నాగులమ్మ:- నిజం చెప్పు నీవు ప్రేమించింది మీ అత్తనే కదా..
నేను:- నీళ్లు నములుతూ.. ఛీ..ఛీ..
నాగులమ్మ:- నీ పరిస్థితి, మీ అత్తా పరిస్థితి ఒక్కటే.. ఇద్దరు ఒకరినొకరిని చూసుకొనే విధానం లోనే తెలిసిపోతుంది..
నేను:- తల్లి లేని పోనీ పుకార్లు పుట్టించకు.. నాకు ఆధారం మా మామయ్యవాళ్లే.. నా కడుపు కొట్టకు.
నాగులమ్మ:- పిచోడ.. మీ మామయ్య కు నీ మీద అనుమానం వచ్చింది . మీ చిన్న మామయ్య. చిన్న అత్తకు నీ మీద అనుమానం వుంది ముగ్గురు మా తాతయ్య దగ్గరకు వచ్చారు.. మా తాతయ్య సలహా మేరకు మీ మంగుళూరు ట్రిప్, మామయ్య వూరు వెళ్లడం.. అన్నిటిలోను పాస్ అయ్యావు.. మీ మధ్యన ఇంకా ఏమైనా ఉందేమో అని తెలుసుకోవడానికి నన్ను ఇక్కడికి పంపారు. నేను పిల్లలకు పాలు పట్టించడానికి చీర సర్దుకుంటుంటే నీవు అక్కడ నుంచి వెళ్లడం చూసాను. వయసుకు వచ్చిన కుర్రోళ్లు చేసే ఏ పనులు నీవు చెయ్యలేదు .. నా పరీక్షలో కూడా నీవు పాస్ అయ్యావు.
నేను :- నాకు తెలుసు మామయ్యకు నా మీద అనుమానం వుంది అని.. కానీ నేను అత్తలను తప్పుగా ఎప్పుడు చూడలేదు. నేను తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు..
నాగులమ్మ:- మీ మామయ్యకు నీ మీద అనుమానం వుంది అని ఎలా తెలుసు..
నేను:- మామయ్య నా వెనకాల ఒక మనిషిని పెట్టాడు వాడు నేను రోజు ఏమి చేస్తున్నాను అని మామయ్యకు చెపుతున్నాడు..
నాగులమ్మ:- నేను కూడా నిన్ను పరీక్షిస్తున్నాను అని నీకు తెలుసా…
నేను:- తెలియదు..
నేను:- ఈ విష్యం నాకు చెప్పావు కానీ అత్తకు చెప్పకు, మామయ్య అంటే అత్తకు పిచ్చి ప్రేమ.. మామయ్య అనుమానించాడు అంటే అత్తా తట్టుకోలేదు.. గుండె పగిలిపోతుంది..
నాగులమ్మ:- నీవు ప్రేమించిన అమ్మాయి ఎవ్వరు??
నేను:- మా హెడ్ మాస్టారుగారి చుట్టాల అమ్మాయి..
నాగులమ్మ:- నీ విష్యం మా తాతయ్యకు చెప్పను.. తాతయ్య మీ మామయ్యలు పిలచి అనుమానం పెట్టుకోవద్దు అని చెప్పాడు.
నేను:- నీవు నా బ్రతుకు కుక్కలు సింపిన విస్తర కాకుండా కాపాడావు. నా జీవితం లో నాకు సహాయం చేసిన వాళ్ళ కన్నా నా చేతి వేళ్ళు ఎక్కవ.. నీ ఋణం ఎప్పటికి మర్చిపోలేను అని కాళ్ళ మీద పడ్డాను
నాగులమ్మ:- మనం మాట్లాడుకున్న విష్యం మీ అత్తయ్య వినేసింది.
పక్క రోజు అత్తయ్య చెక్ అప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళింది.. వస్తూ నాగులమ్మ ను వాళ్ళ ఇంటిలో దేబెట్టి వచ్చారు..
ఆ రోజు రాత్రి
నేను:- పెద్ద అత్తా నన్ను క్షమించు.. నా వల్ల మామయ్య నిన్ను అనుమానించాడు..
పెద్ద అత్తా మాట్లాడకుండా వెళ్ళిపోయింది..
నాగులమ్మ లేదు కాబట్టి పెద్ద అత్తకు పెద్ద మామయ్యకు భోజనం చిన్న అత్తా పంపిస్తుంది..
ఉదయం చిన్న అత్తా.. పెద్ద అత్తా కు టిఫన్ పంపింది.. నేను వెళ్లే సమయానికి పెద్ద మామయ్య పెద్ద అత్తా కోపం గా ఆరుచుకుంటున్నారు.. పెద్ద మామయ్య నన్ను చుసిన వెంటనే నా చేతిలో ఉన్న టిఫిన్ క్యారేజ్ తో కొట్టడం మొదలు పెట్టాడు. ఏమి జరిగిందో నాకు తెలియదు లేచి చుస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నాను. ఎడం చేయి కి కట్టు కట్టారు.. తలకు కుట్లు వేశారు.. ఒంటిలో నెప్పి ఎక్కడ నుంచి వస్తుందో కూడా అర్ధం కాలేదు.. డాక్టర్ గారు వచ్చిన తరవాత మూడు పక్కటెముకలు విరిగిపోయాయి, అదృష్టం బాగుంది వట్టలకు చిన్న దెబ్బ తో పోయింది అని చెప్పారు. నెల రోజులు హాస్పిటల్ లో ఉన్నాను నన్ను చూడడానికి ఒక్కరు కూడా రాలేదు. చేతి కట్టు తీసి ఇంటికి పంపారు. పెద్ద మామయ్య షాప్ కి వెళ్ళాను. డబ్బులు ఇచ్చి కటింగ్ చేయించుకొని ఇంటికి వెళ్ళమన్నాడు.
పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అఖిల మేడం ఉన్నారు.. నేను స్నానం చేసిన తరవాత నన్ను సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకొని వెళ్లి నా దెబ్బలకు మామయ్యకు ఏ సంబంధం లేదు అని సైన్ చేయించి కోర్ట్ లో అదే విష్యం చెప్పించారు. నన్ను వైజాగ్ తీసుకొని వెళ్లారు.. కేసు కొట్టే వరకు అక్కడే ఉన్నాను. తరవాత పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు.
అఖిల మేడం:- ప్రశాంతి (పెద్ద అత్తా) అసలు ఏమి జరిగింది.. వాడిని ఇలా ఎందుకు కొట్టారు. వాడి కష్టం చూసి నేను తట్టుకోలేక పోయాను.. ఊపిరి తీసుకుంటుంటే కూడా నెప్పి తో ఏడిచేవాడు.. ఉచ్ఛకి కి వెళ్తే కూడా ఏడిచేవాడు.. వాడు నటిస్తున్నాడు అని అనుమానం తో డాక్టర్ గారిని అడిగితె వాడికి తగిలిన దెబ్బకు ఉచ్చ పోసుకొనేటప్పుడు నరాలను కోస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పారు.
వాడిని ఆలా కొట్టే బదులు చంపేసి ఉంటె బాగుండేది.. ఎంత శత్రువుకైనా ఆ పరిస్థితి రాకూడదు.. అంత బాధలో కూడా వాడు మీ గురుంచి తప్పుగా మాటలాడలేదు.. ఈ రెండు నెలలు చుసిన తర్వాత వాడి మీద నాకు జాలి కలిగింది.. ఆడదానివి కాబట్టి నీవు అర్ధం చేసుకుంటావు అని ఈ విష్యం చెపుతున్నాను. తల్లి తండ్రి లేని పిల్లోడి విష్యం లో మనం చాల తప్పు చేస్తున్నాము అని బాధ గా ఉంది.. కొంచం జాగ్రత్తగా చూసుకో.. మీవల్ల అవ్వదు అనుకుంటే నా దగ్గరకు పంపు నేను చూసుకుంటాను… నేను చెప్పింది నమ్మకు వాడిని రెండు రోజులు గమనించు నీకే విష్యం అర్ధమవుతుంది..
డాక్టర్ గారు వాడిని కింద పడుకోవద్దు అని చెప్పారు.. కింద నుంచి పైకి లేచినప్పుడు పక్కటెముకలు మీద చాల ఒత్తిడి పడుతుంది అని చెప్పారు. నేను ఎంత చెప్పిన వినకుండా నెల మీదే పడుకొనే వాడు.
మన భర్తలకు అర్ధం అవ్వదు.. మగాడు అంటే అన్ని తట్టుకోవాలి అని సొల్లు చెపుతారు.. జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళిపోయింది..
ఉంకో నెలరోజు పట్టింది కొంచం మనిషిలాగ అవ్వడానికి.. చిన్నగా మల్లి మామయ్య వ్యాపారం చూసుకోవడం మొదలు పెట్టాను…. ముందు నవ్వుతు సరదాగా ఉండే వాడిని ఇప్పుడు నా పని నేను చూసుకుని ఆఫీస్ లో కుర్చునేవాడిని.. పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి .. చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లిన మిద్దె పైన పడుకొనేవాడిని.
పెద్ద మామయ్య వాళ్ళ నాన్నగారి సంవత్సరీకం వచ్చింది.. ఆ రోజు పెద్ద మామయ్య వాళ్ళ ఇంటిలో కార్యక్రమం జరిగింది.. అమ్మ వాళ్ళు కార్యక్రమం కి రాలేదు.. కార్యక్రమం రోజు సాయంత్రం వచ్చారు.. కార్యక్రమం రోజు రాత్రి పెద్ద మామయ్య కుటుంబం, చిన్న మామయ్య కుటుంబం, మా అమ్మ, మా అమ్మ మొగుడు అక్కడ ఉన్నారు.
మగాళ్లు మందు తాగుతున్నారు..ఆడవాళ్ళూ ఒక పక్క కూర్చుని మాటలాడుకుంటున్నారు. నేను పనులన్నీ ముగుంచుకుని పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ అమ్మను చూసి వెంటనే మనసులోని బాధ తన్నుకొని వస్తుంది..
పెద్ద మామయ్య :- చెల్లి నీ కొడుకు వచ్చాడు చూడు..
మా అమ్మ:- పెద్ద.. నాకు కొడుకు లేదు.. కూతురే ఉంది.. అన్ని వాడి చావుతోనే పోయాయి..
పెద్ద మామయ్య :- వాడి తండ్రి చావు కి మన మీద పగ తీర్చుకోవడానికి వ్యాహుం రచించాడు.. ఇక్కడ గుడి పూజారికి డబ్బులు ఇచ్చి వాడి జాతక ప్రభావం మా మీద ఉంటుంది అని చెప్పించాడు. నాకు అనుమానం వచ్చి మన వురి పూజారిగారిని అడిగితె ఆలాంటి ప్రభావం ఏమి లేదు అని చెప్పారు. వాడి ప్రభావం కమల మీద కొంచం పడుతుంది అని చెప్పిన వెంటనే వాడిని గమనించడం మొదలు పెట్టాను.. మట్టి బుర్రది వాడిని కొడుకు లాగా చూసుకుంటుంటే.. వాడు మాత్రం నా మీద తన బుర్రలో చెడు నింపుతున్నాడు అని అర్ధం చేసుకోలేకపోయింది..
కొంచం ఉంటె చంపేసేవాడిని.. చంపితే ఒక్క నిమిషం లో ప్రాణం తుస్ మని పోతుంది.. ఊపిరి తీసుకున్న, ఉచ్చ పోసుకున్న ప్రతిసారి నేను గుర్తుకు వచ్చేలాగా చేశాను జీవితాంతం భయం తో బ్రతుకు తాడు..
మా అమ్మ:- వాడిని చంపేస్తే శత్రుశేషం లేకుండా పోతుంది అన్న..
పెద్ద మామయ్య :- వాడు బ్రతికి ఉన్న చచ్చిన పాము లెక్కే వాడి గురుంచి మర్చిపో..
చిన్న మామయ్య :- అన్నయ్య వాడికి మొగతనం కూడ లేకుండా చేసేసాడు.. వీడితో నే ఆ పోరంబోకు గాడి వంశం అంతరించిపోతుంది..
మా అమ్మ:- మీరు ఎన్ని చెప్పిన వీడిని చంపి రైల్వే ట్రాక్ మీద పడేస్తే .. దరిద్రం మొత్తం పోతుంది.. ఈ కొజ్జా వెదవ ఉన్నాడనే మీ ఇంటికి కూడా రావడం లేదు.. ఈ దరిద్రుడిని చుస్తే వాడు గురుకు వచ్చి నా రక్తం మరిగిపోతుంది.. ఇక్కడే వీడిని చంపేయాలి అనిపిస్తుంది.. నా కళ్ళ ముందు నుంచి దెంగేయి… అని అరిచింది…
నా కన్నా తల్లి… నన్ను ఇంత అసహ్యించుకోవడానికి నేను ఏమి చేశాను??? తల్లి ప్రేమ కోసం తపించడం తప్ప??????

బాగుంది నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా అప్ లోడ్ చేయండి
థాంక్స్