పూర్ణ చంద్రుడు Part 5 4

గూడెం వాళ్ల నాటు వైద్యం ద్వారా కొంచెం కోలుకున్నాడు మనోహర్ అలా నడుస్తూ బయటికి వచ్చి ప్రకృతి నీ ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ తనకు మాత్రమే తన గురించి నిజం తెలుసు తను ఒక werewolf అనే నిజం బయటకు వచ్చే లోపు అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అనుకున్నాడు, అప్పుడు లక్ష్మి వచ్చి “సారు ఎలా ఉంది” అని అడిగింది “పర్లేదు లక్ష్మి బాగానే ఉంది రెండు రోజుల తరువాత వెళ్లిపోతా నేను ఇక్కడే ఉంటే మీ గూడెం వాళ్లకు ఇంకా ఇబ్బంది పెరుగుతుంది” అని అన్నాడు మనోహర్ దానికి లక్ష్మి “అయ్యో ఏంది సారు మీరు ఇంకో నెల దాక యాడికి పోయేదేలా మీరు ఇక్కడే ఉంటే మాకు ఎట్లాంటి ఇబ్బంది లా” అని చెప్పింది దానికి మనోహర్ మెల్లగా నవ్వాడు అప్పుడు లక్ష్మి చలాకీగా పరుగులు తీస్తు అందరినీ పలకరిస్తు వెళ్లింది ఎందుకో తెలియకుండా మనసు లక్ష్మి వైపు వెళ్లింది మనోహర్ కీ కానీ తన అంతరాత్మ మాత్రం “రేయ్ నీకు పెళ్లి అయ్యి ఒక కొడుకు ఉన్నాడు” గుర్తు చేస్తోంది అప్పుడే ఒక పాప టీ తెచ్చి మనోహర్ కీ ఇస్తూ అక్క ఇచ్చింది అని లక్ష్మి వైపు చూపించింది అప్పుడు లక్ష్మి తన చేతిలో ఉన్న టీ తాగుతూ మనోహర్ వైపు చూసి కొంటెగా నవ్వి చూపు తిప్పి నవ్వుతూ ఉంది.

ఆ ఒక్క నవ్వ తో మనోహర్ లో మనసు అదుపు తప్పింది మెల్లగా ఆకర్షణ కాస్త ప్రేమగా మారింది అలా నెల రోజుల పాటు అక్కడే ఉండి కొంచెం కోలుకున్నాడు అప్పుడు ఒక రోజు కొంతమంది జీప్ లో ఆ ఊరికి వచ్చి జనాలను తీసుకోని వెళ్లారు వాళ్ల దగ్గరికి వెళ్లి లక్ష్మి “అన్న మా అబ్బ పోయిన వారం వచ్చిండా మళ్లీ తిరిగి రాలేదు ఎమైంది” అని అడిగింది, దాంతో వాడు లక్ష్మి నీ కింద నుంచి పై దాక చూసి “డిపో కాడనే యాడో తాగి పడింటాడు రా వెతుకుందువు కానీ” అని అన్నాడు దానికి లక్ష్మి కూడా జీప్ ఎక్కి వాళ్లతో పాటు పోయింది వెళ్లింది దాంతో మనోహర్ కూడా అడవి లోకి నడుస్తూ వెళ్లి ఒక్క సారిగా గట్టిగా ఊళ వేశాడు దాంతో werewolf లాగా మారి ఆ జీప్ నీ వెంబడిస్తూ వెళ్లాడు వాళ్లు ఆ డిపో దగ్గరికి వెళ్లిన తర్వాత ఒక పిల్లోడు వచ్చి లక్ష్మి నీ గట్టిగా కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టాడు “అక్క అబ్బ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎత్తక పోయినారు” అని ఏడ్వడం మొదలు పెట్టాడు దాంతో లక్ష్మి లోపలికి పరిగెత్తుతూ వెళ్లి అక్కడ ఉన్న మేస్త్రీ నీ ఏడుస్తూ వెళ్లి వాళ్ల నాన్న గురించి అడిగింది దానికి వాడు లక్ష్మి నడుము పట్టుకొని లాగి తన నోట్లో ఉన్న సిగరెట్ పొగ లక్ష్మి మీద ఊదుతు “ఒక వారం నా పక్క లో పడుకో తరువాత మీ అబ్బ బ్రతికి ఉంటే ఇంటికి వస్తాడు లేదా నువ్వు ఏమీ దిగులు పడోద్దు నిన్ను నేను ఉంచుకుంటాలే” అని అన్నాడు ఆ మాట పూర్తి అయిన వెంటనే లక్ష్మి మొహం మీద రక్తం చుక్కలు పడ్డాయి ఏమీ జరిగింది అని చూస్తే ఆ మేస్త్రీ రెండు గా చీలి పడ్డాడు అది చూసి లక్ష్మి గట్టిగా అరిచింది అప్పుడు తన ముందర ఉన్న మనోహర్ నీ చూసి ఇంకా గట్టిగా అరిచింది దాంతో బయట ఉన్న వాళ్లు లోపలికి వచ్చారు అప్పుడు వాళ్లు మనోహర్ నీ చూసి భయపడి పరుగులు తీశారు కానీ మనోహర్ వాళ్ల వెంట పడి అందరినీ చంపేశాడు ఆ తర్వాత మెల్లగా మనిషి గా మారాడు మనోహర్ అప్పుడే మనోహర్ మనిషి లాగా మారడం చూసింది లక్ష్మి.

మనోహర్ ఒక్క సారిగా ముందు వెనుక ఆలోచించకుండ మొత్తం అందరినీ చంపేశాడు, ఆ తర్వాత ఆవేశం తగ్గించుకోని మామూలు మనిషిలాగా మారాడు మనోహర్ తిరిగి మనిషి గా మారడం చూసిన లక్ష్మి భయపడలేదు లక్ష్మి నీ చూసిన మనోహర్ ఏమీ మాట్లాడలేదు అక్కడి నుంచి మౌనంగా వెళ్లాడు, తిరిగి గూడెం కీ చేరుకున్న తరువాత మనోహర్ అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు అప్పుడే వచ్చిన లక్ష్మి, మనోహర్ నీ చూసి “వెళ్లిపోతానావా సారు” అని అడిగింది దానికి మనోహర్ ఏమీ మాట్లాడకుండా తల ఆడించి బయటకు వచ్చాడు అప్పుడే ఒక ఏనుగు గట్టిగా అరుస్తూ కూలబడి పోయింది దాని కాసే మావటి వాడు కంగారు పడ్డాడు అప్పుడు మనోహర్ అది చూసి ఆ ఏనుగు దగ్గరికి వెళ్లి చూశాడు దాని చెక్ చేసి “ఈ ఏనుగు కడుపుతో ఉంది ఎవరికి తెలియద ఇప్పుడు ప్రసవం కీ తయారుగా ఉంది” అని చెప్పి అందరినీ పక్కకు వెళ్లమని చెప్పి ఆ ఏనుగు నీ పాముతు దాని ప్రసవం కీ ట్రీట్ చేస్తూ ఉన్నాడు దాంతో ఆ ఏనుగు ఒక మగ ఏనుగు కీ జన్మనిచ్చింది దాంతో అందరూ మనోహర్ నీ భుజాల పైకి ఎత్తుకొని జేజేలు పలికారు అది అంత చూసిన మనోహర్ కీ ఏమీ అర్థం కాలేదు ఇది అంత చూసిన లక్ష్మి, మనోహర్ నీ తనతో పాటు ఆ గూడెం కొలిచే నరసింహ స్వామి గుడి దగ్గరికి తీసుకొని వెళ్లింది “ఇందాక నువ్వు చేసింది నువ్వు సారు, అలాగే ఆ డిపో కాడా చేసింది కూడా ఆ సామి చేసిందే చెడోలను చంపడము నువ్వు ఈడనే ఉంటే మాకు ప్రమాదం లేదు సారు నువ్వే మాకు ధైర్యం ఆలోచించుకో” అని చెబుతూ మనోహర్ కడుపు దెగ్గర accident వల్ల అయిన గాయం దెగ్గర రక్తం రావడం తో దానికి పసుపు పెట్టి తన చీర చింపి కట్టు కట్టింది లక్ష్మి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *