బాధ లో ఉన్న లీలా వెళ్లి చెరువు దెగ్గర కూర్చుంది అప్పుడే అక్కడికి పక్కనే ఉన్న మెడికల్ క్యాంప్ నుంచి లీలా నీ చూసి చెరువు దగ్గరికి వచ్చింది డాక్టర్ నికిత, లీలా భుజం మీద చేయి వేసింది నికిత దాంతో తన కంటి నుంచి కారుతున్న నీరు తుడుచుకొని నికిత వైపు చూసింది లీలా “ఏంటి బేబీ క్యాంప్ లో చెకింగ్ అయిపోయిందా” అని అడిగింది దానికి నికిత, లీలా మొహం తన అర చేతిలో తీసుకోని నుదుటి మీద ముద్దు పెట్టి “అంత సరి అవుతుంది దిగులు వద్దు మీ పెద్దన కూడా వచ్చాడు కదా” అని చెప్పింది దానికి లీలా చిన్నగా నవ్వుతూ ఉంది అప్పుడే ఒక నాలుగు జీప్ లు వచ్చి ఆగాయి వాళ్ల ముందు దాని వెనుక ఒక jaguar కార్ వచ్చింది అందులో నుంచి సిగరెట్ తాగుతూ దిగాడు దేవ్ “Wow wow love birds ఇద్దరు ఒకటే చోట చేరారా నా పని ఇంకా తేలిక అయ్యింది వెళ్లి ఆ డాక్టర్ పిల్లను తీసుకొని రండి” అని అన్నాడు దేవ్, రామ్ నీ కంట్రోల్ చేయడం వల్ల తన werewolf శక్తులు ఏవి పని చేయడం లేదు లీలా కీ దాంతో కోపం వచ్చిన కూడా ఏమీ చేయలేక పోయింది అప్పుడు ఇద్దరు guards నికిత నీ తీసుకువెళ్లాలి అని తన మీద చెయ్యి వేయగానే లీలా ఒకడి చెయ్యి విరిచి ఇంకొకడి కాలు మీద కొట్టి తన మోకాలి తో వాడి దవడ ఎముక విరగోటింది, దాంతో దేవ్ షాక్ అయ్యాడు కానీ చప్పట్లు కొడుతూ ఉన్నాడు అప్పుడే తన guards మొత్తం ఒకడి తరువాత ఒకడు వచ్చి తన కాలు దెగ్గర పడ్డారు దేవ్ కీ ఏమీ జరిగిందో అర్థం కాలేదు అప్పుడు తన ముందు నిలబడి ఉన్న శ్రీను నీ చూసి భయం తో వెనకు జరిగాడు దేవ్ కానీ చిన్నగా నవ్వాడు ఆ నవ్వు కీ అర్థం తెలియక శ్రీను చూస్తూ ఉన్నాడు అప్పుడు వెనుక చెట్టు మీద ఉన్న sniper తన గన్ లో ఉన్న సిల్వర్ బుల్లెట్ నీ గురి చూసి శ్రీను నీ కాల్చాడు ఆ గన్ పేలిన శబ్దం విని లీలా వేగంగా వచ్చి శ్రీను నీ పక్కకు తోసి ఆ బుల్లెట్ తను తగిలించుకుంది దాంతో శ్రీను, దేవ్ ఇద్దరు షాక్ అయ్యారు అప్పుడు నికిత వచ్చి లీలా నీ చెక్ చేస్తూ ఉంది దాంతో శ్రీను, దేవ్ మెడ పట్టుకొని పైకి లేపాడు “నా చెల్లి కీ ఏమైనా కావాలి నా కొడుక నిను పీస్ పీస్ చేస్తా” అని ఆవేశం గా అన్నాడు దానికి దేవ్ “నీ చెల్లి ఏంట్రా అది నా కూతురు రా” అని అన్నాడు ఆ మాట వినగానే శ్రీను, దేవ్ నీ వదిలి ఆలోచనలో పడ్డాడు ఆ టైమ్ లో దేవ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు
లీలాకి తగిలిన బుల్లెట్ గాయం నీ చూసింది నికిత లక్కీ గా ఆ బుల్లెట్ చేతికి తాకి వెళ్లింది లోపలికి దిగలేదు దాంతో ఆ గాయం కీ ట్రీట్మెంట్ చేస్తోంది నికిత, అప్పుడే లోపలికి వచ్చిన శ్రీను, లీలా నీ చూసి ఎలా ఉంది అని అడిగాడు, దానికి నికిత “ఏమీ పర్లేదు లక్కీ గా బుల్లెట్ గీసుకోని వెళ్లింది అంతే” అని చెప్పింది దానికి శ్రీను “అయిన Vampires కీ వెండి తగలగానే భస్మం అయిపోతారు కానీ లీలా కీ ఎందుకు ఏమీ కాలేదు” అని అడిగాడు, దాంతో నికిత “Vampires తో పోలిస్తే werewolves కీ కొంచెం చర్మం మందం ఎక్కువ ఉంటుంది అంత తేలికగా వెండి శరీరం దాటి వెళ్లదు అదే Vampires కీ అయితే షార్ప్ గా ఉన్న ఏమీ తగిలిన సరే వాళ్లు చనిపోతారు” అని చెప్పింది అప్పుడు శ్రీను “అసలు ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు” అని అడిగాడు దానికి నికిత తన చేయి ముందుకు షేక్ హ్యాండ్ ఇస్తూ “నేను నికిత మీ నాన్న మనోహర్ ఫ్రెండ్ వివేక్ కూతుర్ని నీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి నాతోరా” అని చెప్పింది దానికి శ్రీను లీలా వైపు చూస్తూ ఉంటే నికిత “don’t worry వాళ్లు ఈ మెడికల్ క్యాంప్ లైన్ లోపలికి రారు అది అగ్రిమెంట్” అని చెప్పింది దాంతో శ్రీను అనుమానంగానే నికిత తో కలిసి వెళ్లాడు అప్పుడు ఇద్దరు అడవిలో ఒక గుహ లోకి వెళ్లారు అది దాటి బయటకు వెళ్లిన తర్వాత చూస్తే అక్కడ చాలా మంది జనం ఉన్నారు వాళ్లంత ఒంటి మీద tattoos తో గోడల పైన అడవి మధ్యలో ఉన్న ఉన్న ఒక సింహాసనం మీద ఒక తోడేలు కూర్చుని ఉన్నట్టు ఉన్న బొమ్మలు గీసి ఉంచారు అప్పుడు నికిత “బాల ఎక్కడ” అని అడిగింది అప్పుడు అక్కడ ఉన్న ఒక కొట్టం నుంచి ఆరు అడుగుల ఎత్తు కండలు తిరిగిన శరీరం తో ఒంటి పైన tattoos తో ఒక కుర్రాడు బయటకు వచ్చాడు, వాడి చూపు రావడం రావడంతో శ్రీను మీద పడింది, నికిత వైపు చూసి ఏంటి అన్నట్టు సైగ చేశాడు బాల, అప్పుడే బాల వెనుక వచ్చి నిలబడింది ఒక అమ్మాయి తన నడక నుంచి కంటి చూపు వరకు పొగరు కనిపించింది శ్రీను కీ దానికి నికిత “సామ్రాట్” అని చెప్పింది దానికి అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా మోకాలి పైన కూర్చుని వాళ్ల తల వంచారు శ్రీను కీ కానీ బాల అతని పక్కనే ఉన్న అమ్మాయి ఇద్దరు మాత్రం శ్రీను నీ సామ్రాట్ గా స్వీకరించలేదు. “అసలు ఏమీ జరుగుతుంది నికిత ఎవరూ వీళ్లంత ఎందుకు నన్ను అందరూ సామ్రాట్ అని పిలుస్తున్నారూ” అని అడిగాడు.
దానికి నికిత “ఇక్కడ నేను తప్ప మీరందరూ werewolves ఏ వీళ్లందరు నీ cousins బాల మీ పిన్ని వాళ్ల చెల్లి కొడుకు ఆ అమ్మాయి పేరు వేద, బాల లవ్ చేసే అమ్మాయి, అప్పుడు కడుపుతో ఉన్న ఇంకో అమ్మాయి వచ్చి శ్రీను నీ పట్టుకొని “అన్న రామ్ అన్నని ఏటైన కాపాడు అన్న నా బిడ్డ కు మేనమామలు ముగ్గురు కలిసి పేరు పెట్టాలా” అని చెప్పింది దానికి నికిత “తన పేరు వెన్నెల, బాల చెల్లి నీకు కూడా తన భర్త శంకర్ దేవ్ చేసిన కొన్ని ప్రయోగాల వల్ల చనిపోయాడు” అని చెప్పింది దాంతో శ్రీను, వెన్నెల నీ గట్టిగా కౌగిలించుకున్నాడు దాంతో తెలియకుండా తన కంటి నుంచి నీరు కారింది అప్పుడు బాల ఆవేశం గా వచ్చి వెన్నెల నీ వెనకు లాగి “నీకు ఒక్కడే అన్న అది నేనే బయటోలకు మనకు సంబంధం లా ఒక్కడు దుడ్ల కోసం ఆ తెల్ల పిల్ల కోసం అడవిని నాశనం చేసినా పట్టించుకోలా, ఇన్ని రోజులు మనం ఉన్నాం అని కూడా తెలియనోడు ఈ రోజు ప్రేమ చూపేదానికి వచ్చినాడు” అని కోపంగా అక్కడి నుంచి వెన్నెల నీ వేద నీ తీసుకోని వెళ్లాడు, అది విన్న శ్రీను “లీలా డబ్బు తీసుకుంది అన్నారు ఇప్పుడు రామ్ కూడా డబ్బు తీసుకున్నాడు అన్నారు అసలు ఏమీ జరిగింది నికిత” అని అడిగాడు శ్రీను దానికి నికిత ఇలా చెప్పడం మొదలు పెట్టింది.
