తన కోసం 673

ఇంతా చూసినా ఆకాష్ కు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎలా నడిచి వచ్చాడో తెలియదు కానీ బెడ్ రూం లోకి చేరాడు ఒళ్ళంతా చెమటలు పట్టాయి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి
ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి

అలాగే వెళ్లి బాత్రూం షవర్ ఆన్ చేశాడు
తల మీద పడుతున్నా నీటిలో అతని కన్నీళ్ళు కలిసి ప్రవాహంలా ప్రవహిస్తున్నాయి

ఒక పదిహేను నిమిషాలకు అంతా అయిపోయాక బెడ్ రూమ్ లోకి ఆకాంక్ష వచ్చింది తన భార్య వచ్చినట్లు అనిపించి తడిసిన బాత్రూమ్ లో బట్టలు విడిచి టవల్ తో తుడుచుకుని టవల్ చుట్టుకొని బయటకు వచ్చాడు
వచ్చేసరికి ఆకాంక్ష చీరలు ఉంచే చోటా ఎదో సర్దుతూ కనిపించింది

ఆకాంక్ష ఆకాష్ ను చూసి లేచారా
నేను రెడీ మీరు రెడీ అయితే బయటికి వెళ్దాం అన్నారుగా వెళ్దాం అంది గాభర గాభరాగా
ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు అనిపించింది ఆకాష్ కు ఆకాంక్ష ముఖంలో

ఆకాంక్షకు అనుమానం రాకుండా తన బాధ బయటికి తెలియకుండా ఉండటం చాలా కష్టంగా ఉంది ఆకాష్ కు నిరసం నిస్సత్తువ ఆవరించి

ఆకాష్ రెడీ అయ్యి వచ్చేసరికి పాపను తయారు చేసి తను తయారేంది ఆకాంక్ష
ముగ్గురు కలిసి మూవీకీ వెళ్ళారు
ఆకాష్ మామూలుగా ఉండటానికి చాలా ప్రయత్నిస్తున్నాడు కానీ కావడంలేదు
అందరూ మూవీ చూస్తూ ఉంటే
తన భార్య తనకు చూపించిన సినిమా తన కళ్ళ ముందు కనబడుతుంటుంది అతనికి ఎంతో ప్రాణంగా ప్రేమించిన తన భార్య తనని మోసం చేసి ఇలా వేరే వాడితో సంబంధం పెట్టుకోవడం అతనికి ఊపిరి పిల్చుకోవాడం కూడా చాలా చాలా బరువుగా భారంగా ఉంది

అతని ఆలోచనలు నిదానంగా తన భార్య తనకు చేసినా ద్రోహం మోసం నుంచి అలా ఎందుకు చెంసిందో అనే విషయం పైకి మళ్ళింది
ఎంత ఆలోచించినా ఎందుకు ఎందుకు ఎందుకు అన్న ప్రశ్న తప్ప అతనికి తన భార్యకు తనేం తక్కవ చేసాడో అనే సమాధానం దొరికేలా కనిపించాడం లేదు

ఎంత ఆలోచించినా అతనికి సమాధానం దొరికలేదు సినిమా అయిపోయింది
తరువాత రెస్టారెంట్ వెళ్లి భోజనం చేసి బయలు దేరారు కారు నడుపుతున్నప్పుడు ఆకాంక్ష అడిగింది ఒకసారి ఏంటి అదోలా ఉన్నారు అని

లేదు ఎదోలా ఉంది ఆకాంక్ష తల నొప్పి అనుకుంటాను అన్నాడు ఆకాష్ పొడిగా

అయ్యో చెప్పనే లేదు ఇంట్లోనే ఉండే వాళ్ళము
అంది ఆకాంక్ష

ఇంటికి చేరాక పాపను తన రూం లో పడుకోబెట్టి
ఇద్దరు బెడ్ మీద చేరి పైకి చూస్తూ ఎవరి ఆలోచనలలో వారు ఉన్నారు

ఆకాష్ మనసులోను భయం భయంగాను కంగారుగాను ఉంది
కానీ ఆకాంక్ష కు తన ప్రియుడు మళ్ళీ వచ్చినందుకు సంతోషంగా ఇంకోవైపు తెలియకూడనిది జరగకూడనిది
జరగడం ఇంద్రనీల్
నిజం చెప్పడం వల్ల కంగారుగా ఉంది

ఆకాంక్ష కూడా సినిమా చూస్తూ ఉన్నంత సేపు ప్రియుడి పాత జ్ఞాపకాలు మనసులో మెదులుతూనే ఉన్నాయి
అంతే కాకుండా అతను చూపించిన నిజం తన గుండేలో బాంబులా పేలింది దాని గురించే సాయంత్రం నుండి ఆలోచిస్తూ ఉంది
ఒక వైపు భాధగానూ మరోవైపు సంతోషంగాను రెండు మిశ్రమమైన భావనలతో ఉంది

రేపు అతను వస్తే ఎలా ఎదుర్కోవాలనే ఆలోచిస్తుంది అప్పుడు జరిగిందానికి కొన్ని రోజులు భాధ పడింది మర్చిపోయింది

కానీ ఇప్పుడు భర్తతో కలిసి సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటుంది
ఇప్పుడు అతనితో సంబంధం అంత మంచిది కాదు అనిపిస్తుంది ఆకాంక్షకు కానీ అతను వినిపించుకోనేలా లేడు
రేపు అతను వస్తే ఎలాగైనా నచ్చచెప్పి బ్రతిమాలో తన కాపురం నిలుపుకోవాలని దృఢ నిశ్చయంతో మనసులో అనుకుంది

మారో వైపు ఆకాష్ ఆలోచనలు తన భార్య చేసిన తప్పును తనతోనే నేరుగా అడిగి తనకి తనేం తక్కవ చేశాడో తెలుసుకోవాలని ఉంది
కానీ తన మనసు కష్ట కలుగుతుందేమో ఎలాంటి పరిణామాలు చూడవలసి వస్తుందో భయంతో మౌనంగా ఉన్నాడు

అలా మరో ఆలోచన వైపు ఇంకో ఆలోచన వైపు అలా పరిపరివిధాల ఆలోచిస్తూ
పక్కనే ఉన్న భార్యా ఆకాంక్ష ముఖం వైపు చూసాడు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి తనలో తాను మదన పడుతు చేతి వేళ్ళు నలుపుకుంటు ఉన్న ఆకాంక్షను చూసి మెల్లగా చేయి ఆమె మీద వేసాడు

పాత జ్ఞాపకాల తొంతరలోంచి బయట పడిన ఆకాంక్ష
ఆకాష్ తో ఆ రాత్రి కలవడానికి ఎందుకో మనసు అంగీకరించలేదు

పడుకొండి తల నొప్పి అన్నారుగా అంటూ తల నిమురుతూ పడుకుంది ఆ రాత్రి ఇద్దరికీ కాలా రాత్రి అయింది ఎప్పుడూ పడుకున్నారో తెలియదు ముందుగా ఆకాష్ నిద్ర లేచాడు రాత్రంతా ఆలోచించి తన భార్య చేసిన తప్పును క్షమించాలని అనుకున్నాడు
బాత్రూం వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి బెడ్ రూమ్ లో బట్టలు తీస్తూ నిన్న అతను ఎదో కాగితం ఇవ్వడం గుర్తుకు వచ్చి తన భార్య చీరల్లో వెతికాడు అక్కడ ఏమైనా ఉంచి ఉంటుందని

1 Comment

  1. అక్క రోల్ బాగుంటుంది

Comments are closed.