(20 సంవత్సరాల క్రితం)
అడవిలో నరసింహ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది దానికి ఊరి పెద్ద హోదాలో మనోహర్, లక్ష్మి చేతుల మీదుగా ఆ కళ్యాణోత్సవం జరుగుతుంది అప్పుడు వివేక్ రిపోర్ట్స్ తో మైసూర్ లో దిగాడు, అప్పుడే గూడెం లో ఏదో జాతర ఉంది అని తెలుసుకొని ఊరికి చేరుకున్నాడు అప్పటికే ఊరులో పండగ వాతావరణం వ్యాపించి తాగేవాళ్లు తాగుతూ ఉన్నారు, తినేవాళ్లు తింటూ ఉన్నారు. అప్పుడే వివేక్ అతి కష్టం మీద మనోహర్ నీ కనుకోని మాట్లాడాలి అని గుడికి వెనుక వైపు ఉన్న కొండ పైకి తీసుకోని వెళ్లాడు అక్కడ అప్పటికే, బాల వాళ్ల నాన్న, వేద వాళ్ల వాళ్ల ఫ్రెండ్స్ కొంతమంది కలిసి కలు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు, “అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ రా” అని అడిగాడు మనోహర్ దానికి వివేక్ “నీ రోగం కీ మందు కనిపెట్టాను అని చెప్పడానికి వచ్చా” అని అన్నాడు దానికి మనోహర్ ఆశ్చర్యంగా “ఏంట్రా నువ్వు చెప్పేది” అని అడిగాడు దాంతో వివేక్ నవ్వుతూ సిగరెట్ వెలిగించి “నిజమే ఆ రోజు నువ్వు ల్యాబ్ లో ఉన్నప్పుడు నీ బ్లడ్ నీ తీసుకోని కొన్ని టెస్ట్ లు చేశాను అప్పుడు నీ DNA లో మనిషి DNA కీ బదులు కొంచెం కొత్త ఫీచర్స్ ఉన్న DNA కనిపించింది అప్పుడే డౌట్ వచ్చింది దాంతో నేను zoological టెస్ట్ సెంటర్ కీ పంపించి టెస్ట్ చేయిస్తే వాళ్లు ఇది ఒక wolf DNA అని చెప్పారు దాంతో ఎప్పటి నుంచో మా DVA ఫార్మసీ ఎప్పటి నుంచో ఒక్క కొత్త రకం మెడిసిన్ తయారు చేయాలని చూస్తున్నాం అప్పుడే నీ రిపోర్ట్ మా బాస్ దేవవ్రత గారికి దొరికింది వెంటనే నిన్ను తీసుకోని రమ్మని నను పంపించారు” అని అన్నాడు దానికి మనోహర్ కోపంగా, వివేక్ షర్ట్ పట్టుకొని గట్టిగా లాగాడు అప్పుడు వివేక్ బాగ్ లో నుంచి మనోహర్ బ్లడ్ sample ఎగిరి కింద చెట్టు కొమ్మ తగిలి ఆ రక్తం చిమ్మి కింద తాగుతున్న వాళ్ల కలు కుండ లో పడి అది తాగి అందరి లోపల ఏదో మార్పు మొదలు అయ్యింది “రేయ్ ఆ దేవ్ గాడు పెద్ద ఏదవ వాడు వాడి pharmacy నీ no 1 లో పెట్టడానికి ఎలాంటి పని అయిన చేస్తాడు వాడి దెగ్గర నువ్వు పని చేస్తున్నావు అని తెలిసి వింటే నీ దగ్గరికి వచ్చే వాడినే కాదు” అని చెప్పాడు.
అప్పుడు వివేక్ తన బాస్ ఇంత నీచుడు అని తెలియక చాలా పెద్ద తప్పు చేశా అని ఆలోచనలో పడ్డాడు, అప్పుడే కింద కలు తాగుతున్న వాళ్లు werewolves గా మారి వివేక్ మీదకు వచ్చారు అప్పుడు మనోహర్ వచ్చి అందరినీ నుంచి వివేక్ నీ కాపాడాడు దాంతో తన బాగ్ చెక్ చేసుకున్న వివేక్ తన sample మిస్ అయ్యింది అని తెలుసుకొని మనోహర్ తో విషయం చెప్పాడు దాంతో మనోహర్ అందరికీ అర్థం అయ్యేలా చేశాడు అలా వాళ్లు తమ కుటుంబాలతో కలిసి వెళ్లి గుహ వెనుక గూడెం మొదలు పెట్టారు అలా వాళ్లకు పుట్టిన పిల్లలకు కూడా werewolf పవర్ తో పుట్టారు అలా పిల్లలు అందరూ అడవిలోనే పుట్టి పెరిగారు కాకపోతే మనోహర్, రామ్ తో పాటు అందరూ పిల్లల్ని బయటకు పంపి చదివించాలి అనుకున్నాడు కానీ రామ్ కీ వాళ్లతో కలిసి ఉండటం లేదు అందుకే మనోహర్ తో గొడవ పడి మరీ ఫ్రాన్స్ కీ వెళ్లి అక్కడ హోటల్ మ్యానేజ్మేంట్ లో చేరి ఒక చెఫ్ అయ్యాడు.
