప్రాణంగా చూసుకుంటున్నా అతనో కూతురిని తీసుకోని ఇంకోకడితో వెళ్లి పోయింది
దాదాపు ఈ ఆరు నెలల కాలంలో ఆకాష్ బయటికి వచ్చింది లేదు ఇంట్లోనే ఏడుస్తూ చిక్కి సగం అయిపోయాడు ఉద్యోగం పోయింది అతడి వాలకం చూసిన వారెవరైనా ఇంకా ఆకాష్ చివరిరోజుల్లో ఉన్నాడు అనుకుంటారు

1 Comment

  1. అక్క రోల్ బాగుంటుంది

Comments are closed.