పూర్ణ చంద్రుడు Part 5 4

కార్ లో కలిసి మైసూర్ కీ వెళుతున్న లీలా, శ్రీను ఇద్దరు ఒకరి తో ఒకరు ఏమీ మాట్లాడలేదు అలా మౌనం గా ఇద్దరు మైసూర్ వైపు ప్రయాణం అయ్యారు, కానీ శ్రీను మనసులో ఒకటే ఆలోచన తిరుగుతూ ఉంది వీలు నా cousins ఆ లేదా మా నాన్నకు ఏమైనా అని ఆలోచిస్తూ అలా అయ్యి ఉండదు ఆనుకొని కార్ నీ ఒక ధాభా లో ఆపి భోజనానికి రమ్మని చెప్పాడు శ్రీను దాంతో లీలా తన walking stick తో కిందకి దిగింది అది చూసి శ్రీను ఏంటి అని అడిగాడు దానికి లీలా నవ్వుతూ “నేను అంధురాల్ని అన్నయ్య” అని చెప్పింది దాంతో శ్రీను ఒక్క సారిగా షాక్ అయ్యాడు ఒక ఇందాక building లో ఎలాంటి సహాయం లేకుండా డైరెక్ట్ గా వచ్చి కార్ లో కూర్చుని ఉన్న అమ్మాయి ఇప్పుడు blind అని చెబితే నమ్మలేక పోయాడు శ్రీను, అప్పుడు లీలాకి శ్రీను మనసులో ఉన్న సందేహం అర్థం అయ్యింది “నేను ఒకసారి దేన్నైనా అంచనా వేస్తే అది మొత్తం నా మెదడులో ఉండిపోతుంది అన్నయ్య పైగా పున్నమి రోజు పుట్టిన ఏ werewolf అయిన ఏదో ఒక లోపం తో పుడతారు” అని చెప్పింది దాంతో శ్రీను కీ కొన్ని విషయాలు అర్థం అయ్యాయి “అవును నువ్వు నాకూ కజిన్ అవుతావా, లేకపోతే నాకూ సవతి చెల్లి అవుతావా అంటే నిన్ను బాధించాలి అని కాదు ఉరికే అడుగుతున్న” అని చెప్పాడు శ్రీను, దానికి లీలా నవ్వి “నీ రెండో అనుమానమే అన్నయ్య” అని చెప్పింది తరువాత తన జేబులో ఉన్న ఒక pendrive తీసి శ్రీను కీ ఇచ్చి “నీ అనుమానాలకు జవాబులన్ని ఇందులో ఉన్నాయి” అని చెప్పి పక్కన మైసూర్ బస్ అని వినిపిస్తే ఆ బస్ వైపు వెళ్లింది లీలా దాంతో శ్రీను తనని ఆపాలని చూశాడు అప్పుడు లీలా “అన్నయ్య అందులో నాన్న నీకు చెప్పాలి అనుకున్న విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు ముందు దీని ఒక కేసు లాగా కాదు, ఒక ఫ్యామిలీ ఇష్యూ గా కాదు, కొన్ని వందల కుటుంబాలను కాపాడే ఒక మిషన్ లాగా చూడు, స్వార్ధం కోసం అడవి తల్లి గుండెలు చీల్చే రాక్షసుల అంతం లాగా చూడు నేను ఇప్పటికే ఈ విషయం లో తెలియక చాలా తప్పులు చేశా రామ్ ఇప్పుడు ఆ పరిస్థితి లో ఉండడానికి కారణం నేనే కాబట్టి నువ్వు మాత్రమే మాకు ఉన్న ఒకే ఒక ఆధారం ఎందుకంటే నువ్వే మా ‘సామ్రాట్’ ” అని చెప్పి బస్ ఎక్కి మైసూర్ వెళ్లింది లీలా.

శ్రీను, లీలా చెప్పింది అంతా విన్న తర్వాత ఆ pendrive తీసుకొని వెళ్లి కార్ లో ఉన్న తన laptop కీ పెట్టి చూడడం మొదలు పెట్టాడు అందులో మనోహర్ ఒక video రూపంలో ఒక లెటర్ పెట్టి వెళ్లాడు అందులో ఇలా ఉంది.

” శ్రీను my son నువ్వు ఈ లెటర్ చూస్తూ ఉన్నావు అంటే నేను ఈ భూమి మీద ఉండి ఉండకపోవచ్చు కాబట్టి నా జీవితంలో జరిగిన రెండో అధ్యయనం నీతో పంచుకుంటానా, అవును నిజమే నాకూ రెండో ఫ్యామిలీ ఉంది నీకు ఒక తమ్ముడూ ఉన్నాడు నేను ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఆ లారీ నీ ఢీ కొట్టా కానీ నేను ఎందుకో బ్రతికి ఉండాలి అనే కారణం తో ఆ దేవుడు నన్ను కాపాడాడు నేను వెళ్ళి flyover కింద వెళ్లే ఏదో transport లారీ మీద పడ్డా అది మైసూర్ పక్కన ఉన్న ప్రియాపటనా అడవి ప్రాంతం కీ వెళ్లింది అక్కడ టింబర్ డిపో లో పని చేసే కార్మికులకు నేను దొరికా నన్ను వాళ్లే కాపాడి నాకూ కొత్త జన్మించారు అప్పుడు నేను పూర్తిగా స్ప్రుహ లోకి వచ్చిన తర్వాత ఆ గూడెంలో లక్ష్మి నీ చూశా తనే నాకూ వైద్యం చేసింది, ఎందుకో తెలియదు మొదటి సారి మీ అమ్మను చూసినప్పుడు కలిగిన అదే భావన లక్ష్మి పైన కలిగింది” వెంటనే video నీ ఆపి ఆకాశం వైపు చూసి “నాకూ కూడా ఎందుకు అబ్బ ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి నచ్చారు అని అనుకున్న నా అబ్బా నీ అబ్బ నీ బుద్ధులే వచ్చాయి నాకూ” అని తిట్టుకుంటు మళ్లీ video నీ చూడడం మొదలు పెట్టాడు.

(మనోహర్ గతం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *